BigTV English

TSPSC: ప్రవీణ్ లీక్స్ వెనుక కేసీఆర్ ఫ్యామిలీ హస్తం?.. 9 ఏళ్లుగా అన్ని పేపర్లూ లీక్ అయ్యాయా?

TSPSC: ప్రవీణ్ లీక్స్ వెనుక కేసీఆర్ ఫ్యామిలీ హస్తం?.. 9 ఏళ్లుగా అన్ని పేపర్లూ లీక్ అయ్యాయా?

TSPSC: దారుణం. అరాచకం. తవ్వేకొద్దీ లీకులు బయటపడుతున్నాయి. TSPSCలో జరుగుతున్న గోల్‌మాల్ యవ్వారం వెలుగులోకి వస్తోంది. ఒకటి రెండు కాదు.. అనేక ప్రభుత్వ నియామక పరీక్షల పేపర్లు లీక్ అయినట్టు తెలుస్తోంది. ఏకంగా గ్రూప్ 1 ఎగ్జామ్ పేపర్ కూడా బయటకు వచ్చిందనే అనుమానం ఉంది. TSPSC కార్యదర్శి పీఏ ప్రవీణ్ ఈ లీకేజ్‌లో ప్రధాన పాత్రధారిగా ఉన్నాడు. మరి, సూత్రధారులెవరు?


ఇంకెవరు ప్రభుత్వ పెద్దలే అంటున్నాయి ప్రతిపక్షాలు. బీజేపీ, కాంగ్రెస్, టీజేఎస్.. ఇలా అన్ని పార్టీలు ప్రభుత్వ బాస్‌ల వైపే వేలెత్తి చూపిస్తున్నాయి. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడతారా? టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యులందరినీ తొలగించాల్సిందేనని మూముమ్మడిగా డిమాండ్ చేస్తున్నాయి.

రాబోయే రెండు నెలల్లో జరగబోయే పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలన్నీ కేసీఆర్‌ టీమ్‌కు లీకయ్యాయని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో సింగరేణి పరీక్షా పత్రాలు కూడా లీకయ్యాయని ఆరోపించారు. ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై న్యాయవిచారణ జరిపించాల్సిందేనన్నారు.


టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజ్ వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని.. సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల పాత్ర లేదని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. గతంలో కూడా పలు పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయని ఆరోపించారు. ఇంత జరుగుతోన్న ప్రభుత్వం తరఫున ఫిర్యాదు చేయలేదని.. విచారణ జరిపితే ప్రభుత్వంలోని పెద్దలు దొరుకుతారనే పేపర్ లీకేజీపై సర్కారు ఫిర్యాదు చేయడం లేదని విమర్శించారు. పేపర్ లీక్ ఘటనపై సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు రేవంత్‌రెడ్డి.

Rain: అలర్ట్.. రానున్న మూడు రోజులు భారీ వర్షాలు.. ఆ ప్రాంతాల్లో వడగళ్లు పడే అవకాశం..

Telangana: వారెవా సచివాలయం.. లోపలంతా హైఫై డిజైన్.. స్పెషల్ వీడియో..

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×