E-Paper
Advertisement

Fighter Movie Teaser : ఏరియల్ షాట్స్ తో అదరగొడుతున్న ఫైటర్ టీజర్ ..

Fighter Movie Teaser : ఏరియల్ షాట్స్ తో అదరగొడుతున్న ఫైటర్ టీజర్ ..
Advertisement
Fighter Teaser

Fighter Movie Teaser : యాక్షన్ సినిమాలు అంటే హాలీవుడ్ తర్వాతే అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే గత కొద్ది కాలంగా బాలీవుడ్ , టాలీవుడ్ కూడా ఆ రెంజ్ యాక్షన్ సినిమాలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. భారీ విజువల్స్ తో పాటు ,మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సన్నివేశాలతో హాలీవుడ్ ని తలపించే చిత్రాలు ఎక్కువ ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. అయితే ఆరెంజ్ విజువల్స్ చూపించగలిగే తెలుగు డైరెక్టర్స్.. అదేనండి మన రాజమౌళి లాంటి వాళ్లు చాలా అరుదని చెప్పవచ్చు. కానీ హాలీవుడ్ టాప్ గన్ మేవరిక్, మిషన్ ఇంపాజిబుల్.. లాంటి యాక్షన్ చిత్రాలను జక్కన్న కూడా ఇంతవరకు ప్రయత్నించలేదు.

మరి అలాంటి మూవీ ని తెరకెక్కించడానికి బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ ఆనంద్ సిద్ధమయ్యాడు. అంత హై వోల్టేజ్ యాక్షన్ మూవీ చేయాలి అంటే..ట్రామ్ క్రూజ్ లాంటి హీరో కావాలి కదా. మరి అలాంటి ఫిజిక్.. ఆ ఇంటెన్సిటీ ఉన్న హీరో కావాలి అంటే..ఇండియన్ టామ్ క్రూజ్ హృతిక్ రోషన్ ఉండనే ఉన్నాడు కదా. అందుకే సిద్ధార్థ ఆనంద్ హృతిక్ తో చేయి కలిపాడు. ఇక వీరిద్దరి సూపర్ కాంబోలో మంచి ఫైటర్ మూవీ రాబోతోంది.

Advertisement

జనవరి 25 ,2024 న విడుదల కాబోతున్న ఈ ఫైటర్ మూవీకి సంబంధించిన టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. చాలా ఇంట్రెస్టింగా మంచి యాక్షన్స్ సన్నివేశాలతో.. పవర్ ప్యాకెడ్ గా ఉన్న ఈ టీజర్ మూవీపై అంచనాలను భారీగా పెంచుతోంది. ఈ మూవీ టీజర్ లో ప్రతి షాట్ ..ప్రతి ఫ్రేమ్.. అవుట్ ఆఫ్ ఇమాజినేషన్ అన్నట్లు ఉన్నాయి. ఈ టీజర్ లో దీపికా పదుకొణె, అనిల్ కపూర్ లుక్స్ రివీల్ చేశారు.

హృతిక్ రోషన్ ఈ మూవీ లో లీడర్ షంషేర్ పఠానియా (పాటీ) పాత్ర పోషిస్తుండగా..దీపికా పదుకొణె..స్క్వాడ్రన్ లీడర్‌ మిన్ని పాత్ర లో నటిస్తుంది. అనిల్‌ కపూర్‌ గ్రూప్ కెప్టెన్ రాకేష్ జై సింగ్ పాత్రలో కనిపించనున్నాడు.

Advertisement

ఊహకందని స్టాండింగ్ యాక్షన్ ఎపిసోడ్స్ తో ఫైటర్ మూవీ టీజర్ అదిరిపోయే రేంజ్ లో ఉంది. మరి ముఖ్యంగా ఆకాశంలో జరిగే ఏరియల్ షాట్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి. టీజర్ ఎండ్ షాట్లో హృతిక్ చోపర్ దిగుతున్న సమయంలో వచ్చే కట్ షాట్స్ గూస్ బంప్స్ క్రియేట్ చేసే విధంగా ఉన్నాయి. ఈ సాలిడ్ యాక్షన్ మూవీ విడుదల తర్వాత ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×