BigTV English

Khammam: రాహుల్‌ సభలో భద్రతా వైఫల్యం!.. కావాలనే చేశారా?

Khammam: రాహుల్‌ సభలో భద్రతా వైఫల్యం!.. కావాలనే చేశారా?
khammam police

Congress party meeting in khammam(Telangana politics): ఖమ్మం సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌కు భద్రతా వైఫల్యం కలకలం రేపింది. పోలీసులు సరైన భద్రత కల్పించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయ్‌. వేదిక దగ్గర కొందరు నానా హంగామా చేశారు. సభా వేదిక వైపు ఒక్కసారిగా దూసుకొచ్చారు. వారిని కంట్రోల్ చేయడానికి సరిపడా బలగాలు లేరు. దాంతో చాలాసేపు గందరగోళ పరిస్థితి చోటు చేసుంది.


రాహుల్‌ ప్రసంగం అయిపోయే వరకు ఎప్పుడు ఏం జరుగుతుందనే పరిస్థితి చోటు చేసుకుంది. స్టేజ్‌ దగ్గరకు వచ్చిన పార్టీ శ్రేణులు.. పీఎం..పీఎం అంటూ నినాదాలు చేశారు. రాహుల్‌ కూడా ఒకాన సందర్భంలో వారించారు. ప్లీజ్ అంటూ సర్ధిచెప్పారు. ఇక పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా లేచి… కూర్చోవాలంటూ..కార్యకర్తలకు సూచించారు.

రాహుల్‌ సభకు సరైన భద్రత కల్పించలేదా? ఎందుకు గందరగోళం చోటు చేసుకుంది? ఇప్పుడే ఇదే చర్చనీయాంశంగా మారింది. రాహుల్‌ గాంధీ.. కాంగ్రెస్‌ అగ్రనేత, మాజీ ప్రధాని కుమారుడు.. అలాంటి నేత భద్రతా విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయ్‌. రాహుల్ గాంధీ సభకు భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. మొదటి నుంచి కాంగ్రెస్‌ సభకు ఆటంకాలు సృష్టించారనే ఆరోపణలు ఎందుర్కొంది ప్రభుత్వం. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రోదల్భంతో అధికారులు.. అడుగడుగునా.. ఇబ్బందులు పెట్టారని ఆరోపిస్తోంది హస్తం పార్టీ.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×