Big Stories

CM Power Review : విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రివ్యూ.. ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ డుమ్మా..

CM Power Review : 85 వేల కోట్ల అప్పుల భారంతో ఉన్న విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఆ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. డిస్కంలపై అప్పుల వేల కోట్లకు చేరడంపై ఆరా తీశారు. విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన గోల్‌మాల్‌ను తేల్చేందుకు అధికారులను అన్ని వివరాలతో రావాలని ఆదేశించారు. దీంతో అధికారులు సమావేశానికి హాజరయ్యారు. కానీ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు మాత్రం డుమ్మాకొట్టారు. ఆయన రాజీనామా చేస్తున్నట్టు రెండు రోజుల క్రితం సమాచారం ఇచ్చారు. కానీ సీఎం ఆ రాజీనామాను ఆమోదించవద్దని ఇప్పటికే అధికారులను ఆదేశించారు. పదేళ్లుగా ప్రభాకర్ రావు ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీగా ఉన్నారు. సమావేశానికి రాకపోవడంతో పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. సీఎం ఆదేశాలపై ప్రభాకర్ రావు ఇప్పటి వరకు స్పందించలేదు.

- Advertisement -

రాష్ట్రంలో విద్యుత్‌ వ్యవస్థ పనితీరుపై వాడివేడిగా చర్చ సాగింది. విద్యుత్‌ రంగంలో ఏం జరిగిందో తెలుపుతూ సమగ్రంగా శ్వేతపత్రం విడుదల చేయాలని మంత్రివర్గం అభిప్రాయపడింది. ఆ శాఖలో వాస్తవాలను వెల్లడించకుండా చాలాకాలంగా దాచిపెట్టడాన్ని తప్పుపడుతూ.. ఆ శాఖ ఉన్నతాధికారిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

- Advertisement -

విద్యుత్‌ సంక్షోభం తెచ్చేలా రాష్ట్రంలో కుట్ర జరిగిందని సీఎం రేవంత్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. విద్యుత్‌ సంస్థలకు ఇప్పటివరకు 85 వేల కోట్ల అప్పులున్నట్లు సీఎంకు అధికారులు చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్తుపై కుట్ర జరిగిందని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కేసీఆర్ కుట్ర చేశారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే చీకటి వస్తుందని, తెలంగాణ సమాజాన్ని పక్కదారి పట్టించారని ఆరోపించారు.

మరోవైపు తెలంగాణ సీఎం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్టీ హైకమాండ్ పెద్దల్ని కలవనున్నారు. మంత్రులకు శాఖల కేటాయింపుపై చర్చించనున్నట్టు సమాచారం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News