Big Stories

Hyderabad : యూత్‌ కాంగ్రెస్‌ వార్‌ రూమ్‌ లో పోలీసుల సోదాలు.. అందుకే టార్గెట్ చేశారా..?

- Advertisement -

Telangana Congress News(Hyderabad News Today) : హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని యూత్‌ కాంగ్రెస్ విభాగం నిర్వహిస్తున్న సోషల్ మీడియా వార్ రూమ్ లో
సైబరాబాద్ పోలీసులు సోదాలు చేపట్టారు. ఆకస్మిక తనిఖీలు చేశారు. డేటాతోపాటు కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ ఎంతో కీలకమైన పాత్ర పోషించిందని ఇటీవల కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో యూత్‌ కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ వార్ రూమ్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టడం చర్చనీయాంశమైంది.

- Advertisement -

ఈ ఘటనను యూత్ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం యూత్ కాంగ్రెస్ ఎలా పనిచేసిందో.. అలాగే తెలంగాణలోనూ పనిచేస్తోందన్నారు. అందుకే సీఎం కేసీఆర్ తమను దెబ్బ కొట్టడానికే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని యూత్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి మండిపడ్డారు.

హైదరాబాద్ యూత్ డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో యూత్ కాంగ్రెస్ , సోషల్ మీడియా విభాగం కృషి చేస్తోందన్నారు. తమ పని సక్సెస్ అవుతుందేమోననే భయంతోనే కేసీఆర్ పోలీసులతో తమ కార్యాలయంపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు ఎలాంటి సమాచారం, నోటీసులు ఇవ్వకుండానే దాడులు చేసి కంప్యూటర్లు తీసుకెళ్లారని మండిపడ్డారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News