BigTV English

Yadadri : యాదాద్రిలో ప్రైవేట్‌ హెలీకాప్టర్‌కు పూజలు..విశేషమేమిటంటే?

Yadadri : యాదాద్రిలో ప్రైవేట్‌ హెలీకాప్టర్‌కు పూజలు..విశేషమేమిటంటే?

Yadadri : యాదాద్రి పుణ్యక్షేత్రంలో తొలిసారిగా ఓ ప్రైవేట్‌ హెలికాప్టర్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరీంనగర్‌కు చెందిన ప్రతిమా ఇన్‌స్టిట్యూట్‌ మెడికల్‌ సైస్సెస్‌ ఎండీ, హైదరాబాద్‌ ఎయిర్‌ లైన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ బోయినపల్లి శ్రీనివాసరావు చాపర్‌ కొనుగోలు చేశారు. ఈ చాపర్ లో యాదాద్రి సందర్శనకు వచ్చారు. యాదాద్రి పెద్దగుట్ట.. ఆలయ నగరిపై హెలీకాప్టర్ కు అర్చకులు పూజలు చేశారు. ఈ పూజలో బోయిన్‌పల్లి శ్రీనివాసరావు, మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ సీహెచ్‌. విద్యాసాగర్‌రావుతోపాటు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తొలుత ప్రధాన ఆలయంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హెలీకాఫ్టర్ కు పూజలు చేయించారు.


యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసిన తర్వాత భక్తుల సంఖ్య మరింత పెరిగింది. పండుగ రోజులు, సెలవులు దినాల్లో భారీగా తరలివస్తున్నారు. అటు ఆలయంలో డిసెంబర్ 16 నుంచి జనవరి 15 వరకు ధనుర్మాస ఉత్సవాలు నిర్వహించనున్నారు. నెల రోజులపాటు రోజూ ఉదయం 4.30 గంటల నుంచి 5.15 గంటల వరకు ఆలయ ముఖ మండపంపైన ఉత్తర భాగంలోని హాల్లో అమ్మవారికి తిరుప్పావై కార్యక్రమం జరిపిస్తారు. ఉత్సవాల్లో భాగంగా జనవరి 14న రాత్రి 7 గంటలకు గోదా కల్యాణం నిర్వహిస్తారు. జనవరి 15న ఉదయం 11.30 గంటలకు ఒడి బియ్యం సమర్పణ జరుగుతుంది.

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి వచ్చే భక్తులు కోసం అనేక సేవలను దేవస్థానం అందుబాటులోకి తీసుకొచ్చింది. భక్తులు ఆన్‌లైన్‌లో బ్రేక్‌ దర్శనం టికెట్లను కొనుగోలు ఇప్పటికే వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. యాదాద్రీశుడి ఆలయంలో బ్రేక్‌ దర్శనాలకు రూ.300 టికెట్లు అందుబాటులో ఉంచారు.


http://yadadritemple.telangana.gov.in లో లాగిన్‌ అయి భక్తులు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్‌లో బ్రేక్‌ దర్శనం రూ.300 అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేసి భక్తులు వివరాలు పొందుపర్చాలి. ఆన్‌లైన్‌లో రుసుం చెల్లించి టికెట్‌ పొందవచ్చు. ఒక టికెట్‌పై ఒక్కరికి మాత్రమే అనుమతిస్తారు. ఇక స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×