IND vs PAK Asia Cup 2025: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ పై అందరి అంచనాలు భారీగా పెరిగాయి. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే అందరూ ఆసక్తిగా చూస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మ్యాచ్ చూసేందుకు జనాలు ఎగబడుతుంటారు. అయితే ఈసారి అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. ఇలాంటి నేపథ్యంలో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ పై పాకిస్తాన్ కోచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐదుగురు స్పిన్నర్లతో.. టీమిండియాను ఓడిస్తామని పాకిస్తాన్ కోచ్ మైక్ మైక్ హెస్సన్ ( Head coach Mike Hesson’s) సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్తుచిత్తుగా ఓడించి వాళ్ళను ఇంటికి పంపిస్తామని కూడా వార్నింగ్ ఇచ్చారు. దుబాయ్ పిచ్ స్పిన్ కు అనుకూలంగా ఉంటుందని.. ఐదుగురు స్పిన్నర్లతో దిగుతున్నామని వెల్లడించారు.
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియాను ఓడిస్తామని… పాకిస్తాన్ కోచ్ మైక్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఆసియా కప్ 2025 టోర్నమెంట్లో భాగంగా మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో అందరి దృష్టి ఈ మ్యాచ్ పైన పడింది. వచ్చే ఆదివారం రోజున ఈ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో… ఈ మ్యాచ్ గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ కోచ్ మైక్ హెసన్ స్పందించారు.
టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లో రెస్ట్ స్పిన్నర్ల మధ్య పోటీ ఉంటుందని వస్తున్న వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. దుబాయ్ పిచ్ స్పిన్ కు పెద్దగా అనుకూలించే అవకాశం లేదని తెలిపారు. యూఏఈ తో మ్యాచ్ లో కులదీప్ యాదవ్ బాల్ ఎక్కువగా స్పెండ్ చేయలేదని వివరించారు. రిస్ట్ స్పిన్నర్లు ఉంటే సర్ఫేస్ తో పనిలేదని వెల్లడించారు. తమ జట్టులో ఐదుగురు స్పిన్నర్లు ఉన్నారని.. వెల్లడించారు. వరల్డ్ లోనే బెస్ట్ స్పిన్నర్ నవాజ్ అని.. అతనితో టీమ్ ఇండియాను ఓడిస్తామని కూడా తెలిపారు.
టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఆదివారం అంటే సెప్టెంబర్ 14వ తేదీన జరగనుంది. ఇక టీమిండియా వర్సెస్ పాకిస్థాన్ మధ్య జరిగే సండే మ్యాచ్ నేపథ్యంలో…. ఇంకా టికెట్లు సేల్ కాలేదని అంటున్నారు. సగానికి సగం టికెట్లు అలాగే ఉన్నాయని చెబుతున్నారు. మిగిలిన టికెట్లు కూడా ఎవరూ కొనుగోలు చేసేలా కనిపించడం లేదని అంటున్నారు. పాకిస్థాన్ వర్సెస్ ఇండియా మధ్య ఇటీవల యుద్ధం జరిగిన తరుణంలోనే…ఈ మ్యాచ్ ను బై కాట్ చేయాలని అంటున్నారు.
Mike Hesson said, "The beauty of our side is we've got five spinners. Muhammad Nawaz is the best spin bowler right now in the world." pic.twitter.com/8Qib2b7y5j
— Sheri. (@CallMeSheri1_) September 11, 2025