BigTV English

Maoist Celebrations: మావోయిస్టుల వారోత్సవాలు.. అలెర్ట్ అయిన పోలీసులు

Maoist Celebrations: మావోయిస్టుల వారోత్సవాలు.. అలెర్ట్ అయిన పోలీసులు

Police on high alert in Telangana During the Maoist Celebrations: నేటి నుంచి ఆగస్టు 3 వరకు జరగనున్న మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో ములుగు జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో పోలీసులు భారీగా మోహరించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైనా వాజేడు, వెంకటాపురంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. అడవుల్లో కూంబింగ్ చేస్తున్నారు. గ్రామాల్లో వాహనాలు తనిఖీలు చేస్తూ అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


వెంకటాపురం పోలీస్ స్టేషన్ లో గతంలో సానుభూతిపరులను పిలిపించి మావోయిస్టులకు సహకరించొద్దని సహకరిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. గిరిజన గ్రామాల్లో, గుడారాల్లో కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. మావోయిస్టులను పట్టిస్తే బహుమతులు ఇస్తామని,వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని కరపత్రాలు అంటిస్తున్నారు.

Also Read: బీఆర్ఎస్ లో ‘స్థానిక’ గుబులు..రేవంత్ తొందరపడేది అందుకేనా?


బాంబ్ స్కాడ్,డాగ్ స్క్వాడ్ బృందాలతో వాహనాలు,కల్వర్ట్లను తనీఖిలు చేస్తున్నారు. మావోయిస్టు టార్గెట్లో ఉన్న వ్యక్తులను సుదూర ప్రాంతాలకు వెళ్ళాలని సూచించారు.దీంతో ఏజెన్సీ లో ఎప్పుడు ఏమి జరుగుతుందో అని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు..

Tags

Related News

Hyderabad Rains: సాయంత్రం అయితే చాలు..ఒకటే కుమ్ముడు, మళ్లీ తడిచి ముద్దైన భాగ్యనగరం

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Big Stories

×