BigTV English

Megastar Mammootty : ఆ రెండు దేశాలలో మెగాస్టార్ సినిమా బ్యాన్.. అసలు కారణం అదే..

Megastar Mammootty : ఆ రెండు దేశాలలో మెగాస్టార్ సినిమా బ్యాన్.. అసలు కారణం అదే..
Kaathal The Core

Megastar Mammootty  : మెగాస్టార్ అనగానే చిరంజీవి అనుకున్నారా.. కాదండోయ్ టాలీవుడ్ లో మెగాస్టార్ అంటే చిరంజీవి. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంటే మెగాస్టార్.. మలయాళ మెగాస్టార్.. అదేనండి మమ్ముట్టి చిరంజీవికి టాలీవుడ్ లో ఎంత ఆదరణ ఉందో మలయాళం సినిమాల్లో మమ్ముటికి కూడా అదే రేంజ్ లో పాపులారిటీ ఉంది. ఇక ఆ విషయం పక్కన పెడితే ప్రస్తుతం మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి సినిమాకు చేదు అనుభవం ఎదురయింది. జ్యోతిక, మమ్ముట్టి కాంబినేషన్లో వస్తున్న మలయాళం మూవీ ‘కాథల్ – ది కోర్’.


ఈ మూవీ నవంబర్ 23న సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీలో మొదటిసారి మమ్ముట్టితో పాటు జ్యోతిక కలిసి నటించబోతున్నారు. ఇక ఈ మూవీ దర్శకత్వ బాధ్యతలు జియో బేబీ వహిస్తున్నారు. రేపు విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం ను ప్రస్తుతం కొన్ని ప్రాంతాలలో నిషేధం బాధలు వెంటాడుతున్నాయి. ఈ మూవీ కాన్సెప్ట్ నచ్చకపోవడంతో కొన్ని ఏరియాస్ లో ఈ మూవీ విడుదల పై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

మొదట ఈ చిత్రాన్ని నేరుగా ఆన్లైన్ ప్లాట్ ఫామ్ లో విడుదల చేయాలి అని అనుకున్నారు. కానీ ఇటువంటి సినిమా ఖచ్చితంగా థియేటర్లలో విడుదల కావాలి అని నిర్ణయించుకన్నారు మేకర్స్. అయితే రిలీజ్ కి ముందు చిత్ర బృందం ఊహించని సమస్యను ఎదుర్కొంటోంది. కువైట్ ,ఖతార్ లో ఈ మూవీ విడుదల పై అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా ఈ చిత్రాన్ని అక్కడ ప్రభుత్వం బ్యాన్ చేసింది. దీనికంతటికీ కేవలం మూవీ కంటెంట్ కారణం.


ఈ మూవీలో జ్యోతిక ఓమన అనే పాత్రలో నటిస్తుండగా మమ్ముట్టి మాథ్యూ దేవాసి పాత్రలో కనిపిస్తారు. అనుకోకుండా ఒక కుటుంబంలో చెలరేగిన గొడవ.. తర్వాత పరిస్థితులు ఇతివృత్తంతో సాగే ఈ కథలో ఒక చిన్న ట్విస్ట్ ఉంది.జార్జ్ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి నిర్ణయించుకుని నామినేషన్ వేస్తాడు. సరిగ్గా రెండు రోజులు తర్వాత అతని భార్య ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం అప్లై చేస్తుంది. అసలు ఏం జరిగింది అబ్బా అని ఆలోచిస్తున్న గ్రామస్తులు సడన్ గా జార్జ్ కు అదే గ్రామంలో డ్రైవింగ్ స్కూల్ నిర్వహిస్తున్న థంకన్‌ అనే అతడి స్నేహితుడితో గత కొన్ని సంవత్సరాలుగా సన్నిహితమైన రిలేషన్ ఉందన్న వార్త బయట పడుతుంది.జార్జ్ హోమో సెక్సువల్ అన్న వార్త గ్రామంలో కారు చిచ్చులా వ్యాపిస్తుంది.

ఇక ఈ నేపథ్యంలో అతని నామినేషన్ కూడా పెద్ద పజిల్ గా మారుతుంది. జార్జ్ ఈ సమస్యను ఎలా సాల్వ్ చేశాడు? అసలు వీళ్ల డైవర్స్ వెనక కారణమేమిటి? లాస్ట్ కి ఏమైంది? అనే విషయాలను ఎంతో ఆసక్తికరంగా.. గ్రిప్పింగ్ కథనంతో డైరెక్టర్ తెరకెక్కించారు అని టాక్. ఇక ఆ విషయం పక్కన పెడితే గల్ఫ్ దేశాలలో హోమో సెక్సువల్స్ కు సంబంధించిన అంశాలపై వ్యవహారం వేరుగా ఉంటుంది. మామూలుగా మలయాళం చిత్రాలకు సాలిడ్ మార్కెట్ గా ఉండే గల్ఫ్ దేశాలలో ప్రస్తుతం ఈ మూవీ బ్యాన్ చేశారు. మరి దీని ప్రభావం చిత్రంపై ఎంతవరకు పడుతుందో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×