BigTV English

National Awards: నాలుగేళ్ల చిన్నారికి నేషనల్ అవార్డు.. ఏ మూవీకంటే ?

National Awards: నాలుగేళ్ల చిన్నారికి నేషనల్ అవార్డు.. ఏ మూవీకంటే ?

National Awards.. 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుక సెప్టెంబర్ 23న ఢిల్లీ వేదికగా ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఉత్తమ నటుడు, ఉత్తమ నటి , ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం ఇలా పలు విభాగాలలో నేషనల్ అవార్డ్స్ ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందజేశారు. అయితే ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. చిన్నపిల్లలు కూడా నేషనల్ అవార్డ్స్ అందుకోవడంతో ఈ వేడుకకు మరింత కళ వచ్చింది అని సినీప్రియులు కామెంట్లు చేస్తున్నారు. అసాధారణ ప్రతిభతో అందరినీ మెప్పించి.. నేషనల్ అవార్డ్స్ అందుకోవడం నిజంగా ప్రశంసనీయమని చెప్పవచ్చు. ఈ చిన్నారులు అవార్డ్స్ అందుకుంటుండగా ప్రాంగణం మొత్తం చప్పట్లతో దద్దరిల్లిపోయింది.


నేషనల్ అవార్డు 4 ఏళ్ల చిన్నారి..

ఇక వీరందరిలో ఒక నాలుగేళ్ల బాలిక ఏకంగా నేషనల్ అవార్డు అందుకొని అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె ఎవరో కాదు మరాఠీ బాలనటి త్రిష తోసర్ (Trisha Thosar) . ఉత్తమ బాల నటి విభాగంలో నేషనల్ అవార్డును అందుకున్నారు. మరాఠీ మూవీ ‘నాల్ 2’ సినిమాలోని నటనకు గానూ.. ఈ చిన్నారికి అవార్డు లభించింది. ఈ చిన్నారి స్టేజ్ పైకి వచ్చిన సమయంలో హాలు మొత్తం చప్పట్లతో మార్మోగింది.అంతేకాదు ఈ సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్టులు శ్రీనివాస్ పోక్లే, భార్గవ్ జగ్తాప్ కూడా ఈ నేషనల్ అవార్డులను అందుకున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ చిన్నారులపై ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు.

నేషనల్ అవార్డ్స్ అందుకున్న నటీనటులు వీరే..


ఇకపోతే 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో భాగంగా ఉత్తమ నటుడు క్యాటగిరీలో జవాన్ సినిమాకు షారుక్ ఖాన్ , 12th fail మూవీకి విక్రాంత్ మాస్సే అందుకున్నారు. అంతేకాదు ఉత్తమ చిత్రంగా 12 ఫెయిల్ మూవీ నేషనల్ అవార్డు అందుకున్నారు. ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ (మెసేజ్ చటర్జీ వర్సెస్ నార్వే) ఈ అవార్డ్ ను అందుకున్నారు.

టాలీవుడ్ విషయానికి వస్తే.. ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ సినిమాకి నేషనల్ అవార్డు వరించింది. ఈ అవార్డును డైరెక్టర్ అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి అందుకున్నారు. ‘హనుమాన్’ సినిమాకి ఉత్తమ యాక్షన్ విభాగంలో యాక్షన్ డైరెక్టర్స్ గా పనిచేసిన నందు, పృథ్వీలు అవార్డులు అందుకున్నారు. అలాగే ఉత్తమ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ కామిక్స్ విభాగంలో హనుమాన్ సినిమా అవార్డు అందుకోగా.. ఇందుకు యానిమేషన్స్, విజువల్ ఎఫెక్ట్స్ అందించిన వెంకట్ కుమార్, దర్శకుడు ప్రశాంత్ వర్మ, నిర్మాత నిరంజన్ రెడ్డి అవార్డులు అందుకున్నారు.

ALSO READ:Hero Suriya: మోసపోయిన సూర్య సెక్యూరిటీ ఆఫీసర్ .. రూ.42 లక్షల భారీ మోసం!

ఉత్తమ గేయ రచయితగా ‘బలగం’లో “ఊరు పల్లెటూరు” పాటకు గాను కాసర్ల శ్యామ్ ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. ‘బేబీ’ సినిమాకి ఉత్తమ స్క్రీన్ ప్లే కి గాను దర్శకుడు సాయి రాజేష్, బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్ గా “ప్రేమిస్తున్న” అనే పాటకు పివిఎన్ఎస్ రోహిత్ అవార్డులు అందుకున్నారు. అలాగే చైల్డ్ ఆర్టిస్ట్ గా సుకుమార్ కూతురు సుకృతి వేణి ‘గాంధీ తాత చెట్టు’ సినిమాకు అవార్డు అందుకున్నారు. అలాగే స్పెషల్ విభాగంలో మోహన్ లాల్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు.

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related News

Tollywood:కిస్ పెడుతూ… ఇన్‌ఫ్లుయెన్సర్‌తో పబ్‌లో అడ్డంగా దొరికిపోయిన బేబీ హీరో

OG: స్టైల్ కాపీ ఓకే.. రిజల్ట్ కూడా అలాగే ఉంటే.. చెక్కేయడమే!

Hero Suriya: మోసపోయిన సూర్య సెక్యూరిటీ ఆఫీసర్ .. రూ.42 లక్షల భారీ మోసం!

Dharma Mahesh: నిన్న రీతూ చౌదరి.. నేడు మరో హీరోయిన్.. గౌతమి సంచలన కామెంట్స్

Sai Pallavi Bikini : అంతా ఫేక్… నిప్పులాంటి సాయి పల్లవినే అవమానించారు

OG Movie : ఓజీ అంటే ఒంటరిగా గొలవలేనోడు… పరువు మొత్తం తీస్తున్నారు

Jr.Ntr: చేతికి గాయం అయినా వదలని పంతం…ఇంత మొండోడివి ఏంటీ సామి!

Big Stories

×