E-Paper
Advertisement

అనుకోకుండా హత్య కేసులో చిక్కుకునే ఫ్యామిలీ… మతిపోగొట్టే మలయాళం మిస్టరీ థ్రిల్లర్

అనుకోకుండా హత్య కేసులో చిక్కుకునే ఫ్యామిలీ… మతిపోగొట్టే మలయాళం మిస్టరీ థ్రిల్లర్
Advertisement

Tamil Black Comedy Thriller: ఎవరినైనా కావాలని మర్డర్ చేస్తేనే ఆ కేసు నుంచి ఎలా తప్పించుకోవాలి ? పోలీసుల నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలి ? అన్నది అంతుచిక్కదు. మరి హత్య చేయకుండానే మర్డర్ కేసులో చిక్కుకుంటే… అది కూడా ఫ్యామిలీ మొత్తం. అందులోనూ కూతుర్ని వేధించే వాడి శవం వచ్చి ఇంట్లో పడితే ఏంటి పరిస్థితి ? అది తెలియాలంటే 2026లో విడుదలై తమిళ సినిమా ప్రేమికులను అలరించిన బ్లాక్ కామెడీ థ్రిల్లర్ ‘Parimala and Co’ను వీక్షించాల్సిందే. మరి ఈ మూవీ కథ ఏంటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? అనే వివరాలను వివరంగా తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

కథ ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం చుట్టూ తిరుగుతుంది. పరిమళ ఓ నార్మల్ ఉద్యోగి. అతని భార్య సుతంతిరమ్ హౌస్ వైఫ్. వంట దగ్గర నుంచి ఇంటి వ్యవహారాలన్ని చూసుకుంటూ ఉంటుంది. ఈ జంటకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద అమ్మాయి పరాశక్తి. చిన్న అమ్మాయి మధుమిత. ఇక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే రోజూ ఉండే ఆర్థిక ఇబ్బందులు కామన్. అలాగే చిన్న చిన్న గొడవలు, కుటుంబ సమస్యలు కూడా. అలాంటి ఈ కుటుంబంలోకి ఒక భయంకరమైన వ్యక్తి ఎంట్రీ ఇస్తాడు.

Advertisement

అతను మరెవరో కాదు లోకల్ గ్యాంగ్‌స్టర్ వర్గీస్. అతను చిన్న అమ్మాయి మధుమితను తీవ్రంగా వేధించడం మొదలు పెడతాడు. పెద్ద కూతురు శక్తికి కూడా ఇబ్బందులు క్రియేట్ చేస్తాడు. ఒకరోజు వర్గీస్ అనుమానాస్పద స్థితిలో దారుణంగా హత్యకు గురవుతాడు. అతని శవం పరిమళ కుటుంబం ఇంటి సమీపంలోనే దొరుకుతుంది. పోలీసులు ఈ కేసులో పరిమళ కుటుంబాన్ని ప్రధాన నిందితులుగా మారుస్తారు. ఇక్కడే సినిమా నిజమైన డార్క్ కామెడీగా మారుతుంది.

కుటుంబ సభ్యులు ఒకరినొకరు అనుమానించుకోవడం షురూ చేస్తారు. “నువ్వు చంపావా?”, “లేదు నువ్వు చంపావా?” అని ఒకరినొకరు అడగడంతో కథ అడ్డం తిరుగుతుంది. తండ్రి తన కూతుళ్లను రక్షించడానికి చంపాడా ? తల్లి కోపంతో చంపేసిందా? లేదా కుమార్తెలు ఏమైనా చేశారా ? అనే అనుమానాలు పెరుగుతాయి. ఈ మర్డర్ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి సైకో ఇన్‌స్పెక్టర్ ఎంపురుమాన్ రంగంలోకి దిగుతాడు. అతని ఇన్వెస్టిగేషన్ స్టైల్, ప్రశ్నలు కుటుంబాన్ని మరింత ఆందోళనకు గురి చేస్తాయి. ఇంకా లోకల్ కామెడీ క్యారెక్టర్ యోగి బాబు కూడా ఈ గందరగోళంలో చేరి నవ్వులు తెప్పిస్తాడు. అసలు ఆ గ్యాంగ్ స్టర్ ను చంపింది ఎవరు ? చివరికి ఆ ఫ్యామిలీ చేయని ఈ హత్య నుంచి ఎలా తప్పించుకుంది ? అసలు హంతకుడు ఎవరు ? క్లైమాక్స్ లో వచ్చే షాకింగ్ ట్విస్ట్ ఏంటి ? అన్నది తెలియాలంటే ఈ సిరీస్ ను చూడాల్సిందే.

తెలుగులో చూడొచ్చా ?

Advertisement

‘పరిమళ అండ్ కొ’లో జయరాం, ఊర్వశి 20 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం విశేషం. మిస్కిన్ ఇన్‌స్పెక్టర్ పాత్రలో మెప్పిస్తాడు. సినిమాలోని డైలాగ్స్, సిట్యువేషనల్ కామెడీ, ఫ్యామిలీ డ్రామా అన్నీ బ్యాలెన్స్‌గా ఉంటాయి. క్రైమ్, కామెడీ, థ్రిల్లర్ మూడింటినీ ఒకేసారి ఆస్వాదించాలనుకుంటే ఈ మూవీ బెస్ట్ ఆప్షన్. జూలై 10 నుండి ZEE5లో తెలుగు ఆడియోతో సహా అన్ని సౌత్ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ‘దృశ్యం’ తరహాలో ఉండే ఈ మర్డర్ మిస్టరీ… డార్క్ ఫ్యామిలీ కామెడీగా టర్న్ తీసుకుని, ప్రేక్షకులను నవ్వించడంతో పాటు ఆలోచింపజేస్తుంది.

Read Also:  ఇద్దరమ్మాయిలతో ఓ అబ్బాయి…. ఫ్యామిలీతో కలిసి చూశారో పరలోకానికే

Tags

Related News

అప్పులు ఇచ్చి ప్రాణాలు తీసే లోకల్ రౌడీలు… ఆటగాళ్లు ఇచ్చే ఝలక్ అదుర్స్

పాడుబడిన బావిలో కన్పించే పిల్లాడు… లాస్ట్ ట్విస్ట్ కు దిమాక్ కరాబ్

భార్యాభర్తల గొడవ… కట్ చేస్తే లేడీస్ గ్యాంగ్ రచ్చ… డోంట్ మిస్

అంటువ్యాధులు, అగ్నిప్రమాదాలు… పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ భయ్యా

డుగ్ డుగ్ బండిని పట్టుకుని దేవుడంటూ పూజలు… మైండ్ బ్లాక్ స్టోరీ

పేషెంట్స్ ను ఆధారాల్లేకుండా చంపే కిల్లర్… ప్రతి ఒక్కరూ చూడాల్సిన మలయాళం మెడికల్ థ్రిల్లర్

10 గంటలు ప్రభుత్వాన్ని అల్లాడించే అరాచకం… మస్ట్ వాచ్ మలయాళం పొలిటికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×