రైల్వే ప్రయాణీకులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. మల్కాజ్ గిరి రైల్వే స్టేషన్ లో ఒక జత వీక్లీ ఎక్స్ ప్రెస్ రైళ్లకు ఆపేందుకు ఆమోదం తెలిపింది. ఇకపై చెన్నై-నాగర్సోల్, హైదరాబాద్-తిరుపతి-షిర్డి, యశ్వంత్ పూర్-లక్నో ఎక్స్ ప్రెస్, హైదరాబాద్-హిసార్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆగనున్నాయి. సెప్టెంబర్ 13న హైదరాబాద్-హిసార్ ఎక్స్ ప్రెస్ రైలు మల్కాజ్ గిరిలో ఆగనుంది. ఈ నేపథ్యంలో ట్రావెలర్ అసోసియేషన్లు ఈ రైలుకు స్వాగతం పలికేందుకు రెడీ అవుతున్నాయి.
సెప్టెంబర్ 3న SCR జనరల్ మేనేజర్, ప్రజా ప్రతినిధులు, ఇతర వాటాదారుల మధ్య జరిగిన సమావేశంలో మల్కాజ్ గిరిలో పలు ఎక్స్ ప్రెస్ రైళ్లను ఆపాలని అభ్యర్థించారు. మల్కాజ్ గిరి స్టేషన్ చుట్టూ అనేక కాలనీలు ఉన్నాయని, ఈ ప్రాంతంలోని ప్రయాణికులు అక్కడ రైళ్లను ఆపడం వల్ల ఎంతో ప్రయోజనం పొందుతారని ట్రావెలర్స్ అసోసియేషన్ అభిప్రాయపడింది. వారి అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని రైళ్ల స్టాపేజీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అటు ఎక్స్ ప్రెస్ రైళ్లను ఆపాలని నిర్ణయం తీసుకున్నందుకు స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. రైల్వే అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
Read Also: ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే 10 రైళ్లు ఇవే.. స్పీడ్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!
అటు కొత్త MMTS రైళ్లను ప్రవేశపెట్టడం, ప్రస్తుత సమయాలకు సర్దుబాట్లు చేయడం, ఇవి రోజువారీ ప్రయాణికులకు అనుకూలంగా లేవు. వీటిని కూడా ప్రయాణీకులకు అనుకూలంగా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని SCR జనరల్ మేనేజర్, ప్రజా ప్రతినిధులు, ఇతర వాటాదారుల మధ్య జరిగిన సమావేశంలో అభ్యర్థనలు వచ్చాయి. వీటిపైనా రైల్వే అధికారులు తగిన సర్దుబాట్లు చేయనున్నట్లు వెల్లడించారు. త్వరలోనే ఈ డిమాండ్లకు పరిష్కారం చూపించనున్నట్లు తెలిపారు.
Read Also: వందేభారత్, అమృత్ భారత్ సహా 4 కొత్త రైళ్లు.. ప్రధాని మోడీ చేతలు మీదుగా ప్రారంభం!