E-Paper
Advertisement

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. రాత్రి పదిన్నర వరకు సంతోష్‌రావు విచారణ, గుట్టు విప్పేసినట్టే!

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. రాత్రి పదిన్నర వరకు సంతోష్‌రావు విచారణ,  గుట్టు విప్పేసినట్టే!
Advertisement

Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం జరుగుతోంది? నెక్ట్స్ సిట్ ఎవరికి నోటీసులు ఇవ్వనుంది? కవిత లేకుంటే కేసీఆర్‌కు ఇవ్వనుందా? దాదాపు ఏడుగంటలపాటు విచారణలో మాజీ ఎంపీ సంతోష్‌రావు ఏం చెప్పాడు? ఈ కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారా? లేకుంటే ఎవరినైనా ఇరికించే ప్రయత్నం చేశారా? ఫోన్ ట్యాపింగ్ మొదలు ఎండింగ్ వరకు అన్నిరకాల ప్రశ్నలు సిట్ రైజ్ చేసిందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

సిట్ విచారణలో సంతోష్‌రావు గుట్టు విప్పేశారా?

Advertisement

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మాజీ ఎంపీ సంతోష్‌రావుని సిట్ దాదాపు ఏడున్నర గంటలపాటు విచారించింది సిట్. మంగళవారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు సిట్ ముందు హాజరైన ఆయన, రాత్రి 9 గంటలు గడిచినా రాకపోవడంతో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల్లో టెన్షన్ మొదలైంది. ఈ క్రమంలో సంతోష్‌ని అరెస్టు చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది.

చివరకు రాత్రి 10.30 గంటలకు సిట్ ఆఫీసు నుంచి సంతోష్‌రావు బయటకు రావడంతో నేతలు, కార్యకర్తలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. సిట్ ఆఫీసు నుంచి నేరుగా తన ఇంటికి ఆయన వెళ్లిపోయారు. విచారణకు సంబంధించి మాట్లాడాలని మీడియా ప్రశ్నించినప్పటికీ తర్వాత మాట్లాడుతానంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు.

Advertisement

రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్‌రావుని సిట్‌ టీమ్ మంగళవారం సుదీర్ఘంగా విచారించింది. ఆయన నుంచి కీలక అంశాలు రాబట్టినట్లు తెలిసింది. ఈ కేసులో అరెస్టయిన అధికారుల నుంచి సేకరించిన సమాచారం దగ్గర పెట్టి విచారించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆనాటి ముఖ్యమంత్రికి తెలిసి జరిగిందా? ఆయన పేరుతో మీరు చేయించారా?

రాత్రి పదిన్నర వరకు సంతోష్‌రావు విచారణ

టాస్క్‌ఫోర్స్‌ అధికారులను ఏయే విషయాలపై సంప్రదింపులు చేశారు? ఆనాటి టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావు పదవీ విరమణ పొందిన తర్వాత కొనసాగించాలని ఎందుకు ఒత్తిడి చేశారు? ఆనాటి డీజీపీతో కేసీఆర్‌ ఆదేశాలంటూ మాట్లాడింది ఎవరంటూ రకరకాల ప్రశ్నలు రైజ్ చేసిందట సిట్. విచారణలో పూర్తిగా కేసీఆరే చుట్టూనే ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది.

అలాగే ప్రగతి భవన్‌లో సమావేశాలు జరిగిన దానిపై ప్రశ్నలు లేవనెత్తారు. ఫోన్‌ ట్యాపింగ్‌ సమాచారాన్ని సంతోష్‌రావు ఎవరెవరికి చేరవేశారు? ప్రభాకర్‌రావు తరచూ కేసీఆర్‌తో సమావేశమై ఏయే విషయాలపై చర్చించేవారు? అనే కోణంలో లోతుగా ఆరా తీసినట్లు తెలిసింది. ఇరువురు మధ్య ఏయే అంశాలు చర్చించేవారో తనకు తెలియదని చెప్పారట. చాలా ప్రశ్నలకు తనకు తెలియదని, అవన్నీపైస్థాయిలో జరిగేవని అన్నారట.

ALSO READ: మున్సిపల్ ఎన్నికల వేళ పోలీసుల ఉక్కుపాదం

ఈ కేసులో సిట్ సేకరించిన ప్రతీ సమాచారన్ని దగ్గర పెట్టి అన్నికోణాల్లో ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఆనాటి సీఎంవోలో ఆయన కీలకంగా వ్యవహరించినట్టు ఇప్పటికే అధికారుల వద్ద సమాచారం ఉంది.  ఎవరైనా ముఖ్యమంత్రిని కలవాలన్నా తొలుత సంతోష్‌రావుని సమావేశం తర్వాత అధికారులుగానీ, రాజకీయ నేతలుగానీ కేసీఆర్ వద్దకు వెళ్లేవారట. సంతోష్‌రావు ఇచ్చిన సమాచారం ఆధారంగా కేసీఆర్‌కు నోటీసు ఇవ్వడం ఖాయమనే చర్చ అప్పుడే మొదలైంది.

 

Related News

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

Big Stories

Advertisement
×