Rain Alert: బంగాళాఖాతంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం మరో ఐదు వరకు అల్పపీడనంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఈ ఆవర్తనం పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
మరో ఐదు రోజులు భారీ వర్ష సూచన
మరో ఐదు రోజులు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఈ వాతావరణ పరిస్థితులతో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ పరిస్థితి తీర ప్రాంతాల్లో మత్స్యకారులకు సముద్రంలో వేటకు వెళ్లకుండా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తెలంగాణలో ఈ జిల్లాలో భారీ వర్షాలు..
తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, నారాయణపేట, వనపర్తి, గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు సూచిస్తున్నారు. రైతులు వ్యవసాయ కార్మికులు సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని అధికారులు సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయే ప్రమాదం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ఏపీలో వాతావరణం ఇలా..
ఏపీలో కూడా మరో ఐదు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుంది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు జిల్లాలతో పాటు.. కాకినాడ, ఈస్ట్ గోదావరి, కోనసీమ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం పడుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
పలు జాగ్రత్తలు..
ఈ వాతావరణ పరిస్థితులు రైతులకు సవాలుగా మారవచ్చు, ఎందుకంటే ఖరీఫ్ పంటల కోత సమయం దగ్గరపడుతోంది. భారీ వర్షాలు పంటలకు నష్టం కలిగించే అవకాశం ఉంది. అందువల్ల, రైతులు తమ పంటలను రక్షించుకోవడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించబడింది. అలాగే, రహదారులపై జలమయ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉండటంతో డ్రైవర్లు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Also Read: యూరియా కోసం రైతుల ఆవేదన.. లారీ డ్రైవర్‌గా మారిన కానిస్టేబుల్
ఊరిలోకి సముద్రం..
కాకినాడ జిల్లా ఉప్పాడ సముద్ర తీరంలో అలల ఉధృతి తగ్గడం లేదు. రోడ్డుపైకి అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. దీంతో ఉప్పాడ-కాకినాడ బీచ్ రోడ్డులో రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. అలల తాకిడికి ఇళ్ళు, బీచ్ రోడ్డు ధ్వంసమవుతున్నాయి. MPUP స్కూలులోకి సముద్రపు నీరు ప్రవేశించింది. బీచ్ రోడ్డును మాజీ ఎమ్మెల్యే వర్మ పరిశీలించారు. సముద్రం పోటు మీద ఉందని మత్స్యకారులు చెబుతున్నారు. అప్రమత్తమైన అధికారులు ముందస్తు సహయక చర్యలలో భాగంగా ఫెయిర్ ఇంజన్ ఏర్పాటు చేశారు.
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం
రేపటి వరకు అల్పపీడనంగా మారే అవకాశం
నేడు, రేపు ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు
40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం
తెలంగాణకు నాలుగు రోజుల పాటు వర్ష సూచన
నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల,… pic.twitter.com/SlFPXkkNwN
— BIG TV Breaking News (@bigtvtelugu) September 12, 2025