Big Twist In Kavitha: కవితను మాజీ ఎమ్మెల్సీ అనాలా? ఎమ్మెల్సీ అనాలా? ఇంకా అదే కన్ ఫ్యూజన్ నడుస్తోందా? ఎందుకిలా జరుగుతోంది. ఆమె సరైన ఫార్మాట్ లో తన రాజీనామా ఇవ్వలేదా? లేక సాంకేతికంగా ఏదైనా కారణముందా? ఇంతకీ మండలిలో కవిత రాజీనామాపై ఎలాంటి చర్చ జరుగుతోంది?
పార్టీ సభ్యత్వానికి.. ఎమ్మెల్సీ పదవికి కవిత రిజైన్
ఇటీవలే బీఆర్ఎస్ లో జరిగిన పరిణామలు అందరికి తెలిసిందే.. కవిత తరుచు సొంత పార్టీ, సొంతింటి నేతల పై చేస్తున్న కామెంట్స్ తో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో కవిత పార్టీ సభ్యత్వానికి, అలాగే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేసి మండలి చైర్మన్ కార్యాలయానికి పంపించారు.. కానీ స్వయంగా కవిత శాసనమండలి కి వెళ్ళి రాజీనామా లేఖను, మండలి చైర్మన్ కి ఇవ్వలేదు. దీంతో కవిత రాజీనామా ఆమోదం పై ఇప్పటికీ ఒక క్లారిటీ రాలేదు.
కవితను ఎమ్మెల్సీగా పిలవాలా లేక, మాజీ అనాలా?
ఇప్పుడు కవితని మాజీ ఎమ్మెల్సీ గా చూడాలా.. లేదా ఎమ్మెల్సీ కవిత గానే చూడాలా అంటే మాత్రం.. ఇదీ అదని ఎవ్వరూ చెప్పలేక పోతున్నారట. టోటల్ గా ఈ విషయంలో ఒక కన్ఫ్యూషన్ అయితే అందరిలోనూ ఉంది. అయితే శాసనమండలి కార్యాలయం ఏం చెబుతుందో తెలుసుకుందామని ప్రయత్నిస్తే కవిత రాజీనామా అంశం.. మండలిలో ఇంకా పెండింగ్ లో ఉన్నట్టు సమాచారం. ఎందుకంటే ఎమ్మెల్సీ రాజీనామా అమోదిస్తే.. 6 నెలల లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇందుకే కవిత రిజైన్ ఇష్యూ పెండింగ్ లో పెట్టారా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.
జాగృతి నేతల ద్వారా చైర్మన్ కి రిజైన్ లెటర్
ఎమ్మెల్సీ పదవికి కల్వకుంట్ల కవిత ఈ నెల 3న రాజీనామా చేశారు. రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్ లో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి జాగృతి నేతల ద్వారా పంపారు. రాజీనామాను ఆమోదించాలని కవిత ఫోన్‌లో మండలి ఛైర్మన్‌ను కోరారు. కవిత రాజీనామాపై ఛైర్మన్ వెంటనే నిర్ణయం తీసుకొని ఆమోదిస్తారని అన్ని రాజకీయ పార్టీలు భావించాయి. కానీ వారం రోజులుగా చైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో కవిత రాజీనామా అంశం చర్చినీయంశంగా మారింది. అయితే ఈ నెల 11 నుంచి 14 వరకు కర్నాటకలో జరిగే ఆల్ ఇండియా స్పీకర్ల సదస్సులో మండలి ఛైర్మన్ పాల్గొంటున్నారు. తిరిగి వచ్చిన తర్వాతే కవిత రాజీనామా ఆమోదంపై ఛైర్మన్ నిర్ణయం తీసుకుంటారని విశ్వసనీయ సమాచారం. రాజీనామా ఆమోదానికి ముందు ఎమ్మెల్సీ కవిత అభిప్రాయాన్ని మరోమారు కోరనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాతే రాజీనామాపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.
కవిత చైర్మన్ని కలుస్తారా? లేక వేచి చూస్తారా?
కవిత రాజీనామాను ఆమోదించాలంటే నేరుగా మండలి చైర్మన్‌ను కలవాల్సి ఉంటుంది. తన రాజీనామాకు సంబంధించి సహేతుకమైన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. కవిత రాజీనామా విషయంలో మండలి చైర్మన్‌ను కలుస్తారా.. లేదాచర్చ నడుస్తోంది. వీటన్నిటిని బట్టీ చూస్తే కవిత నేరుగా శాసనమండలి చైర్మన్ ను కలిసినపుడే.. రాజీనామా ఆమోదం లభిస్తుందని.. చైర్మన్ ఆఫీస్ నుంచి వస్తోన్న ఇన్ఫర్మేషన్. అయితే ఇప్పటివరకు తన రాజీనామా పై కవిత మండలి చైర్మన్ ను కలవలేదు.. అందుకే కవిత ఎమ్మెల్సీ రాజీనామా మండలి లో ఇంకా పెండింగ్‌లోనే ఉన్నట్టు తెలుస్తోంది.
Also Read: ఏపీలో మెడికల్ పాలిటిక్స్.. PPP పద్ధతిలో కాలేజీలు.. దశ మారుతుందా?
ప్రస్తుతానికైతే కవిత ఎమ్మెల్సీ రాజీనామా ఇంకా ఆమోదం పొందలేదు. అదే జరగాలంటే ఆమె నేరుగా మండలి చైర్మన్ ను కలవాల్సి ఉంటుంది. కాబట్టి ఆమె వెళ్లి కలుస్తారా? లేక తాను కలవకుండానే చైర్మన్ ఆమోదించే వరకూ వేచి చూస్తారా? చూడాలంటున్నారు. ఏది ఏమైనా.. కవిత రాజీనామా వ్యవహారం.. మాత్రం తెలంగాణ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఆమెను ఎమ్మెల్సీ కవిత అనాలా? లేక, మాజీ ఎమ్మెల్సీ అనాలా అర్ధం కావడం లేదని అంటున్నారు కొందరు.
Story By Adinarayana, Bigtv