E-Paper
Advertisement

Congress Vijaya Bheri Yatra : రైతులకు రాహుల్ వరాల జల్లు.. కేసీఆర్ పై ధ్వజం

Congress Vijaya Bheri Yatra : రైతులకు రాహుల్ వరాల జల్లు.. కేసీఆర్ పై ధ్వజం
Advertisement
Congress VijayaBheri Yatra

Congress Vijaya Bheri Yatra : తెలంగాణ రాహుల్ గాంధీ మూడవ రోజు పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న విజయభేరి బస్సుయాత్ర మూడవ రోజు జగిత్యాలకు చేరుకుంది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తెలంగాణకు కేసీఆర్ ఒక నియంత రాజులా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. డిసెంబర్ 3న తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగిరితే.. పసుపు రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. క్వింటాల్ పసుపుకు రూ.12000 వరకూ మద్దతు ధర ఇస్తామన్నారు. అలాగే ధాన్యానికి, అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర రూ.500 అధికంగా కల్పించేందుకు కృషిచేస్తామన్నారు. తెలంగాణ ప్రజలతో కాంగ్రెస్ కు ప్రేమ, అనుబంధం ఉందని.. ఈ అనుబంధం దశాబ్దాల నాటిదన్నారు. నవంబర్ 30న దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణకు మధ్య ఎన్నికలు జరగనున్నాయన్న రాహుల్.. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కుటుంబ పాలనకు స్వస్తి పలకాలన్నారు.

మండుటెండను కూడా లెక్కచేయకుండా తనమాటలు వినేందుకు వచ్చిన ప్రజలకు రాహుల్ కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని మరోసారి రాహుల్ విమర్శించారు. కేంద్రంలో ఉన్న బీజేపీకి బీఆర్ఎస్ మద్దతిస్తోందని ఎద్దేవా చేశారు. లోక్ సభలో ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకూ బీఆర్ఎస్ మద్దతిచ్చిందన్నారు. తనకు లోక్ సభ సభ్యత్వం పోయిన తర్వాత ఢిల్లీలో తన ఇంటిని ఖాళీచేయించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఢిల్లీలో ఇంటిని ఖాళీ చేయించినా.. దేశ ప్రజల హృదయాల్లో ఉన్న ఇంటిని ఎవరూ ఖాళీ చేయించలేరన్నారు.

Advertisement

దేశానికి ఓబీసీలు వెన్నెముక లాంటివారన్న రాహుల్.. రాష్ట్రంలో ఓబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం ముందుకు రావడం లేదన్నారు. ఓబీసీలకు అండగా నిలిచేందుకు మోదీ, కేసీఆర్ సిద్ధంగా లేరని దుయ్యబట్టారు. అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో ఎంతమంది ఓబీసీలు ఉన్నారో ఎందుకు లెక్కలు తీయరని రాహుల్ ప్రశ్నించారు. దేశాన్ని నడిపించే అధికారుల్లో 90 శాతం మంది అగ్రకులాలకు చెందినవారే ఉన్నారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోగానే కులగణన చేపట్టి.. ఓబీసీలకు, బలహీన వర్గాల వారికి తమ హక్కులను కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రజలు వేలకోట్ల పన్నులు కడుతున్నా.. ప్రభుత్వం ఆ సొమ్మంతా దోచుకుంటోందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతోనే.. రాష్ట్రంలో చక్కెర కర్మాగారాలను పునఃప్రారంభించి రైతులకు మద్దతుగా నిలుస్తామన్నారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×