BigTV English

Varaharupam: ‘వరాహరూపం’పై నిషేధం ఎత్తివేత.. ‘కాంతార’కు గుడ్ న్యూస్..

Varaharupam: ‘వరాహరూపం’పై నిషేధం ఎత్తివేత.. ‘కాంతార’కు గుడ్ న్యూస్..

Varaharupam: కాంతార. బ్లాక్ బస్టర్ ఆఫ్ ది ఇయర్. పాన్ ఇండియా వైడ్ సూపర్ హిట్. హయ్యెస్ట్ రేటెడ్ ఫిల్మ్. స్టోరీ లైన్, థీమ్, యాక్టింగ్, మేకింగ్, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, లైటింగ్, లొకేషన్స్, క్లైమాక్స్.. అసలు ఏ విషయంలోనూ దానికదే సాటి అనిపించుకుంది. బాక్సాఫీస్ దగ్గర 400 కోట్లు కలెక్ట్ చేసి.. రికార్డులు బద్దలు కొట్టింది. ఇంతటి పాజిటివ్ పాయింట్స్ మధ్య ఒకేఒక మైనస్. అదే వరాహరూపం సాంగ్ పై బ్యాన్.


కాంతార సినిమాకే హైలైట్ వరాహరూపం సాంగ్. ట్రెడిషనల్ టచ్ లో సూపర్బ్ కంపోజిషన్. ఆ పాట వింటున్నా.. చూస్తున్నా.. రోమాలు నిక్కబొడుస్తాయి. అంతలా వేరే ప్రపంచంలోకి తీసుకెళుతుంది ఆ సాంగ్. అలాంటి వరాహరూపం పాటపై గతంలో కేరళ కోర్టు నిషేధం విధించింది. ఆ పాటను వాడొద్దని ఆదేశించింది. మొదట్లో థియేటర్లలో ఆ సాంగ్ ఉన్నా.. ఓటీటీలోకి వచ్చేసరికి ట్యూన్ మార్చేశారు. యూట్యూబ్ లోనూ మార్చేశారు. కొత్త వర్షన్ పాత ట్యూన్ తో సరితూగలేకపోయింది. ఆడియన్స్ బాగా డిసప్పాయింట్ అయ్యారు. లేటెస్ట్ గా, వరాహరూపం సాంగ్ పై విధించిన నిషేధాన్ని తొలగించింది కేరళ కోర్టు. కాంతారకు గుడ్ న్యూస్ చెప్పింది.

తెయ్యుకుడుం బ్రిడ్జ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కేరళలోని కోలికోడ్‌ జిల్లా కోర్టు కొట్టివేసింది. తమ ట్యూన్‌ కాపీ చేశారంటూ హోంబాలే ఫిల్మ్స్‌పై కేరళలోని తెయ్యుకుడుం బ్రిడ్జ్‌ మ్యూజిక్‌ బ్యాండ్‌ కోర్టును ఆశ్రయించింది. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు, ‘కాంతార’ చిత్రానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. మ్యూజిక్‌ బ్యాండ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ కొట్టివేసింది. పాటపై నిషేధం ఎత్తివేసింది. దీంతో, అంతా హ్యాపీస్.


అయితే, కేరళ పాలక్కడ్‌ జిల్లా కోర్టులోనూ మరో పిటిషన్ ఉండటంతో.. వర్జినల్ వరాహరూపం సాంగ్ ను కాంతార టీమ్ మళ్లీ అందుబాటులోకి తెస్తుందో, లేదో చూడాలి..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×