Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కిరాక్ పార్టీ అనే కన్నడ సినిమాతో రష్మిక తన కెరీర్ ను మొదలుపెట్టింది. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక తన మొదటి సినిమాలో తనతో రొమాన్స్ చేసిన హీరో రక్షిత్ శెట్టితోనే అమ్మడు పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అయ్యింది. వీరిద్దరి ఎంగేజ్ మెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.
ఇక ఎంగేజ్ మెంట్ తరువాత రష్మికకు తెలుగులో ఛలో సినిమా ఛాన్స్ వచ్చింది. ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక భారీ విజయాన్ని అందుకుంది. ఆ తరువాత విజయ్ దేవరకొండ తో కలిసి గీత గోవిందం సినిమా చేసింది. ఈ సినిమా ఆమె జీవితాన్ని మార్చేసింది. టాలీవుడ్ లో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారింది. వరుస సినిమాలు క్యూ కట్టాయి.
The Raja Saab: ఇదెక్కడి ట్విస్ట్ రా మావా.. ప్రభాస్ తో లేడీ సూపర్ స్టార్.. థియేటర్లు దద్దరిల్లడమే
మరి సినిమాలు ఎక్కువ వస్తున్నాయనో.. లేక విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉందనో తెలియదు కానీ.. రష్మిక, రక్షిత్ తో చేసుకున్న ఎంగేజ్ మెంట్ ను క్యాన్సిల్ చేసుకొని సినిమాలకే అంకితమయ్యింది. ఇక ఆ తరువాత నుంచి తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ.. ఇలా భాషతో సంబంధం లేకుండా నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది.
సినిమాలు విషయం పక్కన పెడితే.. గీత గోవిందం నుంచే విజయ్ -రష్మిక ప్రేమలో ఉన్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి. మొదట్లో ఈ జంట తామిద్దరం కేవలం మంచి స్నేహితులమే అని చెప్పుకొచ్చారు. ఆ తరువాత వీరిద్దరూ కలిసి వెకేషన్స్ కు వెళ్లడం.. రెస్టారెంట్స్ కు వెళ్లడం కెమెరా కంటికి కనిపిస్తూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా రష్మిక తన ప్రతి పండగను విజయ్ ఇంట్లోనే జరుపుకుంటుంది.
RAPO22: క్లాస్ లుక్ లో రామ్ పోతినేని.. ఈసారి హిట్ ఖాయం
విడివిడిగా విజయ్, రష్మిక ఫోటోలను పెట్టినా ఫ్యాన్స్ ఇట్టే కనిపెట్టేస్తున్నారు. ఇక ఈ మధ్యనే ఈ జంట.. తమ ప్రేమ వ్యవహారంపై హింట్ ఇచ్చారు. ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయితోనే తాను లవ్ లో ఉన్నట్లు విజయ్ చెప్పగా.. రష్మిక పెళ్లి గురించి, తన ప్రేమ గురించి అడిగిన ప్రతిసారి మీకు తెలుసుగా అని చెప్పుకొచ్చేసింది. దీంతో వీరి ప్రేమ అధికారికంగా మారిపోయింది.
ఇక తాజాగా రష్మిక నటించిన పుష్ప 2 సినిమా నిన్న రిలీజ్ అయిన విషయం తెల్సిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వచ్చిన ఈ చిత్రంలో శ్రీవల్లీ పాత్రలో రష్మిక నటించింది అనడం కన్నా జీవించింది అని చెప్పాలి. డిసెంబర్ 5 న రిలీజ్ అయిన పుష్ప 2 భారీ విజయాన్ని అందుకుంది. గతరాత్రి పుష్ప 2 సినిమాను రష్మిక.. విజయ్ దేవరకొండ కుటుంబంతో కలిసి వీక్షించింది.
BB Telugu 8 Promo: నిఖిల్ వర్సెస్ గౌతమ్.. రంగుపడుద్ది..!
విజయ్ తల్లి మాధవి, విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండతో కలిసి శ్రీవల్లీ సినిమాను చూసింది. ఇందుకు సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. అంతేకాకుండా.. విజయ్ రౌడీ బ్రాండ్ టీ షర్ట్ తో రష్మిక కనిపించడంతో మొత్తానికి కాబోయే భర్త బ్రాండ్ కు కూడా ప్రమోషన్స్ చేస్తున్నావ్ అన్నమాట అంటూ ఫ్యాన్స్ సరదాగా కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ జంట త్వరలోనే పెళ్లి గురించి అధికారికంగా ప్రకటిస్తారేమో చూడాలి.