భారతీయ రైల్వేలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది వందేభారత్ ఎక్స్ ప్రెస్. అత్యంత వేగం, అత్యాధునిక సౌకర్యాలతో ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని పరిచయం చేసింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సుమారు 150 వందేభారత్ రైళ్లు సేవలు అందిస్తున్నాయి. అన్ని రూట్లలో 100 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. ఎక్కువ రద్దీ ఉన్న ప్రాంతాల్లో మెరుగైన సేవలు అందించేందుకు ఈ మధ్యే ఆయా రైళ్ల కోచ్ ల సంఖ్యలను కూడా పెంచింది ఇండియన్ రైల్వే. ఎక్కువ మంది ప్రయాణించేలా చర్యలు తీసుకుంది. ఎప్పటికప్పుడు కొంత వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తూనే ఉంది. ఇక అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అత్యాధునిక వందేభారత్ స్లీపర్ రైళ్లు త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ మేరకు కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు.
ఇక వందే భారత్ స్లీపర్ రైళ్లు త్వరలో ప్రారంభమవుతాయని అశ్విని వైష్ణవ్ తెలిపారు. తాజాగా ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన మొదటి రైలు అన్ని పరీక్షలు, ట్రయల్ రన్స్ లో పాసైనట్లు వెల్లడించింది. రెండవ రైలు వచ్చే నెలలో అన్ని పరీక్షలు పూర్తి చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. రాత్రిపూట ప్రయాణంలో సాధారణ సేవలను నిర్ధారించడానికి రెండు రైళ్లను కలిపి ప్రారంభించాల్సి ఉందన్నారు.
వందేభారత్ స్లీపర్ రైళ్లను ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) టెక్నాలజీని ఉపయోగించి BEML తయారు చేసింది. ఈ స్లీపర్ రైలులో 16 కోచ్‌లు ఉంటాయి. వీటిని AC ఫస్ట్ క్లాస్, AC 2-టైర్, AC 3-టైర్‌లుగా విభజించారు. ఒక రైల్లో ఒకేసారి 1,128 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలదు. ఈ రైలు 180 కి.మీ. వేగంతో నడుస్తుంది. ఇది దేశంలో అత్యంత వేగవంతమైన రాత్రిపూట ప్రయాణాన్ని అందించే రైలు సేవలలో ఒకటిగా మారుతుంది. ఈ రైళ్లను వీలైనంత త్వరలో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ఆయన ప్రకటించారు.
Read Also: దసరా వేళ రైల్వే గుడ్ న్యూస్, ముంబై నుంచి కరీంనగర్ కు స్పెషల్ ట్రైన్!
ఇక దసరా, దీపావళి, ఛత్ పండుగల సందర్భంగా అక్టోబర్ 1 నుంచి నవంబర్ 15 వరకు దేశ వ్యాప్తంగా 12 వేల ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే మంత్రి ప్రకటించారు. ఇప్పటికే 10 వేల రైళ్లను ప్రకటించామని, 150 పూర్తిగా రిజర్వ్ చేయని రైళ్లను రాపిడ్ కోసం సిద్ధంగా ఉంచామని వెల్లడించారు. ఈ రైళ్ల ద్వారా దేశ వ్యాప్తంగా కార్మికులు, ఉద్యోగులు తమ సొంత ప్రాంతాలకు వెళ్లి పండుగను సంతోషంగా జరుపుకోవచ్చు అన్నారు.
Read Also: వావ్.. జపాన్ స్లీపర్ రైలు ఇలా ఉంటుందా? బెర్తులు భలే ఉన్నాయే!