BigTV English

Pravallika Case Update : ప్రవళిక కేసులో బిగ్ ట్విస్ట్.. శివరాం కు బెయిల్.. ఆధారాల్లేవా?

Pravallika Case Update : ప్రవళిక కేసులో బిగ్ ట్విస్ట్.. శివరాం కు బెయిల్.. ఆధారాల్లేవా?

Pravallika Case Update : ప్రవళిక అత్మహత్య కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. శివరాం రిమాండ్‌ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. అతనికి బెయిల్‌ మంజూరు చేస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. కేసులో సరైన ఆధారాలు లేకపోవడంతో శివరాంకు బెయిల్ చేస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. 5 వేల రూపాయల వ్యక్తిగత పూచికత్తుతో శివరాంను వదిలేయాలని ఆదేశాలు జారీ చేసింది.


రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రవళిక ఆత్మహత్య కేసులో నిందితుడుగా ఉన్న శివరాం రాథోడ్‌ శుక్రవారం కోర్టులో లొంగిపోయాడు. నాంపల్లి కోర్టును ఆశ్రయించగా.. శివరాం తరుపు న్యాయవాది మెమో దాఖలు చేశారు. కోర్టులో విచారణ జరిగిన అనంతరం.. శివరాం రిమాండ్‌ పిటీషన్‌ను ఎలాంటి ఆధారాలు లేనందున నాంపల్లి కోర్టు తిరస్కరించింది. చాటింగ్ ఆధారాలతో రిమాండ్ ఎలా చేస్తారని పోలీసులను కోర్టు ప్రశ్నించింది. దీంతో పాటు కేసు దర్యాప్తు జరుగుతున్నందున రిమాండ్ ​ఇవ్వలేమని వెల్లడించింది.

కేసు పూర్తి వివరాలు తెలియజేస్తామని శివరాం న్యాయవాది కోర్టుకు తెలిపారు. అనంతరం ప్రవళిక ఆత్మహత్యకు కారణమని శివరాంపై కేసు నమోదు చేసింది. దీంతో కోర్టులోనే శివరాంను చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌​కు తరలించారు. శనివారం ఉదయం శివరాంను నాంపల్లి కోర్టులో హాజరుపరుచగా.. న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.


Related News

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

Big Stories

×