HCU : ప్రభుత్వం క్లియర్‌గా చెబుతోంది. అవి అటవీ భూములు కావని. అక్కడ అసలు అడవే లేదని. సర్కారు స్థలం నిరూపయోగంగా ఉండటంతో చెట్లు మెులిచాయని. అయినా, 400 ఎకరాల కంచె గచ్చిబౌలి భూములపై బీజేపీ తప్పుడు ప్రచారం మాత్రం ఆగట్లేదు. ఈసారి ఏకంగా ప్రధాని మోదీనే విమర్శలు స్టార్ట్ చేశారు. తెలంగాణ బీజేపీ నేతలు చెప్పిన సమాచారం నిజమనుకున్నారో ఏమో.. ఎలాంటి క్రాస్ చెక్ లేకుండానే.. విమర్శలు సంధించారు. ప్రధాని స్థాయిలో ఉన్న నాయకుడు గచ్చిబౌలి ల్యాండ్స్‌పై అసంబద్ధ వ్యాఖ్యలు చేయడంపై కాంగ్రెస్ పార్టీ కస్సుమంటోంది. మోదీకి స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తోంది.
అడవుల్లో బుల్డోజర్లా?
హరియాణాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ సర్కార్ విధానాలు, కంచె గచ్చిబౌలీ భూములపై ఆయన స్పందించారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోయిందన్నారు. అడవులపై బుల్డోజర్లు నడిపించడంలో తెలంగాణ ప్రభుత్వం బిజీగా ఉందంటూ హాట్ కామెంట్స్ చేశారు మోడీ.
కళ్లుండి చూడలేని మోదీ..
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై మోడీ విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ నాయకులు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అసమర్థతను కప్పి పుచ్చుకునేందుకే ఈ కొత్త డ్రామా ఆడుతున్నారని అన్నారు. తెలంగాణ అభివృద్దిని చూడలేని ధృతరాష్టుడు మోడీ అంటూ ఘాటు వాఖ్యలు చేశారు హస్తం నేతలు.
చెట్లు నరకడంలో మోదీయే ముందు..
గత పదేళ్లలో కొన్ని లక్షల చెట్లను మోడీ ప్రభుత్వం నరికేసిందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అదానీ, అంబానీ కోసం డీ ఫారెస్ట్ చేసిన ఘన చరిత్ర మీదంటూ టీపీసీసీ తీవ్ర స్థాయిలో మండిపడింది. చెట్ల గురించే కాదు.. ఈ ఏడాది కాలంలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి గురించి కూడా ప్రధాని మోడీ మాట్లాడాలని సూచించారు కాంగ్రెస్ లీడర్లు.
Also Read : మంత్రి పదవులపై ఎందుకంత ప్రేమ? ఇద్దరేనా.. ఇంకా ఉన్నారా?
మోదీకి భట్టి కౌంటర్
ప్రధాని మోడీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణపై మోడీ అలా ఎందుకు మాట్లాడారో తెలియదని.. తెలంగాణలో ఎక్కడా అడవులను నరకలేదన్నారు. తెలంగాణలో ఎక్కడా జంతువులను చంపలేదని.. అడవులను పెంచడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అది కోర్టు పరిధిలో ఉన్న అంశం కాబట్టి.. వాస్తవాలను కోర్టుకు తెలియజేస్తామన్నారు భట్టి.