Big Stories

Phase 3 Loksabha Elections : మూడోదశ లోక్ సభ ఎన్నికలు.. ఓటు వేసిన ప్రధాని నరేంద్రమోదీ

Lok sabha election phase 3 updates(Live tv news telugu): లోక్ సభ ఎన్నికల మూడోదశ పోలింగ్ మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ప్రధాని నరేంద్రమోదీ అహ్మదాబాద్ లో ఓటు వేశారు. అనంతరం రోడ్లపై ఉన్న ప్రజలకు అభివాదం చేశారు. ప్రజలు ఎండలతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 10 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. హోం మంత్రి అమిత్ షా, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఎన్సీపీ (శరద్చంద్ర పవార్) నేత సుప్రియా సూలే, సమాజ్‌వాదీ పార్టీ నేత డింపుల్ యాదవ్‌లతో సహా పలువురు ప్రముఖులు మూడోదశ ఎన్నికల పోటీలో ఉన్నారు.

- Advertisement -

మొత్తం 93 లోక్ సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుండగా 17.24 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. 1331 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండగా.. వారిలో 120 మంది మహిళలు ఉన్నారు. ఫేజ్ 3లో అస్సాం (4), బీహార్ (5), ఛత్తీస్‌గఢ్ (7), గోవా (2), గుజరాత్ (26), కర్ణాటక (14), మధ్యప్రదేశ్ (8), మహారాష్ట్ర (8) 93 స్థానాలకు పోలింగ్ జరగనుంది. అలాగే.. ఉత్తరప్రదేశ్ (10), పశ్చిమ బెంగాల్ (4), దాద్రా-నగర్ హవేలీ మరియు డామన్-డయ్యూ (2) స్థానాలకు లోక్ సభ ఎన్నికలు జరుగనున్నాయి.

- Advertisement -

బీజేపీ అత్యధికంగా 81 మంది అభ్యర్థులను నిలబెట్టగా, కాంగ్రెస్ 67 మంది అభ్యర్థులను నిలబెట్టింది. 2019 లోక్‌సభ ఎన్నికల దశ 3లో, 94 స్థానాలకు గాను 72 స్థానాల్లో బీజేపీ గెలుపొందగా, కాంగ్రెస్, శివసేనలు చెరో 4 సీట్లు, జనతాదళ్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చెరో 3 సీట్లు, సమాజ్‌వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్‌లు చెరో సీట్లు గెలుచుకున్నాయి. ఒక్కో సీటుతో 2, లోక్ జనశక్తి పార్టీకి 1 సీటు దక్కింది. మిగిలిన రెండు స్థానాలు ఇండిపెండెంట్లకు దక్కాయి.

Also Read : నోట్ల కట్టలు, 25 కోట్ల రూపాయలు, ఎక్కడ?

ఫేజ్ 3లో గాంధీనగర్ నుంచి బీజేపీ తరఫున అమిత్ షా, గుణ నుంచి జ్యోతిరాదిత్య సింధియా, విదిశ నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్, రాజ్‌కోట్ నుంచి పురుషోత్తం రూపాలా, బెల్గాం నుంచి జగదీశ్ షెట్టర్, హవేరీ నుంచి బసవరాజ్ బొమ్మై శివమొగ్గ నుంచి బీవై రాఘవేంద్ర ఉన్నారు. విపక్షాల నుంచి మెయిన్‌పురి నుంచి సమాజ్‌వాదీ పార్టీకి చెందిన డింపుల్‌ యాదవ్‌, రాజ్‌గఢ్‌ నుంచి కాంగ్రెస్‌ నుంచి దిగ్విజయ్‌ సింగ్‌, శివమొగ్గ నుంచి గీతా శివరాజ్‌కుమార్‌, చిక్కోడి నుంచి ప్రియాంక జారిఖోలి బరిలో ఉన్నారు.

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, సిట్టింగ్ ఎంపీ సుప్రియా సూలే బంధువు అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సిపి వర్గానికి చెందిన సునేత్రా పవార్‌తో తలపడనుండటంతో మహారాష్ట్రలోని బారామతి స్థానంలో గట్టిపోటీనే జరుగుతోంది. ఎన్‌సిపిలో చీలిక తర్వాత.. అజిత్ పవార్ తన భార్య సునేత్రను బారామతి నుండి రంగంలోకి దింపారు — పవార్ కుటుంబ కంచుకోట అయిన అతని మామ శరద్ పవార్ దీర్ఘకాలంగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మూడో దశలో 94 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, గుజరాత్‌లోని సూరత్ లోక్‌సభ స్థానంలో బిజెపి అభ్యర్థి ముఖేష్ దలాల్ పోటీ లేకుండా గెలుపొందారు. దీంతో అక్కడ ఎన్నికలు రద్దయ్యాయి. సూరత్‌తో పాటు, జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్-రాజౌరీ స్థానానికి ఎన్నికలు మే 25కి వాయిదా పడ్డాయి. ఆ రోజున ఆరోదశ పోలింగ్ జరగనుంది.

మధ్యప్రదేశ్‌లోని బేతుల్ లోక్‌సభ స్థానానికి ఏప్రిల్ 25నే పోలింగ్ జరగాల్సి ఉంది. కానీ.. బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి అశోక్ భలవి మరణించడంతో అక్కడ పోలింగ్ నేడు జరుగుతుంది. ఏడు దశల్లో జరిగే ఎన్నికల తదుపరి దశ మే 13న జరగనుండగా.. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News