BigTV English

Fastest Internet : తైవాన్‌లో ఇంటర్నెట్ యమాఫాస్ట్

Fastest Internet : తైవాన్‌లో ఇంటర్నెట్ యమాఫాస్ట్
Fastest Internet

Fastest Internet : సమస్తలోకం ఆధారపడింది ఇంటర్నెట్‌పైనే. అరచేతిలోకి ప్రపంచాన్ని చూడగలుగుతున్నామంటే కారణం అదే. భూగోళంపై ఏ మూలన ఏది జరిగినా క్షణాల్లో మనం తెలుసుకోగలుగుతున్నాం. ఇంటి నుంచి కదలకుండా ఆన్‌లైన్ అన్నీ ఆర్డర్ ఇచ్చి.. తెప్పించుకునే సౌలభ్యం ఇంటర్నెట్ పుణ్యమే.


ఇన్ని పనులను క్షణాల వ్యవధిలో చక్కబెట్టాలంటే ఇంటర్నెట్ వేగంగా ఉండాలి. కేబుల్.సీవో.యూకే బ్రాడ్ బాండ్ స్పీడ్ లీగ్ 2023 సర్వే మేరకు అత్యధిక బ్రాడ్‌బాండ్ వేగం పొందుతున్న దేశంగా తైవాన్ అగ్రభాగాన నిలిచింది. నిరుడు కూడా అదే నంబర్ 1 స్థానంలో ఉంది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇంటర్నెట్ డౌన్‌లోడ్ స్పీడ్‌ను తైవాన్ గణనీయంగా పెంచుకోగలిగింది.

రెండేళ్ల క్రితం ఇంటర్నెట్ మరీ స్లోగా ఉండేది. అప్పట్లో డౌన్‌లోడ్ వేగం 135.88 ఎంబీపీఎస్ మాత్రమే.ప్రస్తుతం తైవాన్‌లో డౌన్‌లోడ్ స్పీడ్ 153.51 ఎంబీపీఎస్‌కు చేరింది. ఇక స్వల్ప వ్యత్యాసంతో ఫ్రాన్స్ రెండో స్థానంలో నిలిచింది. అక్కడ డౌన్‌లోడ్ వేగం 152.45 ఎంబీపీఎస్.


నిరుడు జపాన్ రెండో స్థానంలో ఉండేది. ఈ జాబితాలో దాని స్థానం దిగువకు పడిపోగా.. తైవాన్, యూరప్ దేశాలు, ఉత్తర అమెరికాలో ఇంటర్నెట్ సేవలు వేగంగా మెరుగుపడ్డాయి. 142.49 ఎంబీపీఎస్ డౌన్‌లోడ్ స్పీడ్‌తో నెదర్లాండ్స్ మూడస్థానంలో ఉంది.

స్లోవేకియాలో 138.03 ఎంబీపీఎస్, అమెరికా 136.48, కెనడా 136.08, స్పెయిన్ 133.66, జపాన్ లో ఇంటర్నెట్ డౌన్‌లోడ్ స్పీడ్ 124.7 ఎంబీపీఎస్‌గా ఉంది. పదిలక్షల జనాభా ఉన్న ప్రాంతాలను మినహాయించి ఈ జాబితా రూపొందించారు.

అన్ని ప్రాంతాలను లెక్కలోకి తీసుకుంటే ఇంగ్లిష్ చానెల్ ప్రాంతంలోని అతి బుల్లి ద్వీపదేశం జెర్సీలో ఫాస్టెస్ట్ బ్రాడ్‌బాండ్ సేవలు అందతున్నాయి. అక్కడ సగటు వేగం 264.52 ఎంబీపీఎస్‌గా ఉంది.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×