E-Paper
Advertisement

Rahul Gandhi: రెండేళ్ల పాలన పై రాహుల్ కాంప్లిమెంట్.. టీం వర్క్ తో ముందుకు సాగాలన్న ఆగ్రనేత

Rahul Gandhi: రెండేళ్ల పాలన పై రాహుల్ కాంప్లిమెంట్.. టీం వర్క్ తో ముందుకు సాగాలన్న ఆగ్రనేత
Advertisement

Rahul Gandhi: తెలంగాణలో ప్రజా ప్రభుత్వం పనితీరుపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.ముఖ్యంగా విద్యా వ్యవస్థలో తీసుకువచ్చిన మార్పులు, ‘ఇంటిగ్రేటెడ్ స్కూల్’విధానంపై ఆయన ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు.ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చూపిస్తున్న చొరవను రాహుల్ అభినందించారు. సంక్షేమం ,అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తూ సాగుతున్న ఈ ప్రయాణం దేశానికే ఆదర్శమని రాహుల్ గాంధీ కొనియాడారు.

Also Read: Most Wanted Arrest: పోలీసుల వలలో ‘మోస్ట్ వాంటెడ్’ ఖాజా.. 28 కిలోల గంజాయి స్వాధీనం!

ప్రభుత్వం సక్సెస్

Advertisement

విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇవ్వడంలో తెలంగాణ ప్రభుత్వం సక్సెస్ అయిందని రాహుల్ గాంధీ అభివర్ణించారు. కుల, మత వివక్ష లేకుండా అందరికీ ఒకే చోట నాణ్యమైన విద్య అందడం గొప్ప పరిణామంగా వివరించారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం అభినందనీయమన్నారు. ఒకే ప్రాంగణంలో వివిధ విభాగాల విద్యార్థులు కలిసి చదువుకోవడం వల్ల సామాజిక స్పృహ పెరుగుతుందని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ వివరించారు.

రాహుల్ గాంధీ కేడర్‌కు దిశానిర్దేశం

తెలంగాణలో అమలవుతున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ విధానం దేశవ్యాప్తంగా అమలు చేయదగ్గ ఒక గొప్ప నమూనా అంటూ రాహుల్ గాంధీ కొనియాడారు. ఇక ​టీమ్ వర్క్ తోనే విజయం వరిస్తుందని రాహుల్ గాంధీ కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు ,పార్టీ కార్యకర్తలు ఒకే తాటిపై ఉండి ‘టీమ్ వర్క్’ తో ప్రజల్లోకి వెళ్లాలన్నారు. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో ఉన్న చివరి వ్యక్తికి కూడా అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా వ్యతిరేక శక్తుల పోరాటం, విపక్షాల అసత్య ప్రచారాలను తిప్పికొడుతూ, వాస్తవాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉన్నదని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, రాబోయే రోజుల్లో మరిన్ని విప్లవాత్మక నిర్ణయాలతో ప్రజల మన్ననలు పొందాలని రాహుల్ ఆకాంక్షించారు.
Also Read: Huzurabad Hospital: హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల తీవ్ర ఇబ్బందులు .. పట్టించుకోని అధికారులు!

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×