Big Stories

Beers: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హార్డ్ లేదంటా.. లైట్ లేదంటా!

Shortage of Beers: ప్రస్తుతం ఎండాకాలం కాబట్టి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. అయితే, సాధారణంగా ఎండకాలంలో బీర్లు ఎక్కువగా సేలవుతుంటాయి. అయితే, ప్రస్తుతం హైదరాబాద్ లో పరిస్థితి వేరుగా ఉందంటా. నగరంలో బీర్లు దొరకడంలేదంటా. దీంతో నగరంలోని మందుబాబులు బేజారవుతున్నారంటా. ఇటు ఎండలు, అటు ఎన్నికల హడావుడీ, మరోవైపు ఐపీఎల్ సీజన్ కొనసాగుతున్న ఈ తరుణంలో బీర్లు దొరకక మందుబాబులు బేజారవుతున్నారంటా. బీర్ల కొరత ఉండడంతో మందుబాబులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

అయితే, ఎండాకాలంలో సాధారణంగా బీర్లు ఎక్కువగా సేల్ అవుతుంటాయి. బ్రాండీ, విస్కీ, వొడ్కా తాగేవాళ్లు సైతం వేసవి తాపాన్ని తట్టుకునేందుకు బీర్లు తాగడానికే ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. రాష్ట్రంలో ఎండ దంచికొడుతుండడం.. పలు ప్రాంతాల్లో ఎప్పుడూ లేనంతగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 46.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. అయితే, ఈసారి మాత్రం ఊహించినదాని కన్నా ఎక్కువగా అమ్ముడవుతున్నాయని వైన్స్ షాపుల ఓనర్లు చెబుతున్నట్లు సమాచారం.

- Advertisement -
Shortage of Beers
Shortage of Beers

గత రెండు నెలలోనే బీర్లుగా భారీగా అమ్ముడుపోయాయని, ప్రస్తుతం మరింతగా డిమాండ్ పెరిగిందని వారు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఎండలు మండుతుండడంతో బీర్లు మరింతగా అమ్ముడుపోయే అవకాశమున్నట్లు వాతావరణం కనిపిస్తుందని, అదేవిధంగా స్టాక్ వచ్చిన రెండు గంటల్లోనే బీర్లన్నీ అమ్ముడవుతున్నాయని, ఆ తరువాత సరిపడా బీర్లు లేక నో స్టాక్ బోర్డులు పెట్టాల్సి వస్తోందని, వచ్చిన కస్టమర్లు నిరుత్సాహంగా వెళ్లిపోతున్నారని.. అయిపోయాయి అని చెప్పినా కూడా కొందరైతే బీర్లు కూల్ లేకున్నా పర్వాలేదు ఇవ్వండంటూ వెంటబడుతున్నారని నిర్వాహకులు చెబుతున్నట్లు తెలుస్తోంది.

Also Read: అబద్ధమని నిరూపిస్తే తెల్లారేసరికి రాజీనామా చేస్తా: కేటీఆర్

సరిపడా బీర్లు అందుబాటులో లేకపోవడంతో కస్టమర్లు చల్లగా లేకపోయినా వాటిని తీసుకువెళ్తున్నారని చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తేనే అర్థమవుతుంది నగరంలో బీర్లకు ఎంత డిమాండ్ ఉందననేది. సంబంధిత అధికారులు వైన్స్ షాపుల్లో సరిఫడా బీర్లు ఉండేలా చూడాలని, బీర్ల సరఫరాలో ఆలస్యాన్ని అరకిట్టాలని మందుబాబులు కోరుతున్నట్లు సమాచారం. గత నెలలో కూడా మందుబాబులు బీర్ల కొరతపై అబ్కారీ శాఖ దృష్టికి తీసుకెళ్లగా, రాష్ట్రంలో బీర్ల కొరత లేకుండా చూస్తామని హామీ ఇచ్చిన విషయం విధితమే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News