E-Paper
Advertisement

Property Tax: ట్యాక్స్ కలెక్షన్‌పై సర్కార్ ఫోకస్.. అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యేనా..!

Property Tax: ట్యాక్స్ కలెక్షన్‌పై సర్కార్ ఫోకస్.. అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యేనా..!

Property Tax: స్వేచ్ఛ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ లోని సుమారు కోటి 40 లక్షల మంది జనాభాకు అవసరాలకు తగిన అభివృద్దితో పాటు పౌర, అత్యవసర సేవలందించే మూడు మున్సిపల్ కార్పొరేషన్లకు ప్రధాన ఆర్థిక వనరుల్లో ఒకటైన ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ పై అధికారులు దృష్టి సారించారు. మూడు కార్పొరేషన్లు మూడు సరి కొత్త వ్యూహాలతో కలెక్షన్ పెంచుకునేందుకు సిద్దమయ్యాయి. ముఖ్యంగా స్టేట్ బడ్జెట్ లో సుమారు రూ. 9700 కోట్లను ఆర్జిస్తూ అధికారులు సర్కారుకు ప్రతిపాదనలు పంపగా, సర్కారు వాటికెలాంటి ప్రాధాన్యతనివ్వలేదు. ఒక్క హెచ్ సిటీ పనులకు మాత్రమే రూ. 2654 కోట్లను కేటాయించటంతో మూడు కార్పొరేషన్ల అధికారులు ప్రస్తుతం జరుగుతున్న ట్యాక్స్ కలెక్షన్ ను సోమవారం నుంచి మరింత ముమ్మరం చేయాలని భావిస్తున్నారు. ఆర్థిక సంసత్సరం ముగిసిన తర్వాత అదనపు ఆదాయ వనరులను అన్వేషించాలని భావిస్తున్నట్లు కూడా తెలిసింది. మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వినూత్నమైన విధానాన్ని అనుసరిస్తున్నారు.

ఉదయం తొమ్మిది గంటల నుంచి..

ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ ను స్పెషల్ డ్రైవ్ గా నిర్వహించాలని కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి ఆదేశాలు జారీ చేయటంతో వర్తమాన ఆర్థిక సంవత్సరం ట్యాక్స్ బకాయిదారులతో పదాటు మొండి బకాయిలున్న ఆస్తుల యజమానులను సిబ్బంది నేరుగా సంప్రదిస్తున్నారు. వారికి నేరుగా ఫోన్లు చేసి సార్.. మీ ఇంటి ట్యాక్స్ బకాయి ఉంది.. మీరు ఇపుడే చెల్లిస్తే మీ ట్యాక్స్ కు ఇప్పటి వరకు విధించిన వడ్డీలో 90 శాతం మాఫీ చేస్తామని సంభాషిస్తున్నారు. ఈ రకంగా మాల్కాజ్ గిరిలో సర్కిల్ కు ఇద్దరు చొప్పున ఎంగేజ్ చేసి, బకాయిదారులకు ఫోన్లు చేయిస్తున్నారు. ఈ కాల్స్ అన్ని ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల మధ్య కాల్ చేయిస్తున్నట్లు సమాచారం. వీటిలో సగానికి పైగా కాల్స్ కు బకాయిదారుల నుంచి చక్కటి స్పందన వస్తున్నట్లు అధికారులు తెలిపారు. సానుకూలంగా స్పందిస్తున్న సగానికి పైగా బకాయిదారులు కొందరు అప్పటికపుడే పన్ను చెల్లిస్తుండటం, మరి కొందరు ఒకటి రెండు రోజుల సమయం అడుగుతున్నట్లు తెలిసింది.

మూడో నోటీసులు జారీ..

మరి కొందరు ఎన్ని సార్లు కాల్ చేసినా, ఫోన్ లిఫ్టు చేయకపోవటంతో ఆ ఏరియా బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లకు సదరు ప్రాపర్టీ వివరాలు పంపించి వాకబు చేయిస్తున్నట్లు తెలిసింది. వివరాలన్నీ సరిగ్గానే ఉండి ఉద్దేశపూర్వకంగా ఫోన్లు లిఫ్టు చేయని యజమానులను గుర్తించి, వారికి ఫైనల్ నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిసింది. మరి కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఫైనల్, మూడో నోటీసులు జారీ చేసి, రెండు నుంచి మూడు రోజుల సమయం ఇచ్చినా, చెల్లించని వారి ఆస్తులను సీజింగ్ చేస్తున్నట్లు తెలిసింది. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో కూడా ట్యాక్స్ కలెక్షన్ ముమ్మరమైంది. ఈ కార్పొరేషన్ పరిధిలోని ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లకు రోజువారీ ట్యాక్స్ కలెక్షన్ టార్గెట్లు ఇచ్చి, ఉన్నతాధికారులు టెలీ కాన్ఫరెన్స్ లో ఎప్పటికపుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. సైబరాబాద్ లో కూడా ట్యాక్స్ కలెక్షన్ పై డైలీ దిశానిర్దేశం చేస్తూ, క్షేత్ర స్థాయిలో చేస్తున్న కలెక్షన్ ను ఎప్పటికపుడు పర్యవేక్షిస్తున్నారు.

Also Read: SFI Protest: గరికపాటిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్.. లేదంటే..?

9 రోజులు.. రూ.800 కోట్ల టార్గెట్!

పట్టణ విలీన సంస్థల విలీనం తర్వాత మూడు కార్పొరేషన్లుగా విభజించకముందు తొలుత రూ. 2200 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ ను అధికారులు టార్గెట్ గా పెట్టుకోగా, నవంబర్ 25 తర్వాత కోర్ అర్బన్ రీజియన్ లోని 27 పట్టణ స్థానిక సంస్థలను జీహెచ్ఎంసీలో విలీనం చేయటంతో ట్యాక్స్ కలెక్షన్ ను రూ. 3 వేల కోట్లుగా నిర్ణయించారు. ఇప్పటి వరకు మూడు కార్పొరేషన్ల పరిధిలో దాదాపు రూ. 2200 కోట్ల వరకు ట్యాక్స్ వసూలు కాగా, వర్తమాన ఆర్తిక సంవత్సరం ముగింపునకు ఇంకా కేవలం 9 రోజుల వ్యవధి ఉంది. కానీ టార్గెట్ కు చేరుకునేందుకు ఇంకా రూ. 800 కోట్లను వసూలు చేయాల్సి ఉంది. వర్తమాన బకాయిల విషయాన్ని పక్కనబెడితే వేల కోట్లలో పేరుకుపొయిన మొండి బకాయిలపైనే అధికారులు ప్రధానంగా ఫోకస్ పెట్టారు.

రూ.56 కోట్ల వరకు వడ్డీ మాఫీ..

వన్ టైమ్ సెటిల్ మెంట్ (ఓటీఎస్) స్కీమ్ కింద ఈ ఏటా కనీసం రూ. వెయ్యి కోట్ల మొండి బకాయిలను వసూలు చేసుకోవాలని అధికారులు నిర్ణయిచగా, మూడు కార్పొరేషన్లలో ఇప్పటి వరకు కేవలం రూ. 350 కోట్ల వరకు వసూలు కాగా, 90 శాతం వడ్డీ మాఫీ కింద చెల్లించిన వారికి ఇప్పటి వరకు సుమారు రూ. 56 కోట్ల వరకు వడ్డీ మాఫీ అయినట్లు సమాచారం. యూఎల్ బీల విలీనానికి ముందు పాత జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 19.5 లక్షల ప్రాపర్టీ ట్యాక్స్ ఇండెక్స్ నెంబర్లు (పీటీఐఎన్) ఉండగా, వీటిలో దాదాపు రెండున్నర లక్షల వరకు పీటీఐఎన్ లు కమర్షియల్ ఆస్తులకు సంబంధించినవి కాగా, విలీనానంతర పీటీఐఎన్ ల సంఖ్య దాదాపు 28 వేల 80 వేల పై చిలుకు పెరిగాయి. వీటిలో లక్షా 11వేల 800 వరకు జీహెచ్ఎంసీ పరిధిలో ఉండగా, మిగిలిన 17 లక్షల పీటీఐఎన్ లు సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఉన్నాయి.

Also Read: Food Raid: చిట్టి చిట్టి సమోసాలు తింటున్నారా.. అయితే మీరు డేంజర్‌లో పడినట్టే..?

Related News

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

Big Stories

×