E-Paper
Advertisement

Mancherial Constituency : బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-2.. మంచిర్యాలలో గెలుపెవరిది?

Mancherial Constituency :  బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-2.. మంచిర్యాలలో గెలుపెవరిది?
Advertisement

Mancherial Constituency : తెలంగాణలో రాజకీయాలు కాకమీదున్నాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. చాలా నియోజకవర్గాల్లో ఎవరితో ఎవరు తలపడుతున్నారో క్లారిటీ వచ్చేసింది. కొద్దిరోజుల క్రితం పార్టీల బలాబలాలపై బిగ్ టీవీ క్షేత్రస్థాయిలో సర్వే చేసింది. ఇప్పుడు మంచిర్యాల నియోజకవర్గంలో గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందో తెలుసుకుందాం.

ఈ నియోజకవర్గంలో మొత్తం 2,64,512 మంది ఓటర్లు ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు కొద్దిగా ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ఖాతాలో ఈ స్థానం ఉంది. దివాకర్ రావు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

Advertisement

మొత్తం ఓటర్లు- 2, 64, 512
పురుష ఓటర్లు-1, 31, 871
మహిళా ఓటర్లు -1, 32, 292

బిగ్ టీవీ సర్వే- పందెం కోళ్లు -1 రిపోర్టు.. (11-09-2023 )
బిగ్ టీవీ సర్వే పందెం కోళ్లు-1 ప్రకారం ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ బలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ 49 శాతం ఓట్లు సాధిస్తుందని తేలింది. బీఆర్ఎస్ కు 41 శాతం ఓట్లు వస్తాయని సర్వేలో వెల్లడైంది. బీజేపీకి 5 శాతం ఓట్లు వస్తాయని సర్వే రిపోర్ట్ పేర్కొంది.

Advertisement

దివాకర్ రావు (బీఆర్ఎస్)- 41 శాతం
ప్రేమ సాగర్ రావు ( కాంగ్రెస్)-49 శాతం
బీజేపీ 5 శాతం

పందెం కోళ్లు -2 (03-11-2023)
తాజాగా బిగ్ టీవీ చేసిన సర్వేలో కాంగ్రెస్ కు 1 శాతం ఓట్లు పెరుగుతాయని వెల్లడైంది. కాంగ్రెస్ కు 50 శాతం ఓట్లు పడతాయని తేలింది. బీఆర్ఎస్ 41 శాతం ఓట్లు సాధిస్తుందని సర్వే తేల్చింది. బీజేపీకి 5 శాతం ఓట్లు పడతాయని అంచనా వేసింది.

దివాకర్ రావు (బీఆర్ఎస్)- 41 శాతం
ప్రేమ్ సాగర్ రావు ( కాంగ్రెస్)- 50 శాతం
బీజేపీ- 5 శాతం

హిస్టారికల్ డేటా : 2014లో బీఆర్ఎస్ కు 62 శాతం ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 23 శాతం ఓట్లు సాధించింది. బీజేపీకి 8 శాతం ఓట్లు పడ్డాయి. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ భారీ విజయాన్ని సాధించింది.

కానీ 2018 ఎన్నికల్లో 17 శాతం ఓట్లు బీఆర్ఎస్ కోల్పోయింది. ఆ ఎన్నికల్లో గెలిచినా.. 45 శాతం ఓట్లు మాత్రమే సాధించింది. 2014 కంటే కాంగ్రెస్ ఓటు బ్యాంకు అనూహ్యంగా పెరిగింది. 2018లో హస్తం పార్టీ 19 శాతం ఓట్లు అధికంగా సాధించింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 42 శాతం ఓట్లు పడ్డాయి. బీజేపీ మాత్రం 5 శాతం ఓట్లు కోల్పోయింది. కాషాయ పార్టీకి 3 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.

.

.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×