Rahul Jodo Yatra : రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో నేటితో ముగియనుంది. మద్నూర్ మండలం మేనూరు వద్ద రాహుల్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు తరలిరానున్నాయి. జుక్కల్ చౌరస్తా నుంచి నేటి పాదయాత్ర ప్రారంభమైంది. రాత్రి సలాబత్ పూర్ వద్ద మహారాష్ట్రలోకి రాహుల్ పాదయాత్ర ప్రవేశించనుంది.
రాహుల్ జోడో యాత్ర ఈరోజుతో 61 రోజులు పూర్తి చేసుకోబోతోంది. రాత్రి సుమారు 9 గంటలకు మహారాష్ట్రలోకి ఎంటర్ అవుతుంది. అయితే భారత్ జోడో యాత్రకు రాహుల్ ఓ రోజు బ్రేక్ తీసుకొని హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు క్యాంపెయిన్ చేయనున్నారని సమాచారం.