E-Paper
Advertisement

Pawan Kalyan: ఎన్టీఆర్ లానే పవన్.. మిలట్రీ వ్యాన్ లా ప్రచార రథం..

Pawan Kalyan: ఎన్టీఆర్ లానే పవన్.. మిలట్రీ వ్యాన్ లా ప్రచార రథం..
Advertisement

Pawan Kalyan: ఎవరన్నారు పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికిరాడని? ఎవరన్నారు కల్యాణ్ కి కమిట్ మెంట్ లేదని? ఎవరన్నారు జనసేనాని జనంలో ఉండరని? ఎవరన్నారు పాలిటిక్స్ పార్ట్ టైమని? వారందరి నోళ్లు మూయించేలా.. జనం కోసం.. జనంలోకి వస్తున్నారు పవన్ కల్యాణ్. బస్సు యాత్రతో ఏపీలో ప్రభంజనం సృష్టించేందుకు తరలివస్తున్నారు.

జనసేనాని బస్సుయాత్ర అంటే ఏర్పాట్లు మామూలుగా ఉంటాయా? పవర్ స్టార్ రేంజ్ కి తగ్గట్టు ఏ బెంజ్ బస్సులోనో యాత్ర చేస్తారనుకున్నారు కొందరు. అలా అయితే ఆయన జనసేనాని ఎందుకవుతారు. అత్యంత సాదాసీదాగా.. ప్రజలకు మరింత దగ్గరయ్యేలా.. ప్రత్యేక బస్సు రెడీ చేయిస్తున్నారు.

Advertisement

అచ్చం.. అలనాటి అన్నగారి చైతన్యరథాన్ని పోలి ఉండేలా బస్సును తీర్చిదిద్దుతున్నారు. బస్సులోనే బస చేసేలా.. బస్సు మీదనుంచి ప్రసంగించేలా.. అన్ని వసతులతో డిజైన్ చేస్తున్నారు. ఎక్కడా హైటెక్ హంగులకు వెళ్లకుండా.. సింపుల్ గా బస్సును తయారు చేయిస్తున్నారు.

గతంలో పెద్ద ఎన్టీఆర్ చైతన్య రథంపై ఆంధ్ర దేశాన్ని సుడిగాలిలా చుట్టేసి.. పార్టీ పెట్టిన 8 నెలల్లోనే అధికారంలోకి రాగలిగారు. అన్నగారే స్పూర్తిగా.. చైతన్యరథాన్ని పోలి ఉండేలా.. పవన్ కల్యాణ్ సైతం అలాంటి భారీ వాహనాన్నే సెలెక్ట్ చేసుకున్నారు. ఆ వాహనానికి సైతం చైతన్యరథం మాదిరే మిలట్రీ గ్రీన్ కలర్ వేశారు. ఆ వెహికల్ కలర్ ని చూడగానే.. దేశభక్తి రగిలేలా.. రెడీ చేస్తున్నారు.

Advertisement

హైదరాబాద్ లోని ఓ గ్యారేజీలో పవన్ కోసం వేగంగా ముస్తాబవుతోంది ఆ బస్. మరి, తన ప్రచార రథానికి జనసేనాని ఏం పేరు పెడతారో..?

Related News

సిగ్గు లేని రాజకీయాలు ఇంకెంత కాలం.. కాక్రోచ్‌కు వైసీపీ మద్దతు, టీడీపీ అలా అంటూ సాయిరెడ్డి కామెంట్స్

తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణం.. ఏకంగా రెండు అల్పపీడనాలు, భారీ వర్ష సూచన

తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీ కొన్న రెండు ట్రావెల్ బస్సులు.. నంద్యాల జిల్లాలో ఘటన

విజయవాడ మేయర్ ఎన్నికల్లో న్యూట్విస్ట్.. రంగంలోకి మాజీ ఐపీఎస్, ఇండియా కూటమి మద్దతు

స్థానిక ఎన్నికల వేల నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్.. ఎమన్నారంటే?

ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్.. ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే చాన్స్..?

ఏపీలో తీవ్ర విషాదం.. అమలాపురం మాజీ ఎంపీ బుచ్చిబాబు కన్నుమూత!

తెలుగుదేశం పార్టీ రెండో జాబితా విడుదల.. ఇందులోను మహిళలదే హవా!

Big Stories

Advertisement
×