E-Paper
Advertisement

Home Guards: హోంగార్డులకు గుడ్ న్యూస్.. కేంద్రం సంచలన నిర్ణయం!

Home Guards: హోంగార్డులకు గుడ్ న్యూస్.. కేంద్రం సంచలన నిర్ణయం!
Advertisement

Home Guards: స్వేచ్ఛ బ్యూరో: దేశవ్యాప్తంగా హోంగార్డులకు మంచిరోజులు రాబోతున్నాయి. హోంగార్డులు అందిస్తున్న సేవలకు చట్టబద్ధ గుర్తింపు మెరుగైన సంక్షేమం కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. మోడల్​ హోంగార్డ్స్​ బిల్లు 1965 సవరణ ప్రక్రియను చేపట్టింది. ప్రస్తుతం ఇది ముగింపు దశకు చేరుకుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్​ రాయ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆమోదం తరువాత సవరించిన బిల్లును అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు పంపించనున్నట్టు పేర్కొన్నారు.

మాగుంట శ్రీనివాసులు రెడ్డి..

రూల్​ 377ప్రకారం లోక్​ సభ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రస్తావించిన అంశంపై స్పందిస్తూ ఆయన లేఖ రాశారు. ఇప్పటికే మోడల్​ హోంగార్డ్స్​ బిల్లు, సివిల్​ డిఫెన్స్​ చట్టం సవరణలపై ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలతోపాటు సంబంధిత మంత్రిత్వ శాఖలు, ఇతర భాగస్వాములతో విస్తృతస్థాయిలో సంప్రదింపులు జరిపినట్టు పేర్కొన్నారు. చట్టపరమైన, పరిపాలనా అంశాలను సమగ్రంగా పరిశీలించిన తరువాత సవరణలను ఖరారు చేయనున్నట్టుగా తెలిపారు.

హోంగార్డుల్లో కొత్త ఆశలు..

Advertisement

కేంద్రం నుంచి వచ్చిన ఈ ప్రకటనతో హోంగార్డుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర విభజన తరువాత దశాబ్దానికి పైగా సొంత రాష్ట్రాలకు బదిలీ కోసం ఎదురు చూస్తున్న వందలాది మంది హోంగార్డులు త్వరలోనే తమ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ స్థానికత ఉన్న హోంగార్డులు ఆంధ్రప్రదేశ్​ లో..ఆంధ్రప్రదేశ్​ స్థానికత ఉన్న హోంగార్డులు ఇప్పటికీ విధులు నిర్వర్తిస్తున్నారు. ఫలితంగా పలు కష్టనష్టాలను ఎదుర్కొంటున్నారు. డ్యూటీ చేసే ప్రాంతానికి దూరంగా కుటుంబాలు ఉండటంతో మానసిక వేదనకు గురవుతున్నారు. ఇంట్లోవాళ్లను చూడాలనిపిస్తే ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి. దీంతో ఆర్థికంగా కూడా నష్టపోతున్నారు. ఇక పిల్లల చదువులు, ఉద్యోగాల్లో స్థానికత నిబంధనల కారణంగా తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు.

Also Read: MP Arvind: సీఎం రేవంత్‌కు ఎంపీ అర్వింద్ ఓపెన్ ఛాలెంజ్.. అది చేయాలని డిమాండ్..?

పోలీసులతో సమాన సేవలు..

Advertisement

ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు, విపత్తులు, అత్యవసర పరిస్థితులు, ఎన్నికలు, పండుగలు ఇలా ప్రతి సందర్భంలోనూ హోంగార్డులు పోలీసులతో సమానంగా సేవలందిస్తున్నారు. అయినా, తమకు ఉద్యోగ భద్రత, తగిన వేతనం, పదోన్నతులు, సామాజిక భద్రత వంటి ప్రాథమిక ప్రయోజనాలు అందటం లేదని కొన్నేళ్లుగా హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. 30 నుంచి 35 ఏళ్లపాటు పని చేసినా గ్రూప్–సీ లేదా గ్రూప్–డీ హోదా కూడా దక్కక మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం అన్న సూత్రం కూడా అమలుగాక అష్టకష్టాలు పడుతున్నారు. 1983, 201‌‌0లో కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల్లో హోంగార్డులకు ప్రాధాన్యత కల్పించాలని ఉన్నా రాష్ట్రాల్లో అవి పూర్తిగా అమలు కాలేదని పలువురు హోంగార్డులు తెలిపారు.

స్థానికత లేక పదోన్నతులకు దూరం..

స్థానికత ఆధారంగా కానిస్టేబుల్ పదోన్నతులు కల్పిస్తున్న నేపథ్యంలో స్థానికేతర హోంగార్డులు తీవ్రంగా నష్టపోతున్నట్టు చెప్పారు. ఏళ్ల తరబడి సేవలందించినా పదోన్నతి అవకాశాలకు దూరంగానే ఉండాల్సిన పరిస్థితి అని తెలిపారు. స్థానికత కారణంగా తమ పిల్లల భవిష్యత్తు కూడా దెబ్బ తింటోందని చెప్పారు. ఇప్పటికైనా తమను తమ తమ రాష్ట్రాలకు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. మోడల్ హోంగార్డ్స్ బిల్లు సవరణ తుది దశకు చేరుకోవడం తమకు ఆశాజనక పరిణామమన్నారు. అయితే చట్ట సవరణతో పాటు స్వరాష్ట్ర బదిలీలు, సమాన వేతనం, ఉద్యోగ భద్రత, పదోన్నతులు, సామాజిక భద్రత వంటి సమస్యలకు కూడా శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. కేంద్రం, రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సమన్వయంతో నిర్ణయం తీసుకుంటే వేలాది హోంగార్డుల కుటుంబాల్లో కొత్త వెలుగులు నిండుతాయన్నారు.

Also read: JP Nadda: కేవలం 4 గంటలు చాలట.. తెలంగాణపై జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు..!

Related News

విద్యార్థుల కోసం నిరాహార దీక్ష.. అస్వస్థతకు గురైన బీజేపీ చీఫ్ రామచందర్‌రావు

కొండా సురేఖ ఎపిసోడ్‌తో వేడెక్కిన రాజకీయాలు.. రేవంత్ కేబినెట్ పునర్ వ్యస్థీకరణ, ముగ్గురిపై వేటు?

అల్పపీడనం ప్రభావం.. తెలంగాణల్లో భారీ వర్షాలు, హైదరాబాద్‌లో అయితే..

హైకోర్టులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్​ కృష్ణారెడ్డికి ఎదురుదెబ్బ!

జాబ్ నోటిఫికేషన్లు నిల్.. లిక్కర్ నోటిఫికేషన్లు ఫుల్.. కాంగ్రెస్‌పై హరీశ్ రావు సెటైర్లు

కొండా సురేఖ అంశంపై సీఎం కీలక నిర్ణయం.. వివాదానికి చెక్?

కేంద్రానికి కాంగ్రెస్ మోకరిల్లింది.. స్మార్ట్ మీటర్ల కుట్రను భగ్నం చేస్తాం.. కవిత హెచ్చరిక

తెలంగాణ ప్రజలకు అలర్ట్.. 27న రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల గ్రామ సభలు

Big Stories

Advertisement
×