దేశ వ్యాప్తంగా వందేభారత్ సేవలు మరింత విస్తరిస్తున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా సుమారు 150 వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇవాళ మరో 9 వందేభారత్ రైళ్లు ప్రారంభం కాబోతున్నాయి. ఈ రైళ్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ (సెప్టెంబర్ 24న) మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభించనున్నారు. దేశ వ్యాప్తంగా రైలు కనెక్టివిటీని బలోపేతం చేయడం, ప్రయాణీకులకు ఆధునిక ప్రయాణ సౌకర్యాలను అందించడంలో భాగంగా ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ 9 కొత్త వందేభారత్ రైళ్లను ఇవాళ అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆ రైళ్లు ఏవి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
1.ఉదయపూర్–జైపూర్
2.తిరునల్వేలి–మధురై–చెన్నై
3.హైదరాబాద్–బెంగళూరు
4.విజయవాడ–చెన్నై (రేణిగుంట ద్వారా)
5.పాట్నా–హౌరా
6.కాసరగోడ్–తిరువనంతపురం
7.రూర్కెలా–భువనేశ్వర్–పూరి
8.రాంచీ–హౌరా
9.జామ్ నగర్–అహ్మదాబాద్
ఈ మార్గాల్లో కొత్త వందేభారత్ రైళ్లు నడవనున్నాయి. ఈ కొత్త రైళ్లతో రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బీహార్, పశ్చిమ బెంగాల్, కేరళ, ఒడిశా, జార్ఖండ్, గుజరాత్ తో కలిపి మొత్తతం 11 రాష్ట్రాలలో కనెక్టివిటీ మెరుగుపడుతుంది.
Read Also: దసరా వేళ రైల్వే గుడ్ న్యూస్, ముంబై నుంచి కరీంనగర్ కు స్పెషల్ ట్రైన్!
కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆయా మార్గాల్లో అత్యంత వేగవంతమై ప్రయాణాలను అందించనున్నాయి. ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించనున్నాయి. ఉదాహరణకు, రూర్కెలా–భువనేశ్వర్–పూరి, కాసరగోడ్–తిరువనంతపురం సర్వీసులు ప్రయాణీకులకు దాదాపు మూడు గంటల సమయాన్ని ఆదా చేస్తాయి. హైదరాబాద్–బెంగళూరు రైలు దాదాపు రెండున్నర గంటల సమయం సేవ్ కానుంది. ఇతర మార్గాల్లో అరగంట నుండి రెండు గంటల వరకు సమయం తగ్గుతుంది. దేశంలోని ముఖ్యమైన పుణ్యక్షేత్రాలకు వెళ్లే ప్రయాణీకులకు కూడా ఈ కొత్త రైళ్లు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. రూర్కెలా–భువనేశ్వర్–పూరి, తిరునల్వేలి–మధురై–చెన్నై రైళ్లు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు అయిన పూరి, మధురైని కలపనున్నాయి. అదే సమయంలో విజయవాడ–చెన్నై సర్వీస్ రేణిగుంట ద్వారా తిరుపతి ఆలయానికి డైరెక్ట్ కనెక్టివిటీని అందించనుంది. అదే సమయంలో హైదరాబాద్- బెంగళూరు మధ్య నడిచే వందేభారత్ రైలు ఇరు నగరాల మధ్య టెక్కీల రాకపోకలు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇక ఈ రైళ్లకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ వివరాలను రైల్వేశాఖ అధికారికంగా ఇవాళ ప్రకటించనుంది.
Read Also: ఒకటి కాదు.. ఒకేసారి రెండు.. వచ్చేస్తున్నాయ్ వందే భారత్ స్లీపర్ రైళ్లు!