BigTV English

Palakurthi : ఎర్రబెల్లికి ఎదురుగాలి వీస్తుందా..? యశస్వినిరెడ్డి గెలుపు ఖాయమేనా..?

Palakurthi : ఎర్రబెల్లికి ఎదురుగాలి వీస్తుందా..? యశస్వినిరెడ్డి గెలుపు ఖాయమేనా..?

Palakurthi : పాలకుర్తిలో ఇక పోరు రసవత్తరంగా మారనుంది. మంత్రి ఎర్రబెల్లికి గట్టి పోటీ తగలనుంది. కాంగ్రెస్‌ అభ్యర్థి యశస్వినిరెడ్డి నామినేషన్‌కి లైన్‌ క్లియర్‌ కావడం ఎర్రబెల్లి వర్గానికి ముచ్చెమటలు పట్టిస్తోంది. ఆమెని పోటీ నుంచి తప్పించేందుకు వేసిన ఎత్తుగడలు చిత్తయ్యాయి. అధికారులపై ఒత్తిడి చేసేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి.ఈ పరిణామాలతో ఎర్రబెల్లి టీమ్‌కి హెడేక్‌గా మారగా.. యశస్వినిరెడ్డి మద్దతుదారులకి కొత్త ఉత్సహాన్ని ఇస్తున్నాయి. నామినేషన్‌కి ఆమోదం లభించిన తరహాలోనే పాలకుర్తిలో గెలిచి సత్తా చాటుతామని యంగ్‌ తరంగ్‌ ధీమా వ్యక్తం చేస్తోంది. మరోవైపు పాలకుర్తిలో బీఆర్‌ఎస్‌ నేతలు పార్టీని వీడుతూ.. కాంగ్రెస్‌లో చేరడం అధికార పార్టీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.


పాలకుర్తిలో పోలింగ్‌కు ముందే కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించినట్లు కనిపిస్తోంది. ఆ పార్టీ నేతల్లో జోష్‌ నెలకొంది. కాంగ్రెస్‌ అభ్యర్థి యశస్వినిరెడ్డి నామినేషన్‌ ఆమోదం పొందడమే ఇందుకు కారణం. ఎన్నికల అధికారుల నుంచి లైన్ క్లియర్‌ కావడం హస్తం శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఎన్నికలంటేనే నామినేషన్‌లు వేయడం.. ఆమోదం లభించడం పరిపాటే.. కానీ పాలకుర్తిలో మాత్రం యశస్వినిరెడ్డి పోటీలో ఉండకుండా నిలువరించేందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చేసిన ప్రయత్నాలు విఫలమవడం హాట్‌టాపిక్‌గా మారింది. యశస్విని నామినేషన్ రిజెక్ట్ అవుతుందంటూ ఎర్రబెల్లి వర్గం తీవ్ర ప్రచారం చేసింది. ఆమె సమర్పించిన డాక్యుమెంట్లపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇటీవల బీఆర్‌ఎస్ నేతలు రిటర్నింగ్‌ ఆఫీసర్‌తో వాగ్వాదానికి దిగారు. యశస్వినిని పోటీ నుంచి తప్పించడానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆనేక ప్రయత్నాలు చేశారు. అయితే సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ ప్రకారం నామినేషన్‌ పత్రాలన్నీ సక్రమంగానే ఉన్నాయని ఆర్వో నిర్ణయించారు. ఫలితంగా ఎర్రబెల్లి వర్గానికి షాక్‌ తగిలినట్లైంది. నామినేషన్‌కి గ్రీన్‌సిగ్నల్‌ లభించగా యశస్విని రెడ్డి పాలకుర్తి సోమేశ్వర ఆలయంలో పూజలు చేశారు.

పాలకుర్తి నియోజకవర్గంలో రాజకీయాలు హాట్‌హాట్‌గా మారుతున్నాయి. తనకి ఈసారి ఎదురుగాలి వీస్తుండగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు బెంబేలెత్తుతున్నారు. ఎన్‌ఆర్‌ఐ ఝాన్సీరెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు ముందే గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసుకున్నారు. సొంత డబ్బులతో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. పాలకుర్తిని అన్ని రంగాల్లోనూ తీర్చిదిద్దేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ప్రజల నుంచి కూడా ఝాన్సీరెడ్డి కుటుంబానికి మంచి స్పందన లభిస్తోంది. ఇదే సమయంలో ఆమె పోటీలో నిలవకుండా పౌరసత్వం ఇష్యూ తెరపైకి వచ్చింది. బీఆర్ఎస్‌ పార్టీ బీజేపీతో కలిసి కుట్ర చేసి తనని పోటీ చేయకుండా నిలువరించిందని ఎన్ఆర్‌ఐ ఫ్యామిలీ అగ్రహంగా ఉంది. ఇదే సమయంలో ఇక తనకి ఎదురు లేకుండా పోతుందని భావించిన ఎర్రబెల్లికి.. ఝాన్సీరెడ్డి కోడలు యశస్వినిరెడ్డి పోటీకి దిగడంతో మళ్లీ టెన్షన్ మొదలైంది. ఆమె నామినేషన్ ఆమోదం పొందకుండా కంప్లైంట్స్‌ ఇవ్వడమే కాకుండా ఎన్నికల ఆధికారులతోనూ వాగ్వాదాలకి దిగారు. చివరకు యశస్విని నామినేషన్‌లో ఎలాంటి లోపాలు లేవని అధికారులు తేల్చగా ఎర్రబెల్లికి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లైందని కాంగ్రెస్‌ నేతలు కామెంట్లు చేస్తున్నారు.


రాజకీయాల్లోకి యువత రావాలి.. మహిళలు రావాలి.. ఇది అందరూ ఎప్పుడూ చెప్పే మాటే. దాన్ని నిజం చేస్తూ కాంగ్రెస్ పార్టీ.. అత్యంత పిన్న వయస్కురాలికి పాలకుర్తి టిక్కెట్ ఇచ్చి పోటీలో నిలబెట్టింది. పాలిటిక్స్‌ అంటే దశాబ్దాల తరబడి పాతుకుపోయిన వారే కాదంటూ జనగామ జిల్లా పాలకుర్తి బరిలో దిగిన 26 ఏళ్ల యశస్విని రెడ్డి.. మంత్రి ఎర్రబెల్లికి గట్టి పోటీ ఇస్తున్నారు. ఆమె ఎంట్రీతో సీనియర్ మోస్ట్ లీడర్లే రాజకీయాన్ని శాసించాలా? అన్న ప్రశ్నలను యువత లేవనెత్తుతోంది. నియోజకవర్గం దశ మారుతుందని భావిస్తున్న ప్రజలు స్వచ్ఛందంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. యశస్విని రెడ్డి రాజకీయాల్లోకి వస్తూనే.. తన మనసులో ఉన్న విషయాలను నియోజకవర్గ ప్రజలతో పంచుకున్నారు. పాలకుర్తిలో గెలిస్తే ఐదేళ్ల ఎమ్మెల్యే వేతనాన్ని ప్రజాసంక్షేమ కార్యక్రమాలకే డొనేట్ చేస్తానని ప్రకటించారు. ప్రజాసేవ చేయడమే తమ కుటుంబం లక్ష్యమని క్లారిటీ ఇచ్చారు. ఈ పరిణామాలతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాలకుర్తి నియోజకవర్గానికే పరిమితం అవుతున్నారు. గతంలో పక్క నియోజకవర్గాల్లో ప్రచారం చేసిన ఎర్రబెల్లి.. సొంత సెగ్మెంట్‌లో ఓడిపోకుండా ఫోకస్ పెంచారు.

పాలకుర్తి పాలిటిక్స్‌ పూర్తిగా వన్‌సైడ్‌గా మారుతున్నాయి. ఎర్రబెల్లి ప్రధాన అనుచరులు ఒక్కొక్కరుగా కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే యశస్విని ప్రచారంలో దూసుకెళ్తున్నారు.తాజాగా నామినేషన్‌కి కూడా ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకపోవడం కాంగ్రెస్‌ కార్యకర్తల్లో ఫుల్ జోష్‌ నింపుతోంది. పాలకుర్తిలో ఇక రసవత్తర పోటీ జరగడం ఖాయమనే టాక్‌ నడుస్తోంది. ఇకనైనా ఎర్రబెల్లి దయకార్‌రావు కుట్ర రాజకీయాలు వీడి ప్రజాక్షేత్రంలో తమను ఎదుర్కోవాలని యశస్వినిరెడ్డి కుటుంబం.. కాంగ్రెస్‌ పార్టీ సవాల్‌ చేస్తోంది. ఎర్రబెల్లి ఎత్తుగడలు యువ నాయకురాలి ముందు చిత్తుకావడం ఖాయమని హస్తం నేతలు ధీమాగా చెబుతున్నారు.

.

.

.

Related News

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

ABP C Voter Survey Telangana | బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల సర్వే..

BRS Dark Secrets | బిఆర్ఎస్ పాలనలోని జీవో ఫైళ్లు మాయం.. రహస్య జీవోలతో కేసీఆర్ దాచినదేమిటి?

BJP : బీజేఎల్పీ నేత ఎవరు? రాజాసింగ్ కే ఇస్తారా?

Big Stories

×