BigTV English

Telangana BJP: కిషన్ రెడ్డిని రాజాసింగ్ టార్గెట్ చేయడం వెనుక అసలు కథ ఇదే..!

Telangana BJP: కిషన్ రెడ్డిని రాజాసింగ్ టార్గెట్ చేయడం వెనుక అసలు కథ ఇదే..!

Telangana BJP: ఆపార్టీ.. సిద్ధాంతాలు, ఐడీయాలజీ, క్రమశిక్షణకు మారు పేరు. కానీ ఇప్పుడు పార్టీలోని కొందరు పుష్పరాజ్‌లా తయార య్యారు. తగ్గేదే లే అంటున్నారు. తెరవెనక కొందరు నడిపిస్తుంటే.. తెరముందు కొందరు సవాళ్లు విసురుతున్నారు. నాకు అన్నీ తెలుసులేవోయ్ అంటున్నారు. ఒకరు రాజీనామా చేయాలంటే.. మరొకరు నాతోపాటు ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తావా అంటున్నారు. అయితే ఇప్పుడు ఎందుకు ఆసవాల్ విసిరినట్టు..?


కిషన్ రెడ్డిని మేకప్‌మెన్‌గా పోల్చిన రాజాసింగ్

రాజాసింగ్.. కిషన్ రెడ్డి వెనక ఎందుకు పడ్డారు..? పదే పదే కిషన్ రెడ్డిని టార్గెట్ ఎందుకు చేస్తున్నారు అనేది బీజేపీలో చర్చనీయాంశంగా మారింది. చెప్పాలంటే.. గతంలో ఇదే రాజాసింగ్, కిషన్ రెడ్డి మేకప్‌మెన్ అన్నారు. హైదరాబాద్ దాటని వ్యక్తి అధ్యక్షుడిగా పనికి రారు అన్నారు. ఏకంగా పాత ఇనుప సామాన్లతో పోల్చారు. రాజాసింగ్ కూడా అంతటితో ఆగలేదు. టేబుల్ తుడిచే వ్యక్తులకే పదవులు అన్నాడు. మంచి ప్యాకేజీలొస్తే అమ్ముడు పోయే దొంగలు అన్నారు. దొంగలంతా కలిసి కుమ్మక్కు రాజకీయాలతో పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు తాను పదవికి రాజీనామా చేయాలని తెరపైకి తీసుకొచ్చింది కిషన్ రెడ్డియే అంటున్నారు రాజాసింగ్. అంతేకాదు పార్టీ నుండి తాను బయటకు వెళ్లడానికి కిషన్ రెడ్డియే కారణమంటున్నారు. మొత్తానికి రాష్ట్ర బీజేపీ డ్యామేజీ కావడానికి కిషన్ రెడ్డియేనని చెప్పకనే చెప్పేశాడు. ఇక ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తే అసలు రాజాసింగ్.. కిషన్ రెడ్డిని ఎందుకు టార్గెట్‌ చేశారు..? పదే పదే కిషన్ రెడ్డిపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారనేది పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇక సిద్ధాంతాలు, ఐడీయాలజీ, క్రమశిక్షణకు మారుపేరైనా బీజేపీలో.. ఈ తగాదాలు పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతుందని మిగతా నేతలు గుసగుసలాడుతున్నారట.


రాజాసింగ్ ఎపిసోడ్‌కు పుల్‌స్టా్ప్ పెట్టాలనుకుంటోన్న నాయకత్వం

ఇక రాజాసింగ్ ఎపిసోడ్‌కు పులిస్టాప్ పెట్టాలనే యోచనలో రాష్ట్ర నాయకత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రతిసారి విరుచుకుపడటం నేతలకు చిర్రెత్తిస్తుందట. అందులో భాగంగానే రాజాసింగ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్ వినిపిస్తోందట. ఇందులో భాగంగానే దమ్ముంటే పార్టీ గుర్తుపై గెలిచిన రాజాసింగ్.. రాజీనామా చేసి మాట్లాడాలని మిగితా నేతలు సవాల్ చేస్తున్నారట. ఒకవేళ రాజీనామా చేయకపోతే స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామనే హెచ్చరికలు కూడా వెళ్తున్నాయట. ఈ ఎపిసోడ్ గ్రహించిన రాజాసింగ్ తానేమీ తక్కువకాదంటున్నారు. ఇప్పుడు ఆయనో కొత్త నినాదం ఎన్నుకున్నారు. దమ్ముంటే కిషన్ రెడ్డి రాజీనామా చేయాలని బాంబ్ పేల్చారు. పార్టీ డ్యామేజీ అవుతున్నది తన వల్ల కాదని.. కిషన్ రెడ్డి వల్లే అంటూ బాహింరంగానే చెబుతున్నారు. అయినా రాజీనామా అడగడానికి మీరెవరు..? రాజీనామా చేయను ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ కీలక వాఖ్యలు చేసుకొచ్చారు. అంతేకాదు కిషన్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత ఇండిపెండెంట్‌గా బరిలో దిగాలన్నారు. అప్పుడే ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందంటూ రాజాసింగ్ చెప్పడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే రాజాసింగ్ ఎపి సోడ్ పై తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు స్పందించారు. రాజాసింగ్ ఎమ్మెల్యే పదవి రాజీనామాపై అధిష్టానం చూసుకుంటుందన్నారు. ప్రతి దానికి స్పందించి సమయం వృధా చేసుకోనని చెప్పారు. తాను రబ్బర్ స్టాంపునా, లేక ఇంకో స్టాంపునా అనేది ప్రజలు నిర్ణయిస్తారన్నారు.

బీజేపీ రాష్ట్ర కమిటీపై కూడా రాద్దాంతం

సీన్ కట్ చేస్తే.. తాజాగా విడుదలైన బీజేపీ కమిటీపై కూడా రాద్దాంతం కొనసాగుతోంది. పలువురు ఎంపీలు, ఎమ్మేల్యేలు.. అదేవిధంగా మొన్నటిదాకా కమిటీలో పని చేసిన మాజీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, మోర్చాల అధ్యక్షులు మండిపడుతున్నారనే టాక్ నడుస్తోంది. రాష్ట్ర కమిటీనీ ఎవరి అభిప్రాయాల మేరకు ఎంపిక చేశారని ప్రశ్నిస్తున్నారట. కనీసం అభిప్రాయాలు, విన్నపాలను వినకుండా చెత్తబుట్టలో వేయడం ఇప్పుడు ఆపార్టీలో చర్చకు దారితీసింది. కేవలం హైదరాబాద్ అర్బన్‌ను దృష్టిలో పెట్టుకొని కమిటీ వేయడం, అందులో మెజారిటీగా నగరానికి సంబంధించిన నేతలే ఉండటం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల లీడర్షిప్‌పై ఫోకస్ చేయకపోవడం వంటి అంశాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో పార్టీ జెండా మోస్తున్న నేతలు, కార్యకర్తలు.. పార్టీకి, కమిటీకి పనికి రారా అంటూ కింది స్థాయి నుంచి విమర్శలు వస్తున్నాయట. అంతేకాదు.. నేతల మధ్య వర్గపోరును తగ్గించాల్సింది పోయి, వర్గపోరును పెంచేందుకు నాయకత్వం మొగ్గు చూపుతుందనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం పార్టీ నాయకత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారని కొందరు నేతలు బాహాటంగానే చెబుతున్నారు. ఒకే జిల్లాలో ఒక వర్గానికి పదవి ఇచ్చి, ఇంకో వర్గానికి మొండి చేయి చూయించడం జిల్లాలో పార్టీ అభివృద్ధికి చిహ్నాలా.. లేక పొమ్మనలేక పొగబెట్టడానికి సిగ్నలా అనే అసహనాలు పలు జిల్లాల్లో కీలక నేతల నుంచి వినిపిస్తున్నాయి.

Also Read: కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామాలో బిగ్‌ట్విస్ట్..

తెలంగాణ బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు

ఇప్పుడు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. మరోవైపు అంతర్గత కుమ్ములాటతో తెలంగాణ బీజేపీ సమస్యల్లో చిక్కుకుంది. మరి వీరంతా కలసికట్టుగా ప్రజల్లోకి వెల్లేది ఎప్పుడు..? గెలిచేది ఎప్పుడు..? ప్రస్తుతానికి రాజకీయ నేతల మధ్య గొడవలు రాజుకోవడానికి రాష్ట్ర నాయకత్వ లోపమా..? జాతీయ నాయకత్వానిదా..? లేక నేతల మధ్య ఈగోలా అనేది పార్టీలో జోరుగా చర్చజరుగుతోంది. కొందరు నాయకుల తీరు కారణంగా కమలం పార్టీ పరిస్థితి రోజురోజుకూ ఆగాథంలోకి కూరుకుపోతుందనే టాక్ వినిపిస్తోంది. సొంత పార్టీ నేతలే ఒకరిపైఒకరు వ్యక్తిగత విమర్శలు, కుమ్ములాటలు చేసుకుంటూ పార్టీ పరువును తీస్తున్నారనే చర్చ పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తోంది. ముఖ్యంగా కాషాయ పార్టీలో ఈ ట్రెండ్ క్రమంగా పెరిగిందనే మూట గట్టుకున్నారు నేతలు. ఇప్పటికే రాజాసింగ్ రాజీనామా చేసిన తర్వాత కూడా పార్టీపై, పార్టీ నేతలపై ఘాటుగా స్పందిస్తున్నారు. వరుస కౌంటర్లతో విరుచుకుపడుతున్నారు. పార్టీలో ఉన్న కిషన్ రెడ్డి లాంటి సీనియర్ నేతలు పక్కకు తప్పుకుంటే తప్ప తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాదని కరాఖండిగా చెప్పేస్తున్నారు. మొత్తానికి రాష్ట్ర బీజేపీని కుదిపేస్తున్న కమిటీల కుంపటి అనుకున్న లక్ష్యాలపై ఏ విధంగా ప్రభావం చూపుతుంది అనేది చూడాలి మరి.

Story By Srikanth, Bigtv

Related News

Rain Alert: దూసుకొస్తున్న రెండు అల్పపీడనాలు.. ఈ జిల్లాలకు మరో 5 రోజులు దబిడి దిబిడే..

Urea Shortage: యూరియా కోసం రైతుల కష్టాలు.. లారీ డ్రైవర్‌గా మారిన కానిస్టేబుల్

Big Twist In Kavitha: కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామాలో బిగ్‌ట్విస్ట్..

MLC Kavitha: బీఆర్ఎస్‌లో కీలక పరిణామం.. ఎమ్మెల్సీ కవిత ఇంటికి తల్లి రాక.. బుజ్జగింపులా-మేటరేంటి?

Weather News: మళ్లీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. ఈ రెండ్రోజులు జాగ్రత్త.. ఎల్లో అలర్ట్ జిల్లాలివే

Telangana Secretariat: తెలంగాణ సచివాలయంలో ఇంటర్నెట్‌ బంద్

Telangana: రాష్ట్రంలో బీసీలకు 42 శాతం లైన్ క్లియర్..? అసలు నిజం ఇదే..

Big Stories

×