Big Stories

Rudraksha: అసలైన రుద్రాక్షను ఎలా గుర్తించాలి?

Purity of Rudraksha: ప్రకృతి ప్రసాదించే ప్రతిదీ ఎంతో నాణ్యతగా, విలువైనదిగా ఉంటుంది. అందుకే ప్రకృతి నుంచి వచ్చే ప్రతిదానికి ఎంతో ఇంపార్టెన్సీ ఉంటుంది. అయితే ప్రకృతి ప్రసాదించేవాటిలో ఒకటి రుద్రాక్ష. రుద్రాక్షను నిజమైనదిగా ఎలా గుర్తించాలో అని మీరు అనుకుంటున్నారా? అయితే.. మీరు ఈ విషయం తెలుసుకోండి. అప్పుడు మీరు అది నిజమైన రుద్రక్షనా కాదా అని గుర్తించగలుగుతారు.

- Advertisement -

అయితే, చాలామంది రుద్రాక్ష విషయంలో కొంత తర్జన భర్జన పడుతుంటారు. రుద్రాక్షను ఎలా నిజమైనది గుర్తించొచ్చు..? అని. ఇంకొందరైతే ఇందులో కూడా కల్తీవి ఉంటాయా.. ? ఇలా రకరకాలుగా వారికి ప్రశ్నలు ఉత్పన్నమవుతుంటాయి. అయితే, రుద్రాక్షను అది నిజమైనదా కాదా ? అనేది ఇలా గుర్తించవచ్చని చెబుతున్నారు ఆధ్యాత్మికవేత్తలు.

- Advertisement -

మొదటగా డూప్లికేట్ రుద్రాక్షలను మీరు గమనిస్తే అందులో విడిగా రంధ్రాలు కనిపిస్తుంటాయి. వాటిని మనం ఈజీగా గుర్తించడానికి ఆస్కారముంటుంది. మరో విషయమేమంటే.. వాటిని నీటిలో వేస్తే డుప్లీకేట్ రుద్రాక్షలు మునిగిపోవు. ఇంకో విషయమేమంటే.. ఆవనూనెలో వాటిని ఉంచినప్పుడు అవి వాటి రంగును కోల్పోతాయి.. సో ఇలా డూప్లికేట్ రుద్రాక్షలను ఈజీగా గుర్తించవచ్చు అని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.

అదేవిధంగా నిజమైన రుద్రాక్షలను గుర్తించడం ఎలా అంటే.. అసలైన రుద్రాక్షలు నీటిలో వేసినప్పుడు అవి మునిగిపోతుంటాయి. అదేవిధంగా వాటిని ఆవనూనెలో వేసినప్పుడు దాని రంగును కోల్పోదు. సహజంగానే అలాగే ఉంటుంది. అదేవిధంగా ఆ రుద్రాక్షలను క్షుణ్ణంగా పరిశీలిస్తే సహజంగా రంధ్రాలు ఉంటాయి. అంతేకాదు.. దాదాపు నిజమైన రుద్రాక్షలను క్షుణ్ణంగా పరిశీలించినప్పుడే ఈజీగా అర్థమైపోతుంది అవి నిజమైనవా కావా అనేది అని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.

అయితే, రుద్రాక్ష అనేది ఎలిఒకరు గనిట్రాస్ అనే ఒత చెట్టు యొక్క విత్తనం. ఈ రుద్రాక్ష ఒక సాధకుడి విషయంలోనే కాదు.. దానిని ధరించిన ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈ రుద్రాక్షలకు ఒకు విశిష్టమైన ప్రకంపన ఉంటుంది. అందువల్ల ఈ రుద్రాక్ష వృక్షాలు పర్వతాల మీద, అదేవిధంగా హిమాలయ ప్రాంతాలలో కనిపిస్తుంటాయని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.

రుద్రాక్షను ధరిస్తే కేవలం ఆధ్యాత్మిక ప్రయోజనాలే కాదు.. శారీరక, మానసిక ప్రయోజనాలెన్నో కలుగుతాయి. అంతేకాదు.. మీ శక్తిని కవచంలా మార్చి వేరే ఇతర శక్తులు మిమ్మల్ని కలత పెట్టకుండా కాపాడుతాయి. ముఖ్యంగా రుద్రాక్ష ధరించినవారికి ఆర్థిక సమస్యలు, వ్యాపార సమస్యలు ధరిచేరవని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.

ముఖ్యంగా చెప్పాలంటే.. రుద్రాక్షలను ధరించడం వల్ల మానసికి ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉంటారంటా. అంతేకాదు.. శరీరంలోని కీళ్ల నొప్పులు, ఎముకలు లేదా కండరాల నొప్పులు మటమాయమవుతాయంటా. ఉబ్బసం వంటి మరెన్నో వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుందని వారు చెబుతున్నారు. అయితే, ఈ రుద్రాక్షను ఇష్టానుసారంగా ధరించకూడదు. రుద్రాక్షను ధరించుటకు కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమ నిబంధనల ప్రకారం రుద్రాక్షను ధరించాలి. అప్పుడు మాత్రమే మీరు ప్రయోజనాలు పొందుతారని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు.

Also Read: నేడు చేయాల్సిన.. చేయకూడని పనులు ఇవే!

రుద్రాక్షలలో చాలా రకాలు ఉంటాయి. వాటిని ముఖముల సంఖ్యా పరంగా విభజిస్తుంటారు.. ఒక ముఖము నుంచి 21 ముఖాల రుద్రాక్షలు ఉన్నాయని చెబుతుంటారు. అయితే, ఇందులో పంచముఖ రుద్రాక్షలు ఎక్కడైనా అత్యధికంగా లభిస్తుంటాయని చెబుతారు. మరో విషయమేమంటే.. ఏకముఖి రుద్రాక్ష. దీనిని ధరిస్తే వారికి అన్ని విషయాలలో విజయం చేకూరుతుందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.

గమనిక: ఇక్కడ ఇచ్చినటువంటి సమాచారం సామాజిక, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. bigtvlive.com దీనిని ధృవీకరించలేదు. దీని కోసం నిపుణుల సలహా తీసుకోగలరు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News