E-Paper
Advertisement

Fuel Shortage: పెట్రోల్ నిల్వలు పుష్కలం ఆందోళన వద్దు: కమిషనర్ సాయి చైతన్య

Fuel Shortage: పెట్రోల్ నిల్వలు పుష్కలం ఆందోళన వద్దు: కమిషనర్ సాయి చైతన్య
Advertisement

Fuel Shortage: స్వేచ్ఛ బ్యూరో: నిజామాబాద్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని నిజామాబాదు పోలీస్ కమీషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వదంతుల కారణంగా మంగళవారం రాత్రి నుంచి ప్రజలు ఆందోళనకు గురవుతూ, ఒకేసారి పెద్ద సంఖ్యలో పెట్రోల్ బంకులకు వెళ్లి వాహనాల్లో ఫుల్ ట్యాంక్ నింపించుకోవడం వల్ల అనవసర రద్దీ, అంతరాయం ఏర్పడుతున్నదని తెలిపారు. జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకుల్లో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని , సరఫరా కూడా నిరంతరంగా కొనసాగుతున్నదని పేర్కొన్నారు.

Also Read: Kalyan Ram: వెంకటేష్ సినిమాలో యంగ్ బ్యూటీతో రొమాన్స్ చేయనున్న కళ్యాణ్ రామ్..!

అసత్య ప్రచారాలు

Advertisement

ఎటువంటి కొరత పరిస్థితి లేదని, ప్రజలు అవసరానికి మించి ఇంధనం నిల్వ చేసుకోవద్దని సూచించారు. అలా చేయడం వల్ల ఇతరులకు అసౌకర్యం కలుగుతుందని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మకూడదని, నిర్ధారించని సమాచారాన్ని షేర్ చేయడం ద్వారా గందరగోళం సృష్టించవద్దని పోలీస్ కమీషనర్ గారు విజ్ఞప్తి చేశారు. జిల్లాలో శాంతిభద్రతలు కాపాడేందుకు పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని , వదంతులు వ్యాప్తి చేయడం లేదా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే చర్యలు చేపడితే , సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Also Read: Chicken Shops Close: చికెన్ లవర్స్‌కు భారీ షాక్.. ఏప్రిల్ 1 నుంచి దుకాణాలు క్లోజ్.. ఎందుకంటే?

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×