Big Stories

Telangana’s Phone Tapping Case: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు.. అంతా మాజీ సీఎం స్కెచ్చే..!

KCR Role in Telangana’s Phone Tapping Case: పక్కవాన్ని దేవుడెరుగు.. సొంత నీడను కూడా నమ్మలేదు. వీళ్లు, వాళ్లు అన్న తేడా లేదు.. ఎవ్వరినీ వదల్లేదు. ఫోన్ ట్యాపింగ్‌ కేసులో తవ్వుతున్న కళ్లు బైర్లు కమ్మే నిజాలు. మైండ్ బ్లాంక్‌ అయ్యే విషయాలు.. బిగ్‌టీవీ లాగిన తీగకు.. ఇప్పుడు డొంకంతా బయటపడింది. అసలు స్కెచ్‌ ఎవరు వేశారు? ఎలా వేశారు? ఎవరెవరి ఫోన్లు టాప్ చేశారు? ఎందుకు చేశారు? అసలు దీనికి కర్త, కర్మ, క్రియ ఎవరు? ఇప్పుడీ విషయాలన్నీ బిగ్ టీవీ సంపాదించింది. ఇప్పుడు మీ ముందు పెట్టింది. మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం.. ఫోన్ ట్యాపింగ్‌లో ఇప్పటి వరకు పోలీసులు పట్టుకున్నది కేవలం పాత్రధారులనే సూత్రధారులు వేరే ఉన్నారని.. ఇప్పుడామాటే నిజమైంది.

- Advertisement -

అసలు సూత్రధారులు ఎవరో తేలిపోయింది. యస్.. ఇప్పటి వరకు తెర వెనక దోబూచులాడిన ఆ పేరు. కుండబద్ధలు కొట్టినట్టుగా బయటకు వచ్చింది. ఆ పేరు మరేవరిదో కాదు. మాజీ సీఎం.. బీఆర్ఎస్‌ పార్టీ అధినేత.. కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావుది. యస్.. ఈ విషయాన్ని మేము ఏదో నోటికి వచ్చింది కదా అని చెప్పడం లేదు. పక్కా ఆధారాలతో మీ ముందు ఉంచుతున్నాం. అసలు ఫోన్‌ ట్యాపింగ్‌లో కీ రోల్ ప్లే చేసిన రాధాకిషన్‌ రావు, భుజంగరావు. ఇప్పుడు ఆయన పేరును క్లియర్‌ కట్‌గా చెప్పేశారు. వారి కన్ఫెషన్ స్టేట్‌మెంట్స్‌లో కేసీఆర్‌ పేరును ఎక్కించేసి.. ఇప్పటి వరకు ఉన్న అనుమానాలన్నింటిని నిజం చేశారు.

- Advertisement -

కేసీఆర్ తన సొంత నీడను కూడా నమ్మరు.. యస్.. కేసీఆర్‌ నమ్మరు.. ఎందుకింత కాన్ఫిడెంట్‌గా చెప్పాల్సి వస్తుందంటే.. కేసీఆర్ చేయించిన ట్యాపింగ్‌ లిస్ట్ చూస్తే అలానే ఉంది మరి. కాంగ్రెస్‌ నేతలు.. బీజేపీ నేతలు.. లైక్ అప్పుడు పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్ రెడ్డి కావొచ్చు. మరే ఇతర కాంగ్రెస్‌ నేతలు కావొచ్చు.. వారితో పాటు.. బీజేపీ నేతలు బండి సంజయ్, అర్వింద్, ఈటల రాజేందర్‌ ఫోన్ కాల్స్‌ ఎప్పటికప్పుడు ట్రాక్ చేశారు. వాళ్లు మాట్లాడుకున్నవన్నీ వినేశారు. అయితే భజంగరావు కన్ఫెషన్‌ స్టేట్‌మెంట్‌లో మరికొన్ని ఇంట్రెస్టింగ్‌ విషయాలు బయటికి వచ్చాయి. ఇక మీడియా పెద్దల విషయానికి వస్తే NTV నరేంద్ర చౌదరి, ABN రాధాకృష్ణ ఫోన్లనూ కూడా వదలలేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, నిర్మాణ రంగంలో ఉన్నవాళ్లు.. ఇతర వ్యాపార పెద్దలు.. ఇలా ఎవ్వరిని వదలలేదు.

Also Read: ED Revealed Key Facts: కేసీఆర్‌కు వాళ్లను కవిత ముందే పరిచయం చేసింది: ఈడీ

అయితే ఈ విషయాలను పసిగట్టిన వీరంతా ఫోన్లకు దొరకకుండా జాగ్రత్త పడ్డారు. కానీ SIB టీమ్ అస్సలు వదలలేదు. ఇంటర్నెట్ ప్రోటోకాల్‌ డేటా రికార్డ్స్‌పై పడ్డారు.. ఎప్పటికప్పుడు ట్రాక్ చేశారు. ఈ వివరాలన్ని మొదట ప్రభాకర్‌ రావుకు.. ఆ తర్వాత కేసీఆర్‌కు చేరాయి. ఇంతవరకంటే బయటివారు తన కొంపకు ఎటు వైపు నుంచి నిప్పుపెడతారో.. అన్న డౌట్‌తో చేశారనుకుందాం.. బట్.. బీఆర్‌ఎస్‌ నేతల ఫోన్లను కూడా వదలలేదు. భుజంగరావు.. విచారణలో ఈ విషయాలను కూడా కుల్లంకుల్లంగా చెప్పేశారు. బీఆర్ఎస్‌ నేతలను కూడా వదలద్దని ఆదేశాలు వెళ్లాయి ప్రణీత్‌రావుకు.. ఇంకేముంది లిస్ట్‌లో ఉన్న బీఆర్ఎస్ నేత శంబీపూర్ రాజు.. స్టేషన్‌ ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే టీ రాజయ్య.. పట్నం మహేందర్ రెడ్డి.. పట్నం సునీతారెడ్డి.. లేటెస్ట్‌గా బీఆర్ఎస్‌లో చేరిన ప్రవీణ్‌ కుమార్.. తీగల కృష్ణారెడ్డి.. ఇంకా ఈ లిస్ట్‌ చాంతడంతా ఉంది. ఇలా అందరి మాటలను వింటూనే పోయారు.

అట్లుంటది మరి కేసీఆర్‌తో.. ఎవరిని నమ్మరు.. ప్రతి వారిపై అనుమానపు చూపులే.. ఎప్పటికప్పుడు వారిని కట్టడి చేయడమే పని.. ఎవరేం చేస్తారో అన్న భయం.. తనకు అంతా తెలియాలన్న తుత్తుర.. అందులో ఎవరిని నమ్మలేదు. కేసీఆర్‌లో ఉన్న మరో కోణం కూడా ఇప్పుడు బయటికి వచ్చింది. ఓడలో ఉన్నంత వరకు ఓడ మల్లన్న.. ఓడ దిగిన తర్వాత బోడి మల్లన్న.. అనే సామెత కేసీఆర్‌కు సూపర్‌గా సూటవుతుందనిపిస్తుంది. ఎందుకో చెప్పుకునే ముందు ఓ సారి ఆయన ఏం మాట్లాడారో వినండి..

Also Read: ఎన్టీఆర్‌ 101వ జయంతి.. నివాళులు అర్పించిన తారక్‌, కళ్యాణ్‌రామ్‌

ఎవరయ్యా ఆయనా.. వంద మంది డీసీపీలు వస్తుంటారు.. పోతుంటారు. ఇదంతా రాధాకిషన్‌ రావు గురించి మీడియా వేసిన ప్రశ్నకు కేసీఆర్‌ ఇచ్చిన సమాధానం ఇది. బట్ ఇదే రాధాకిషన్‌ రావు.. కేసీఆర్‌ గురించి తన కన్ఫెషన్‌ స్టేట్‌మెంట్‌లో ఏం చెప్పారో తెలుసా? కేసీఆర్‌ను పెద్దాయన అని పిలిచారు రాధాకిషన్.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత చీఫ్‌ మినిస్టర్ సెక్యూరిటీ గ్రూప్‌లో అడిషినల్‌ ఎస్పీ స్థాయిలో నియమించేందుకు నన్ను ఎంపిక చేశారు. ఈ CMSG అనేది సీఎంకు ఎప్పుడు అత్యంత క్లోజ్‌గా మూవ్ అవుతుంది. నిత్యం ఆయననే అంటి పెట్టుకొని ఉంటుంది. సో ఇలాంటి పదవి చేపట్టేందుకు.. అత్యంత నమ్మకస్తులు కావాలని అనుకున్నారు. అందుకే నన్ను ఎంపిక చేశారు.. ఆ సమయంలోనే నేను కేసీఆర్‌కు చాలా క్లోజ్‌ అయ్యాను. ఒక్క కేసీఆర్‌కే కాదు.. ఆయన కుటుంబసభ్యులకు కూడా క్లోజ్‌ అయ్యాను..
అప్పటి నుంచి వారితో చాలా సత్సంబంధాలు మెయింటేన్ చేశాను. ఇది రాధాకిషన్‌ రావు కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో చెప్పిన విషయాలు..

అక్కడితో అయిపోలేదు.. 2017లో టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా ఎంపిక చేశారు రాధాకిషన్‌ రావును అయితే దీని వెనక కూడా ఉన్న అసలు కథను కుండ బద్ధలు కొట్టేశారు ఆయన అప్పటికి గులాబీ పార్టీ సిటీలో చాలా వీక్‌గా ఉంది. సో సిటీ మొత్తం టీఆర్ఎస్‌ కంట్రోల్‌లోకి రావాలంటే.. చాలా కీలకమైన కాన్ఫిడెన్షియల్ ఆపరేషన్స్ చేపట్టాలి. అలా చేపట్టాలంటే తన సొంత సామాజికవర్గానికి చెందిన ఓ అధికారి కావాలి. సో.. కేసీఆర్‌కు అప్పుడు నమ్మకమైన వ్యక్తిగా కనిపించింది తానే.. సో ప్రభాకర్‌ రావు రిఫర్ చేయగానే వెంటనే కేసీఆర్ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చేశారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీగా పోస్ట్ ఇచ్చారు. ఈ నగ్న సత్యాలను కూడా చెప్పిందే రాధాకిషన్ రావే.. అత్యంత నమ్మకస్తుడని నమ్మి.. అనధికార పనులు చేయించుకున్న కేసీఆర్.. ఇప్పుడేమో అసలు రాధాకిషన్‌ రావు ఎవరో తనకు తెలియదంటున్నారు. దీని బట్టి ఆయన క్యారెక్టర్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు..

Also Read: KCR govt snooped on judges and lawyers: ఫోన్ ట్యాపింగ్ కేసు.. తీగలాగితే డొంక, జడ్జీలు, అడ్వకేట్ సహా..

కేసీఆర్‌కు ఏం సంబంధం? సారీ సీఎంకు ఫోన్ ట్యాపింగ్‌తో ఏం సంబంధం? ఎలా మాట్లాడుతారు సర్ ఇలా.. కొన్ని విషయాల్లో మీకు మీరే సాటి.. అసలు మీకు ఎవ్వరూ లేరు పోటీ.. అందులో ఇదొకటి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News