BigTV English

South Africa vs India : సౌతాఫ్రికాలో దిగిపోయారు .. టీమ్ ఇండియా క్రికెటర్ల సందడి ..

South Africa vs India  : సౌతాఫ్రికాలో దిగిపోయారు .. టీమ్ ఇండియా క్రికెటర్ల సందడి ..
South Africa vs India

South Africa vs India : సౌత్ ఆఫ్రికాలో నెలరోజుల పర్యటన సందర్భంగా టీమ్ ఇండియా ప్లేయర్లు ఆ గడ్డపై అడుగు పెట్టారు, 10వ తేదీన మొదటి టీ 20 మ్యాచ్ జరగనుంది. ఈ రోజు మాత్రమే రెస్ట్ దొరకనుంది. రేపు మళ్లీ ప్రాక్టీస్ చేయాలి. మరుసటి రోజు మ్యాచ్ ప్రారంభమవుతుంది.


ఈ నేపథ్యంలో టీమ్ ఇండియా ప్లేయర్లు ఎయిర్ పోర్టులో దిగిన వీడియోను బీసీసీఐ నెట్టింట షేర్ చేసింది. రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, మహమ్మద్ సిరాజ్, యశస్వి జైశ్వాల్, రింకూ సింగ్, తిలక్ వర్మ, శ్రేయస్ అయ్యర్, అర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్ వంటి ప్లేయర్లు  ఆ వీడియోలో ఉన్నారు.

‘హాయ్ గాయ్స్ వెల్‌కమ్ టూ సౌతాఫ్రికా అంటూ టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పిన మాటలు ఆ వీడియోలో ఉన్నాయి. ఇటీవల బీసీసీఐ చేస్తున్న వీడియోస్ లో సూర్య కుమార్ కి అవకాశం ఎక్కువగా ఇస్తున్నారు. మొన్న వరల్డ్ కప్ సమయంలో కూడా ముంబయి బీచ్ రోడ్డులో ఇలాగే పబ్లిక్ ఇంటర్వ్యూ చేసిన సూర్య తన అభిమానులకి షాక్ ఇచ్చాడు.


ఆ వీడియోలో ఎయిర్ పోర్ట్ బయట వర్షం వస్తున్నట్టు కనిపించింది. మన ఆటగాళ్లు అందరూ చేతులు తలలపై పెట్టుకుని హడావుడిగా పరుగులెట్టడం కనిపించింది. మరి ఆదివారం జరిగే టీ20 మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగిస్తుందా? అనే సందేహాలు అప్పుడే మొదలయ్యాయి.

మొదటి టీ 20 మ్యాచ్ లు మూడు, తర్వాత వన్డేలు మూడు జరుగుతాయి. అందుకనే ఆ రెండు జట్లు ఒకేసారి సౌతాఫ్రికా గడ్డమీద అడుగుపెట్టాయి. అయితే టెస్ట్ మ్యాచ్ లు ఆడే క్రికెటర్లు మాత్రం తర్వాత వెళతారు. అందులో టెస్ట్ లకి మాత్రమే ఎంపికైన రోహిత్, కొహ్లీ తదితరులు వెనుక వెళతారు.

డిసెంబరు 10 నుంచి టీ 20 సిరీస్, డిసెంబర్ 17 నుంచి వన్డే సిరీస్ , డిసెంబరు 26 నుంచి జనవరి 7 వరకు 2 టెస్ట్ మ్యాచ్ లు జరగనున్నాయి.

Related News

Arjun Tendulkar: రహస్యంగా సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్ ఎంగేజ్‌మెంట్.. అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఇదే!

Dinda Academy Trolls : Dinda Academy అని ఎందుకు ట్రోలింగ్ చేస్తారు..?

Nithish Kumar Reddy : మహేష్ కోసం త్యాగం.. కొత్త టాటూలతో రెచ్చిపోయిన నితీష్ కుమార్ రెడ్డి

Rashid Khan : సరికొత్త షాట్ కనిపెట్టిన రషీద్ ఖాన్… చరిత్రలో నిలిచి పోవడం గ్యారెంటీ

Grace Hayden on Pant: రిషబ్ పంత్ పై ఆస్ట్రేలియా క్రికెటర్ కూతురు మోజు.. బోల్డ్ కామెంట్స్ వైరల్ !

WI Beat Pak in ODI Series : పాకిస్తాన్ క్రికెట్ లో భూకంపం..5 గురు డకౌట్.. 34 ఏళ్ల తర్వాత ఓటమి

Big Stories

×