BigTV English

Rahul, Priyanka Gandhi Telangana Tour: నేడు ఎల్బీనగర్, నర్సాపూర్‌కు రానున్న రాహుల్ గాంధీ!

Rahul, Priyanka Gandhi Telangana Tour: నేడు ఎల్బీనగర్, నర్సాపూర్‌కు రానున్న రాహుల్ గాంధీ!

Congress Leader Rahul Gandhi and Priyanka Gandhi Tour in Telangana: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేడు తెలంగాణకు రానున్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచార సభలలో ఆయన పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. తెలంగాణలోని నర్సాపూర్ లో సాయంత్రం 4 గంటలకు నిర్వహించే కాంగ్రెస్ జన జాతర సభకు రాహుల్ గాంధీ హాజరవనున్నారు.


ఆ తరువాత సాయంత్రం 6 గంటలకు ఎల్బీనగర్ సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించే జన జాతర సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ఆయనతోపాటు సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎంపీ అభ్యర్థులు పాల్గొననున్నారు. అదేవిధంగా ఈ నెల 11న కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ కూడా తెలంగాణకు రానున్నారు. ఆరోజు ఉదయం 11 గంటలకు కామారెడ్డిలో నిర్వహించే జన జాతర సభకు హాజరుకానున్నారు. మధ్యాహ్నం తాండూర్ లో నిర్వహించే జన జాతర సభలో ఆమె పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

కాగా, పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్ర నేతలు దేశ వ్యాప్తంగా పర్యటిస్తూ తమ ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, పలు సభలలో వారు పాల్గొని ప్రసంగిస్తూ బీజేపీపై తీవ్ర స్థాయిలో ఫైరన విషయం తెలిసిందే. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తివేయాలని.. రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారంటూ బీజేపీపై మండిపడుతున్న విషయం తెలిసిందే. చేసిన అభివృద్ధి కాకుండా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రధాని మోదీ మాట్లాడుతున్నారంటూ కూడా వారు వ్యాఖ్యనించిన విషయం తెలిసిందే.


Also Read: మాట ఇస్తే తల తెగి కింద పడ్డా వెనక్కి తిరిగి చూడను: సీఎం రేవంత్ రెడ్డి

దేశంలోని మొత్తం 543 ఎంపీ స్థానాలకు పలు దశలలో కొనసాగుతున్నటువంటి పార్లమెంటు ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడికానున్నాయి. అయితే, మోసపూరిత వాగ్ధానాలతో ప్రజలను బీజేపీ మోసం చేస్తున్నదని, మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను ఎత్తివేయాలని, రాజ్యాంగం మార్చాలని చూస్తున్న బీజేపీని గద్దె దించాలంటూ కాంగ్రెస్ ప్రజలకు పిలుపునిస్తుంది. ఇటు బీజేపీ కూడా మరోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

Related News

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Big Stories

×