Tirumala News: దసరాకు సీజన్ వచ్చిందంటే చాలు. చాలామంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు పోటీపడతారు. అదే సమయంలో బ్రహ్మోత్సవాలు రానుండడంతో స్వామిని నేరుగా చూసే అవకాశం దక్కించుకుంది. అందుకే బ్రహ్మోత్సవాలు అనేసరికి విదేశాల నుంచి భక్తులు తిరుమలకు వస్తుంటారు.
బుధవారం తిరుమలలో బ్రహ్మోత్సవాలు మొదలుకానున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులకు తీపి కబురు చెప్పింది టీటీడీ. ఇవాళ నేరుగా స్వామిని దర్శించుకునే భాగ్యం కల్పించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో భక్తులు వేచి ఉండాల్సిన అవసరం లేదు. నేరుగా శ్రీవారిని దర్శనం చేసుకోవచ్చు. ఈ ఉదయం తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది.
బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం లేదా సాయంత్రం నుంచి భక్తుల రద్దీ పెరిగే అవకాశముందని అంచనా వేస్తోంది టీటీడీ. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు బుధవారం తిరుమలకు రానున్నారు. ప్రభుత్వం తరపున స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు మంత్రి లోకేశ్ కుటుంబ సభ్యులతో కలిసి హాజరవుతున్నారు.
ఈ మధ్యాహ్నం గన్నవరం ఎయిర్‌పోర్టు బయలుదేరి సాయంత్రం ఐదున్నర గంటలకు తిరుపతి చేరుకుంటారు సీఎం చంద్రబాబు ఫ్యామిలీ సభ్యులు. రాత్రి 8 గంటల సమయంలో శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. గురువారం ఉదయం ఉదయం వెంకటాద్రి నిలయానికి చేరుకుని ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రారంభించనున్నారు. 10 గంటలకు తిరుమల నుంచి బయలుదేరి తిరుపతి మీదుగా అమరావతికి చేరుకుంటారు.
ALSO READ: H 1 B వీసా ఎఫెక్టు.. ఏపీకి మరో టెక్ కంపెనీ
తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాలకు మంగళవారం శ్రీకారం చుట్టింది టీటీడీ. గతరాత్రి 7 నుంచి 8 గంటల మధ్య అంకురార్పణతో ఉత్సవాలు మొదలయ్యాయి. శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుడు తిరు మాడవీధుల్లో ఊరేగించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ధ్వజారోహణం నిర్వహించనున్నారు.
బుధవారం సాయంత్రం ఐదున్నర నుంచి ఆరున్నర గంటల మధ్య ఈ కార్యక్రమం జరగనుంది. రాత్రి 9 నుంచి 11 గంటల వరకు శ్రీవారు పెద్దశేష వాహనసేవపై ఊరేగనున్నారు. ప్రస్తుతం తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు ఖాళీగా ఉన్నాయి. భక్తులు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండకుండానే నేరుగా దర్శించుకుంటున్నారు.
మంగళవారం శ్రీవారిని 63,837 మంది భక్తులు దర్శించుకున్నారు. దాదాపు 20,904 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2.85 కోట్ల రూపాయలు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు.
దేశంలోనే తొలి ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తిరుమలలో ఏర్పాటు
NRIల దాతృత్వంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 లో ఏర్పాటు చేసిన సదుపాయం
AI ద్వారా భక్తుల రద్దీ అంచనా, ఫేస్ రికగ్నిషన్ & సీసీటీవీతో భద్రతా పర్యవేక్షణ, 3D మ్యాప్స్ ద్వారా క్యూ లైన్లు, వసతి ఇతర సౌకర్యాల పర్యవేక్షణ,… pic.twitter.com/2nAbwdwA20
— BIG TV Breaking News (@bigtvtelugu) September 24, 2025