Ugadi Pachadi: ఉగాది పండుగ రోజు చేసే పచ్చడిలోని ఆరు రుచులకు అసలు అర్థం ఏంటో తెలుసా..? పచ్చడి చేయడంలో ఉన్న అంతర్యం ఏంటో తెలుసా..? ఉగాది రోజే ఆ పచ్చడి ఎందుకు చేసుకోవాలో తెలుసా..? ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.
తెలుగు సంవత్సరాది ఉగాది (Ugadi) పండుగ రోజు తినే ఉగాది పచ్చడి (Ugadi Pachadi) కి చాలా గొప్ప అర్థం ఉంది. ఇందులో ఉండే 6 రుచులు (షడ్రుచులు) మన జీవితంలోని వివిధ భావాలను సూచిస్తాయి. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు అనే కోణంలోనే ఈ ఆరు రుచులు ఉంటాయట. అయితే ఉగాది రోజే ఈ పచ్చడి చేసుకోవడంలో కూడా ఒక అంతర్యం ఉంది. ఈ పచ్చడిలో కలిపే చేదుకు ప్రతిరూపమైన వేప పూత, వగరు కోసం ఉపయోగించే మామిడి కాయలు కూడా ఉగాది సీజన్‌లోనే లభిస్తాయి. ఇక ఆరు రుచులు సుఖం, దుఃఖం, ఆశ్చర్యం, కోపం, సంతోషానికి సంకేతాలుగా బావిస్తారట.
చేదు – వేపపూలు (Neem Flowers): ఉగాది పచ్చడిలో అత్యంత ముఖ్యమైనవి వేప పూలు. చేదు నిదర్శనాలు. ఇవి కలపడంలో అంతర్యం జీవితంలో బాధలు, కష్టాలు వస్తాయని ఎన్ని వచ్చినా సమానంగా స్వీకరించి జీవితాన్ని హ్యాపీగా మలుచుకోవాలని చెప్పడానికే వేప చేదు పచ్చడిలో కలుపుతారట.
తీపి – బెల్లం (Jaggery): ఉగాది పచ్చడిలో రెండవది బెల్లం. తీసి కోసం బెల్లం కలపడంతో అంతర్యం జీవితంలో ఆనందం, సంతోషం వచ్చినా పొంగిపోకుండా బ్యాలెన్స్ గా ఉండాలని సూచన కోసం తీపి చేరుస్తారట.
పులుపు – చింతపండు (Tamarind): జీవితంలో కొత్త అనుభవాలకు.. ఆశ్చర్యకరమైన సంఘటనలకు పులుపు నిదర్శనంగా బావిస్తారు. అందుకే పుల్లటి రుచి కోసం చింతపండును ఉగాది పచ్చడిలో కలుపుతారట. అనుకోని సంఘటనలు కూడా జీవితాన్ని ఆశ్యర్యానికి గురి చేస్తుంటాయి.
కారం – మిరపకాయ (Chilli): ఉగాది పచ్చడిలో కారం కోసం ఎండు మిరపకాయల పౌడర్ కలుపుతారు. కానీ అప్పట్లో కారం లేక ముందు మిరియాలు దంచి పొడి చేసి కలిపేవారట. పచ్చడిలో కారం కలపడానికి నిదర్శనం జీవితంలో వచ్చే కోపం, ఉత్సాహానికి ప్రతీకగా కారం చెప్తుంటారట. అలాగే కారం తట్టుకుని పచ్చడి స్వీకరించినట్టే జీవితంలో వచ్చే పోరాటాలు కూడా తట్టుకుని నిలబడాలని సూచికగా కారాని బావిస్తారట.
ఉప్పు – ఉప్పు (Salt): ఉగాది పచ్చడిలో ఉప్పు కూడా కలుపుతారు. ఉప్పు కలపడంలో అంతర్యం జీవన సంబంధాలు.. జీవన సమతుల్యత లాంటి విషయాలకు నిదర్శనం అంటున్నారు పండితులు. ఇంకా జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి కూడా ఉప్పు బావిస్తారట.
వగరు / తురుము – మామిడి ముక్కలు (Raw Mango): ఉగాది పచ్చడిలో వగరు కోసం మామిడి ముక్కలు, లేదా తురుము కలుపుతుంటారు. పచ్చడిలో వగరు లాగే జీవితంలో కూడా కొత్త ఆశలు, కొత్త ప్రారంభాలు జరగాలని బావిస్తారట. అలాగే కొత్త అవకాశాలను స్వీకరించడం కూడా అని చెప్తుంటారు.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.