BigTV English
Advertisement

Money : రౌండ్ ఫిగర్ గా డబ్బులు బహుమతిగా ఇవ్వకూడదా..

Money : రౌండ్ ఫిగర్ గా డబ్బులు బహుమతిగా ఇవ్వకూడదా..
Money

Money : హిందువుల పెళ్లిళ్లలోనే కాదు ఇతర మతస్థుల ఇళ్లల్లో జరిగే శుభకార్యాలయాల సమయంలో డబ్బులు కానుకగా ఇస్తుంటారు. ముఖ్యంగా పెళ్లిళ్లలోనే నవ జంటను ఆశీర్వదిస్తూ బంధువులు, స్నేహితులు , అయినోళ్ల ఎవరైనా సరే ఎంతో కొంత డబ్బును గిఫ్ట్ గా ఇస్తుంటారు. ప్ర‌ధానంగా హిందువులైతే పెళ్లిళ్లు, జ‌న్మ‌దినోత్స‌వాలు, వివాహ రిసెప్ష‌న్లు వంటివి జ‌రిగితే బ‌హుమ‌తుల‌ను అంద‌జేస్తారు. మ‌నీ క‌వ‌ర్‌ల‌లో కొంత మొత్తం పెట్టి అందిస్తారు. అయితే ఆ మొత్తం ఎప్పుడు రౌండ్ ఫిగర్ గా ఇవ్వరు. 51, రూ.101, రూ.201, రూ.501, రూ.1001, 10001 అలా ఉంటుంది.


చివర్లో సున్నాల అంకెల్లో మొత్తాలు గిప్ట్ ఇస్తే అలా తీసుకున్న వాళ్లకి చెడు జరుగుతున్న నమ్మకమే రౌండ్ ఫిగర్ ఎమౌంట్ ఇవ్వకుండా చేస్తుంది. 50, 100 ఇలా చివర సున్నా అంకెల మొత్తాన్ని ఇస్తే వాటికి తీసుకున్న వారికి కష్టాలు తప్పవట. ఆర్ధిక సమస్యలతోపాటు ఆరోగ్య ప‌రంగా ఇబ్బందులు ఎదుర్కొంటారన్న సెంటి మెంట్ ఇలా చేయిస్తుదంట. పెళ్లి జంటకి రౌండ్ ఫిగ‌ర్‌లో డ‌బ్బును చ‌దివిస్తే దాంతో వారి వైవాహిక జీవితంలో స‌మ‌స్య‌లు ఎదురయ్యే అవకాశం ఉందని కొందరు నమ్ముతుంటారు. కొంద‌రైతే శుభకార్యాలు కాక‌పోయినా త‌మ‌కు రావ‌ల్సిన డ‌బ్బుల‌కు అదనంగా ఒక రూపాయి క‌లిపి మ‌రీ తీసుకుంటారు.

అయితే రౌండ్ ఫిగ‌ర్‌లో కాకుండా రూ.51, రూ.101 ఇస్తే దాన్ని విభ‌జించేందుకు వీలుండ‌దు క‌దా..! ఆ క్ర‌మంలో వ‌ధూవ‌రులు ఒకే మ‌న‌స్సుతో జీవిస్తారట. దాంప‌త్య జీవితం అన్యోన్యంగా, సాఫీగా సాగిపోతుంది. రౌండ్ ఫిగ‌ర్ మొత్తానికి రూ.1 క‌లిపి ఇవ్వ‌డం వ‌ల్ల ఆ మొత్తాన్ని తీసుకునే వారికి, ఇచ్చే వారికి అన్ని విధాలుగా శుభం క‌లుగుతుంద‌ట‌. అలా డ‌బ్బు ఇవ్వ‌డం వ‌ల్ల పెద్ద వారి ఆశీస్సులు ల‌భిస్తాయ‌ని న‌మ్ముతారు. అందుకే మ‌న పెద్ద‌లు రౌండ్ ఫిగ‌ర్‌లో, సున్నా వ‌చ్చేలా డ‌బ్బును బ‌హుమ‌తిగా ఇవ్వ‌కూడ‌ద‌ని చెబుతారు. కాబ‌ట్టే ఇచ్చే మొత్తానికి రూ.1 క‌లిపి ఇస్తారు.


Tags

Related News

Karthika Masam 2025: కార్తీక మాసం చివరి సోమవారం.. ఇలా పూజ చేస్తే శివయ్య అనుగ్రహం

Shani Puja: ఈ నాలుగు పనులు చేశారంటే శని దేవుడు మీ కష్టాలన్నీ తీర్చేస్తాడు

Vastu tips: మహిళలు నిలబడి చేయకూడని పనులు ఇవన్నీ.. చేస్తే పాపం చుట్టుకుంటుంది

Vastu tips: మీ ఇంట్లో ప్రతిరోజూ కర్పూరం వెలిగించడం వల్ల జరిగేది ఇదే

Vastu Tips: ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందా ? అయితే ఈ వాస్తు టిప్స్ పాటించండి !

Money Plant: మనీ ప్లాంట్ నాటుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Vastu tips: వంట గదిలో మీ చేతిలోంచి ఈ ఐదు వస్తువులు జారి పడకుండా చూసుకోండి

Karthika Masam: కార్తీక మాసంలో.. ఎలాంటి దానాలు చేస్తే మంచిదో తెలుసా ?

Big Stories

×