Kerala Wedding: దేశంలో పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఏపీ, తెలంగాణకు మాత్రం పరిమితం కాలేదు. పొరుగునున్న తమిళనాడు కేరళలో ఈ పరిస్థితి ఉంది. ఫలితంగా పెళ్లి కాని ప్రసాదులు క్రమంగా పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో కేరళలో చేపట్టిన ఓ కార్యక్రమానికి యువతుల నుంచి సరైన స్పందన రాకపోవడంతో అధికారులు షాకయ్యారు.
కేరళ గురించి చెప్పనక్కర్లేదు. ఆ రాష్ట్ర జనాభాలో పురుషుల కంటే మహిళలు ఎక్కువ. వందకి వందశాతం చదువుతున్నవారు కూడా. ఒకప్పుడు ఉత్తరాదిలో అమ్మాయిల కొరత ఎక్కువగా ఉండేది. దీంతో చాలామంది బిజినెస్ మేన్లు.. తమకు తెలిసిన వారి ద్వారా కేరళ వచ్చి వివాహాలు చేసుకునేవారు. ఆ విధంగా నార్త్‌లో కొంతమందైనా వివాహాలు చేసుకునేవారు.
పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. ఫ్యామిలీ లేదా మరేదైనా సమస్యలు కావచ్చు. కేరళలో కూడా అమ్మాయి కొరత వెంటాడుతోంది. అందుకు ఎగ్జాంపుల్ రీసెంట్‌గా కన్నూరు జిల్లాలో నిర్వహించిన కార్యక్రమం. పెళ్లి కాని యువతకు సాయం చేయాలని ఉద్దేశంతో ఓ గ్రామ పంచాయతీ చేపట్టిన కార్యక్రమానికి యువత నుంచి స్పందన వచ్చింది.
యువతుల నుంచి పెద్దగా స్పందన కనిపించకపోవడంతో అధికారులు షాకయ్యారు. ఈ పరిస్థితిపై స్థానికంగా చర్చ మొదలైంది. కేరళలోని కన్నూరు జిల్లాలోని పయ్యావూర్ గ్రామం. అక్కడి పంచాయతీ పయ్యావూర్ మాంగల్యం పేరుతో సామూహిక వివాహాలకు శ్రీకారం చుట్టింది.
ALSO READ: ఢిల్లీలో ఐదుగురు ఉగ్రవాదులు అరెస్ట్
పెరిగిన ఆర్థిక భారాలు, సామాజిక పరిస్థితుల వల్ల వివాహాలు చేసుకోవడానికి ఇబ్బందులు పడుతున్న యువతకు అండగా నిలవడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. కులాలు, మతాలతో సంబంధం లేకుండా ఎవరైనా ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రకటన రాగానే యువకుల నుంచి మాంచి స్పందన వచ్చింది. చుట్టుపక్కల జిల్లాల నుంచి యువకులు దరఖాస్తు చేసుకున్నారు.
వివాహాల కోసం ఇప్పటివరకు 3 వేల యువకులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అయితే యువతుల సంఖ్య 200 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. వధూవరుల మధ్య ఈ వ్యత్యాసం చూసి అధికారులు షాకయ్యారు. ఒకప్పుడు అమ్మాయిలు ఎక్కువగా దరఖాస్తు చేసుకునేవారని అంటున్నారు.
ఈ నేపథ్యంలో పురుషుల నుంచి దరఖాస్తుల స్వీకరణను తాత్కాలికంగా నిలిపి వేశారు ఆ పంచాయతీ అధికారులు. యువతుల కోసం రిజిస్ట్రేషన్ కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. మహిళలకు ఈ ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడిన ‘సింగిల్స్ ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్’ ద్వారా వాటిని సమర్పించవచ్చు. అంతా అనుకున్నట్లు జరిగితే అక్టోబర్‌లో సామూహిక వివాహాన్ని నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు పంచాయతీ అధ్యక్షుడు సాజు జేవియర్ తెలిపారు.