BigTV English

Cantonment Polling: ముగిసిన కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్

Cantonment Polling: ముగిసిన కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్

Secunderabad Cantonment Assembly By Elections 2024: తెలంగాణలో 17 పార్లమెంటు నియోజకవర్గాలతోపాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ కూడా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది.


కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీ లాస్య నందిత రోడ్డు ప్రమాదానికి గురై దుర్మరణం చెందారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. కంటోన్మెంట్ తోపాటు దేశంలోని 25 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఉప ఎన్నికల షెడ్యూల్ ఈసీ విడుదల చేసి నేడు పోలింగ్ నిర్వహించింది. అత్యధికంగా హిమాచల్ ప్రదేశ్ లో ఆరు అసెంబ్లీ స్థానాలు ఉప ఎన్నికను ఎదుర్కొన్నాయి.

కాగా, కంటోన్మెంట్ ఉప ఎన్నిక కోసం 232 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ తరఫున దివంగత ఎమ్మెల్యే సోదరి నివేదిత, కాంగ్రెస్ నుంచి శ్రీగణేశ్, బీజేపీ పార్టీ నుంచి టీఎన్ వంశ తిలక్ పోటీ చేశారు.


Also Read: Indigo Flight: శంషాబాద్ ఎయిర్ పోర్టులో నిలిచిన విమానం,టేకాఫ్ సమయంలో..

అనివార్యమైన ఉప ఎన్నిక బరిలో నిలబడాలని స్థానిక లీడర్లు, గులాబీ శ్రేణులు, జనం తనను కోరుతున్నారని, వాళ్లందరి మద్దతుతో తాను ఈ ఉపఎన్నికలో పోటీ చేస్తున్నట్లు నివేదిత పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే, తన తండ్రి దివంగత నేత సాయన్నకు మద్దతుగా ప్రజలంతా నిలిచారు.. ఆ ప్రజలే తన సోదరి లాస్య నందితకు కూడా మద్దతిచ్చి భారీ మెజార్టీతో గెలిపించి ఆశీర్వాదించారని గుర్తు చేసుకుంటూ.. దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో ఆమెను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేసిన విషయం విధితమే.

Tags

Related News

Hyderabad floods: హైదరాబాద్‌కు భారీ వర్షాల భయం పోతుందా? సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రణాళిక ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Big Stories

×