BigTV English

Rahul Gandhi Viral News : టీ తాగితే మైండ్‌ ఫ్రెష్‌.. రాహుల్‌ గెలిస్తే దేశం ఫ్రెష్‌..

Rahul Gandhi Viral News : టీ తాగితే మైండ్‌ ఫ్రెష్‌.. రాహుల్‌ గెలిస్తే దేశం ఫ్రెష్‌..
Rahul Gandhi


Rahul Gandhi Viral News : టీ తాగితే మైండ్‌ ఫ్రెష్‌ అవుతుంది.. రాహుల్‌ గాంధీ గెలిస్తే దేశం ఫ్రెష్‌ అవుతుంది. ఇది తెలంగాణలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ అభిమాని క్యాప్షన్‌. అక్కడితో ఆగకుండా రాహుల్‌గాంధీ ఫ్యామిలీ టీ పాయింట్ అంటూ ఏకంగా హోర్డింగ్‌నే ఏర్పాటు చేసేశాడు. ఏమాత్రం భయం బెరుకు లేకుండా ప్రధాన రహదారిపై హోర్డింగ్‌ పెట్టాడు. ఆయనకు రాహుల్‌ గాంధీపై ఎంత అభిమానముందో.. ఆయన నాయకత్వంపై ఎంత నమ్మకముందో.. ఈ హోర్డింగ్‌ను చూస్తేనే అర్థమవుతోంది.

గతంలో చాయ్‌ అమ్ముకునే స్థాయి నుంచి ప్రధానమంత్రి స్థాయికి చేరారు నరేంద్ర మోదీ. ఇదే విషయాన్ని బీజేపీ నేతలు.. ప్రతి ఎన్నికల్లోనూ అస్త్రంగా ఉపయోగించుకుంటూ వస్తున్నారు. అయితే ఈసారి కాంగ్రెస్‌ తమ ప్రచారంలో రూటు మార్చింది. కొత్త విధానాలు అవలంభిస్తోంది. ప్రస్తుతం ఎన్నికల హీట్‌ పెరగడంతో.. సరికొత్తగా ఆలోచిస్తోంది.


తెలంగాణలో రాహుల్‌ అభిమాని ఏర్పాటుచేసిన హోర్డింగ్‌ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఆయనపై అభిమానంతో వినూత్న రీతిలో తన మద్దతను తెలియజేశాడు. టీ తాగితే మైండ్‌ ఫ్రెష్‌ అవుతుంది. రాహుల్‌ గాంధీ గెలిస్తే దేశం ఫ్రెష్‌ అవుతుందనే క్యాప్షన్‌తో హోర్డింగ్‌ని ఏర్పాటు చేశాడు.

దేశంలో రాహుల్‌గాంధీకి మద్దతు పెరుగుతుందని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనమంటున్నారు పలువురు. ఈ ఫొటోను ఓ వ్యక్తి ట్విటర్‌లో పోస్టు చేయడంతో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×