E-Paper
Advertisement

Weather: ఈ వార్త తెలిస్తే పొద్దుపొద్దున్నే మీరు ఎగిరి గంతేస్తారు..!

Weather: ఈ వార్త తెలిస్తే పొద్దుపొద్దున్నే మీరు ఎగిరి గంతేస్తారు..!
Advertisement

Weather Updates in Telangana: గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇటీవల పశ్చిమబెంగాల్ లో దేశంలోనే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదైన విషయం తెలిసింతే. అంతేకాదు.. ఎప్పుడూ లేనంతగా ఈసారి ఎండలు దంచికొడుతున్నాయి. ఇటు రాష్ట్రంలో కూడా ఎప్పుడూ లేనంతగా ఈసారి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

ఏకంగా 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యాహ్నం అయ్యిందంటే చాలు 40 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతల వాతావరణ కబనడుతుంది. ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటే వణకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇంకొంతమంది అయితే ఎండల వల్ల వారి పనులను వాయిదా వేసుకుంటున్న విషయం తెలిసిందే.

Rain
Rain
Advertisement

రోజంతా ఎండలు.. రాత్రి సమయంలో ఉక్కపోతతో జనం ఇబ్బంది పడుతున్నారు. అయితే, ఇలా ప్రజలు ఇబ్బంది పడుతున్న ఈ సమయంలో వాతావరణ శాఖ తాజాగా ఓ చల్లని కబురు చెప్పింది. వచ్చే మూడురోజులపాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాష్ట్రంలో పలుచోట్లా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరికొన్ని చోట్లా ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అదేవిధంగా మరికొన్నిచోట్లా ఈ మూడురోజులపాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశముందని పేర్కొన్నది.

రాష్ట్రంలోని మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ, జనగామ, యాదాద్రి, సిద్దిపేట, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్, సిరిసిల్ల జిల్లాల్లో వర్షాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ ను ప్రకటించింది.

Advertisement

Also Read: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హార్డ్ లేదంటా.. లైట్ లేదంటా!

తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతుందని, ఈ ఉపరితల ద్రోణి కారణంగా రాష్ట్రంలో నేడు, రేపు, ఎల్లుండి వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×