E-Paper
Advertisement

Outsourcing Staff: జీతాలులేక పంచాయతీ రాజ్ ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఆవస్ధలు.. పట్టించుకోని అధికారులు

Outsourcing Staff: జీతాలులేక పంచాయతీ రాజ్ ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఆవస్ధలు.. పట్టించుకోని అధికారులు

Outsourcing Staff: స్వేఛ్చ బ్యూరో: ఒకటికాదు.. రెండుకాదు.. 8నెలలుగా పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీరాజ్ శాఖలో నిధులు ఉన్నప్పటికీ వేతనాలకు మాత్రం రిలీజ్ చేయడం లేదు. దీనికి అధికారుల నిర్లక్ష్యమే కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. డీపీఓ అకౌంట్లకు బడ్జెట్ మారినా ఫలితం లేకుండాపోయింది. దీంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీవనం అగమ్యగోచరంగా తయారైంది. కుటుంబ పోషణ భారంగా మారింది.

6నుంచి 10 నెలలుగా జీతాలు..

గ్రామాల్లో పరిపాలన నుంచి రికార్డుల నిర్వహణ వరకు ప్రభుత్వానికి వెన్నుదన్నుగా పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలోని ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది నిలుస్తున్నది. వారి బతుకులు ప్రస్తుతం అగమ్యగోచరంగా మారాయి. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా చెమటోడ్చుతున్నా.. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంతో వారికి వేతన వెతలు తప్పడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఈ శాఖలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వేలాది మంది ఔట్​సోర్సింగ్ సిబ్బందికి 6నుంచి 10 నెలలుగా జీతాలు రావడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనిచేస్తేనే పూటగడిచే చిరుద్యోగులు నెలల తరబడి జీతాలు రాక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి అద్దెలు కట్టలేక నరకయాతన అనుభవిస్తున్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, డీఆర్డీఓ, మండల కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది పరిస్థితి మరీ దయనీయంగా మారింది. కంప్యూటర్​ ఆపరేటర్లకు అక్టోబర్‌ నుంచి జీతాలు రావడం లేదని సమాచారం. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నా.. వారి కష్టానికి ప్రతిఫలం దక్కడం లేదు.

ఖాతాల్లో డబ్బులున్నా..

జీతాల చెల్లింపులో అధికారుల నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఔట్ సోర్సింగ్ కార్యదర్శుల జీతాల చెల్లింపు బాధ్యతను ఎంపీడీవో ఖాతాల నుంచి డీపీవో ఖాతాలకు మార్చారు. ఈ ప్రక్రియ పూర్తయి, డీపీవో అకౌంట్లలో నిధులు జమ అయి నెలన్నర గడుస్తోంది. బడ్జెట్ ఉన్నప్పటికీ, జీతాలు మాత్రం సిబ్బంది ఖాతాల్లో పడటం లేదు. నిధులు విడుదలైనా టెక్నికల్ కారణాలు, అధికారుల తాత్సారం వల్ల వేలాది కుటుంబాలు పస్తులు ఉండాల్సి వస్తోంది. డబ్బులు అకౌంట్ లో ఉన్నా.. జీతాలు వేయడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించాలని పలువురు విజ్ఞప్తులు చేస్తున్నారు.

Also Read: Romantic Movie OTT : ఇద్దరు అబ్బాయిలను ప్రేమలో పడేసే అమ్మాయి… మతి పోగొట్టే క్లైమాక్స్ ట్విస్ట్

జీతాల్లో భారీగా కోతలు..

జీతాల విషయంలో భారీ కుంభకోణం జరుగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. గతంలో పీఆర్, ఆర్డీ డైరెక్టర్​గా పని చేసిన సృజన.. ఔట్ సోర్సింగ్ పంచాయతీ సెక్రటరీలు (ఓపీఎస్)కు రూ.19,500 జీతం ఫిక్స్ చేస్తూ సర్క్యూలర్ ఇచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరేలా ఉంది. కొన్ని జిల్లాల్లో రూ.2,500 కోత విధించి రూ.17,500 ఇస్తున్నారని సమాచారం. రాష్ట్రంలోని 20కి పైగా జిల్లాల్లో మాత్రం చేతికి వస్తుంది రూ.10 వేల నుంచి రూ.12 వేలు, గరిష్టంగా రూ.15 వేలు మాత్రమేనని ప్రభుత్వం రిలీజ్ చేస్తున్న రూ.19,500లో మిగిలిన డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్తోందన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై ఉన్నతాధికారులు దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. జీవో ప్రకారం ఇస్తే ఉద్యోగులకు మేలు జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఏజెన్సీలు–అధికారుల కుమ్మక్కు?

జిల్లా స్థాయి అధికారులు, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాహకులు కుమ్మక్కై జీతాల్లో కోత విధిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. డీపీవో ఆఫీసుల్లోని సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, డీపీవోలు ఏజెన్సీలతో నిధులను పక్కదారి పట్టిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. పలు జిల్లాల్లో తక్కువ జీతాలపై సిబ్బంది నిలదీస్తే.. ఈ మూడు నెలలు ఇంతే వస్తాయి.. సర్దుకోండి, తర్వాత చూద్దాం అంటూ అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం సమాచారం. ప్రభుత్వం తక్షణమే స్పందించి, డీపీవో ఖాతాల్లో ఉన్న నిధులను విడుదల చేయాలని, ఫిక్స్ చేసిన రూ.19,500 జీతాన్ని పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

ఈ-పంచాయతీ ఆపరేటర్లకూ తప్పని కష్టాలు

రాష్ట్ర వ్యాప్తంగా ఈ-పంచాయతీ ఆపరేటర్లు వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాలుగైదు నెలలుగా జీతాలు రాకపోవడంతో అప్పులపాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీల్లో పంచాయతీ ఆపరేటర్లు జనన-మరణ ధృవీకరణలు, ఆస్తిపన్ను నమోదు, పారిశుధ్య సంబంధిత ఆన్‌లైన్‌ పనులు, ప్రభుత్వ పథకాల డేటా ఎంట్రీ వంటి కీలక బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. గ్రామ పరిపాలన కీలక పాత్ర పోషిస్తున్నా.. వేతనాలు సకాలంలో అందకపోవడంపైగా.. వచ్చే జీతంలో కూడా కోతలు విధిస్తుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పని భారంతో ఇబ్బంది పడుతున్నామని ఇచ్చే వేతనం కూడా సక్రమంగా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ పోషణ, పిల్లల ఫీజులు, ఇంటి అద్దెలు, అప్పుల వడ్డీలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని ఆపరేటర్లు వాపోతున్నారు.

Also Read: Praveena Deshpande: ప్రముఖ బాలీవుడ్ నటి ప్రవీణ దేశ్ పాండే కన్నుమూత.. క్యాన్సర్‌తో పోరాడి..

Related News

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Big Stories

×