E-Paper
Advertisement

Decisions by Union Cabinet: కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. దేశవ్యాప్తంగా 100 కొత్త విమానాశ్రయాలు..

Decisions by Union Cabinet: కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. దేశవ్యాప్తంగా 100 కొత్త విమానాశ్రయాలు..
Advertisement

Decisions by Union Cabinet: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. దేశ భద్రత, విమానయాన రంగం, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ప్రభుత్వం భారీ కేటాయింపులు చేపట్టింది. ఈ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.

దేశ భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా ఇమ్మిగ్రేషన్, వీసా, విదేశీయుల రిజిస్ట్రేషన్ ట్రాకింగ్ (IVFRT) ప్రాజెక్టుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. విదేశీయుల రాకపోకలను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 1800 కోట్ల రూపాయల ఖర్చుకు అనుమతి నిచ్చింది. దీనివల్ల వీసా ప్రక్రియ వేగవంతం కావడంతో పాటు, అక్రమ చొరబాట్లను అరికట్టడం సులభతరం అవుతుంది.

Advertisement

సామాన్య ప్రజలకు విమాన ప్రయాణాన్ని మరింత చేరువ చేసేందుకు UDAN 2.0 పథకానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. పదేళ్ల వ్యవధిలో ఈ పథకం కోసం 28,840 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగాకొత్తగా 100 విమానాశ్రయాలను అభివృద్ధి చేయనున్నారు.

దేశవ్యాప్తంగా 200 హెలిప్యాడ్‌లను అత్యాధునిక హంగులతో ఆధునీకరిస్తారు. ఎయిర్‌లైన్స్ ఆపరేటర్లకు ఆర్థిక భరోసా కల్పించేందుకు వయబిలిటీ గ్యాప్ ఫండ్ (VGF) కింద 10,043 కోట్ల రూపాయల సహాయాన్ని ప్రభుత్వం అందించనుంది.ఈ పథకం ద్వారా కొత్తగా మరో 120 ప్రాంతాలకు విమాన సర్వీసులు విస్తరించనున్నాయి.

Advertisement

పర్యావరణ పరిరక్షణ కోసం ‘నేషనల్ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్’ (NDC) విధానానికి క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో భాగంగా సాంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాబోయే కాలంలో దేశ మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో 52 శాతం వాటాను పునరుత్పాదక ఇంధన వనరుల నుండే సాధించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Read Also: Rythu Bharosa: పీఎం కిసాన్ దారిలో రైతు భరోసా.. నిధుల జమ మార్పుపై క్లారిటీ ఇవ్వని సర్కార్!

Related News

మెట్లపై నుంచి జారిపడి చనిపోయిన గ్లోబల్ టెర్రరిస్ట్

ఆర్మీ రహస్యాలు చైనాకు లీక్.. జమ్ము కాశ్మీర్‌లో తెలంగాణ మహిళ అరెస్ట్!

చనిపోయింది నూడిల్స్ వల్ల కాదట.. అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!

ఐక్యరాజ్యసమితిలో ఉద్యోగం.. డిగ్రీ చేసినవారికి సూపర్ అవకాశం.. అర్హతలు ఇవే

ఆలయంలో ఓ లారీ బీభత్సం, 12 మంది మృతి-30 మందికి గాయాలు, గ్వాలియ‌ర్‌లో ఘటన

దుర్గా మండపం కూలిన ఘటన..19 మంది మృతి, 25 మందికి గాయాలు, కోల్‌కత్తాలో ఘటన

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

Big Stories

Advertisement
×