Shruti Haasan: ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిలో కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. అందుకే ఏం తినాలి అన్నా సరే ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. ఇక సెలబ్రిటీల గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలామంది హీరోలు, హీరోయిన్లు ఆరోగ్యంగా అందంగా ఉండడానికి ఎక్కువగా హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లను తయారు చేసుకొని మరీ తింటున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ (Shruti Haasan) కూడా తన అభిమానుల కోసం హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ను చూపించింది. అంతేకాదు అది ఎలా తయారు చేయాలో కూడా తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక వీడియో రిలీజ్ చేసింది. మరి శృతిహాసన్ హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ఏంటి? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
శృతిహాసన్ షేర్ చేసిన హెల్దీ బ్రేక్ ఫాస్ట్ ఇదే..
వీడియోలో వున్నట్టు.. ముందుగా ఒక బౌల్ తీసుకొని.. అందులో సన్నగా తరిగిన తెల్ల ఉల్లిపాయ ముక్కలు, చిన్నగా తరిగిన క్యారెట్ ముక్కలతో పాటు కీరా దోస ముక్కలను కూడా వేయాలి. అలాగే మంచి బ్యాక్టీరియా పెరగడం కోసం Kimchi water ను రెండు టేబుల్ స్పూన్ల వరకు జోడించాలి. ఇక మరొక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా నువ్వుల నూనె, 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1/4 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని పక్కన ఉంచుకున్న కాయగూర ముక్కలలోకి కలపాలి. గార్నిష్ కోసం చిల్లీ ఫ్లేక్స్, పింక్ సాల్ట్, పైగా ఒక టేబుల్ స్పూన్ తెల్లటి నువ్వులతో గార్నిష్ చేసుకోవాలి. ఇక అంతే శృతిహాసన్ చెప్పిన హెల్తీ బ్రేక్ ఫాస్ట్ రెడీ.. దీనిని బ్రేక్ ఫాస్ట్ లోనే కాకుండా ఈవినింగ్ స్నాక్స్ రూపంలో కూడా తీసుకోవచ్చట. ప్రస్తుతం శృతిహాసన్ షేర్ చేసిన ఈ హెల్తీ బ్రేక్ ఫాస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
Nani : ఓర్ని దుర్మార్గుల్లారా… నాని అనే ఒకే ఒక్క మంచోడిని మార్చేశారు కదరా..
శృతిహాసన్ సినిమాలు.
ఇక శృతిహాసన్ సినిమాల విషయానికి వస్తే.. అడివి శేష్ (Adivi Shesh) హీరోగా నటిస్తున్న ‘డెకాయిట్’ సినిమాలో అవకాశాన్ని అందుకుంది. పైగా ఈ సినిమాలో తన రెమ్యూనరేషన్ కూడా భారీగానే తీసుకుంటోంది అంటూ వార్తలు వచ్చాయి. కొంత భాగం షూటింగ్ కూడా పూర్తయింది. కానీ చిత్ర బృందంతో కాస్త విభేదాలు ఏర్పడడంతో సినిమా నుండి తప్పుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడు కోలీవుడ్లో రజనీకాంత్ (Rajinikanth) హీరోగా నటిస్తున్న ‘కూలీ’ సినిమాలో అవకాశాన్ని అందుకుంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ సమయంలో రజినీకాంత్ తో తనకు ఏర్పడిన బంధం గురించి చెప్పుకొచ్చింది.
రజనీకాంత్ ను చూసి ఎన్నో నేర్చుకున్నానని, ముఖ్యంగా సినిమా సెట్ లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి.. బయట ఉన్నప్పుడు ఎలా ఉండాలి? ఎవరితో ఎలా నడుచుకోవాలి? అనే విషయాలన్నింటినీ రజనీకాంత్ ని చూసి నేర్చుకున్నాను అంటూ శృతిహాసన్ తెలిపింది. ఇక ప్రస్తుతం శృతిహాసన్ చేతిలో మరో రెండు చిత్రాలు ఉన్నట్లు సమాచారం.
?utm_source=ig_web_copy_link