E-Paper
Advertisement

JP Nadda: కేవలం 4 గంటలు చాలట.. తెలంగాణపై జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు..!

JP Nadda: కేవలం 4 గంటలు చాలట.. తెలంగాణపై జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు..!
Advertisement

JP Nadda: స్వేచ్ఛ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్.. ఏటీఎంలా వాడుకుంటే రేవంత్ రెడ్డి సర్కార్.. సంక్షేమ పథకాల నిధులను వాడుకుంటున్నాడని కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆరోపించారు. హైదరాబాద్ లోని ఒక హోటల్ లో గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అధ్యక్షతన మేధావుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి జేపీ నడ్డా హాజరై మాట్లాడారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక అవినీతి, అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్ తరహాలోనే.. రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవహరిస్తోందని విమర్శించారు. రేవంత్ రెడ్డి లెక్కల్లో వీక్ అనుకుంటానని నడ్డా చురకలంటించారు.

రూ.1.74 లక్షల కోట్లతో..

రేవంత్ రెడ్డికి కేంద్రాన్ని బద్నామ్ చేయడం అలవాటుగా మారిందని, తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందని ప్రతిసారి ప్రశ్నిస్తున్నారని, ఒకసారి లెక్కలు చూసుకుంటే ఆయనకు తెలుస్తుందని చురకలంటించారు. అప్పుడే కేంద్ర ప్రభుత్వ సహకారం తెలంగాణకు ఏవిధంగా ఉందనేది ఆయనకు అర్థమవుతుందన్నారు. పదేళ్లలో తెలంగాణలో రూ.1.74 లక్షల కోట్లతో 2,674 కిలోమీటర్ల రహదారులను నిర్మించినట్లు నడ్డా వివరించారు. తెలంగాణలోని ప్రతి మూల నుంచి నాలుగు గంటల్లో హైదరాబాద్ చేరుకోవచ్చన్నారు. తెలంగాణలో కొత్త రైల్వే ప్రాజెక్టులతో పాటు 42 రైల్వే స్టేషన్లను కేంద్రం ఆధునీకరించిందని తెలిపారు.

కాళేశ్వరం పేరుతో..

Advertisement

బీబీ నగర్ ఎయిమ్స్ 5 నుంచి ఏడేళ్లలో అత్యుత్తమ సంస్థల్లో ఒకటిగా అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. ఎయిమ్స్ కోసం రూ.1100 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇది అత్యాధునికమైనదని, ఇందులో 22 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు ఉంటాయన్నారు. ఢిల్లీ కాంగ్రెస్ కు.. తెలంగాణ ఏటీఏంగా మారిందని ఆరోపించారు. బీఆర్ఎస్ కాళేశ్వరం పేరుతో రూ.లక్ష కోట్ల కుంభకోణం చేసిందని ఆరోపించారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామన్నారని, మరి ఏమైందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా ప్రశ్నించారు. మోడీ ప్రధాని అయ్యాక.. బుజ్జగింపు విధానం అంతమైందని తెలిపారు. బీజేపీ, ఎన్డీయే నడుపుతున్న ప్రభుత్వాలు.. ప్రజా అనుకూలతను కలిగి ఉన్నాయన్నారు.

Also Read: మూడు నెల‌ల మంత్రిపై మూకుమ్మ‌డి దాడి! కొండంత రాగం తీసి.. మంత్రి ప‌ద‌వి అడిగిన ఫ‌లితం..!

2014 తర్వాత..

Advertisement

ఇదిలా ఉండగా తొలుత బీబీనగర్ ఎయిమ్స్ లో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోడీ నాయకత్వంలో దశాబ్ద కాలంలో దేశంలో ఆరోగ్య సంరక్షణ సేవలు, మౌలిక వసతుల రంగంలో ఒక సుదీర్ఘమైన ముందడుగు పడిందన్నారు. 20వ శతాబ్దం చివరి వరకు దేశంలో న్యూఢిల్లీలో కేవలం ఒకే ఒక్క ఎయిమ్స్ ఉండేదని, ఆ తర్వాత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో మరో 6 ఎయిమ్స్ సంస్థలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 2014 తర్వాత ప్రధాని మోడీ నాయకత్వంలో దేశంలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను బలోపేతం చేస్తూ మొత్తం ఎయిమ్స్ ల సంఖ్యను 23కు పెంచినట్లు నడ్డా వివరించారు.

జూన్ 2022లో మంజూరైన..

వీటిలో ప్రస్తుతం 18 ఎయిమ్స్ సంస్థలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాగా, మిగిలినవి నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. ప్రాథమిక వైద్యం నుంచి సూపర్ స్పెషాలిటీ వైద్యం వరకు అనుసంధానం చేస్తూ దేశంలో బలిష్టమైన ఆరోగ్య వ్యవస్థను నిర్మించినట్లు స్పష్టంచేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,85,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ద్వారా దాదాపు 15 లక్షల మంది ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు. అలాగే గతంలో కేవలం 370 ఉన్న మెడికల్ కాలేజీల సంఖ్యను ఇప్పుడు 820 మెడికల్ కాలేజీలకు పెంచినట్లు స్పష్టంచేశారు. జూన్ 2022లో మంజూరైన బీబీనగర్ ఎయిమ్స్, కేవలం నాలుగేళ్ల స్వల్ప కాలంలోనే ఎంతో వృద్ధి సాధించి సేవలందిస్తోందని కేంద్ర మంత్రి నడ్డా కొనియాడారు. ప్రస్తుతం ఇక్కడ 132 మంది ఫ్యాకల్టీ సభ్యులు, 133 మంది సీనియర్ వైద్యులు సేవలందిస్తున్నారని వెల్లడించారు.

ప్రధాన స్పెషాలిటీ సేవలు..

ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులతో పాటు, 24 విభాగాల్లో ఎండీ, 5 విభాగాల్లో డీఎం/ఎంసీహెచ్ వంటి సూపర్ స్పెషాలిటీ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. బీబీనగర్ ఎయిమ్స్ ఓపీడీ విభాగంలో అన్ని ప్రధాన స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వచ్చాయని, ఇక్కడ ప్రతిరోజూ సుమారు 1,800 మంది రోగులు వైద్య సేవలు పొందుతున్నారని వెల్లడించారు. ఇన్‌పేషెంట్ కేర్, ఎమర్జెన్సీ సేవలతో పాటు సిటీ స్కాన్, ఎంఆర్‌ఐ, డెక్సా వంటి అత్యాధునిక పరీక్షల సౌకర్యం ఉందని కేంద్ర మంత్రి నడ్డా వివరించారు. ఈ-సంజీవని డిజిటల్ టెలీ మెడిసిన్ ద్వారా ఇప్పటివరకు 1,56,000 మంది రోగులకు విజయవంతంగా వైద్య సలహాలు అందించారని తెలిపారు. ఇక్కడ పీఎం-జై తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా వర్తింపజేస్తున్నట్లు స్పష్టంచేశారు.

Also read: హైదరాబాద్‌లో భారీ ఆపరేషన్.. 1100 మంది పోలీసులతో.. ఇళ్లల్లో సోదాలు!

6 గ్రామాలను దత్తత..

బీబీనగర్ ఎయిమ్స్‌లో పరిశోధనల కోసం ఇప్పటివరకు రూ.64 కోట్ల గ్రాంట్లు మంజూరయ్యాయని తెలిపారు. ప్రస్తుతం 129 రీసెర్చ్ ప్రాజెక్టులపై పనులు జరుగుతుండగా, ఇక్కడి ఫ్యాకల్టీ ఇప్పటివరకు 156 పరిశోధనా పత్రాలను ప్రచురించారని నడ్డా వెల్లడించారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక ఎయిమ్స్ సంస్థలో కమ్యూనిటీ రేడియో స్టేషన్ ప్రారంభించిన ఘనత బీబీనగర్ ఎయిమ్స్‌కే దక్కిందని కేంద్ర మంత్రి కొనియాడారు. ఈ సంస్థ ద్వారా 6 గ్రామాలను దత్తత తీసుకుని, ఇప్పటివరకు 547 ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించి, దాదాపు 66,148 మంది గ్రామీణ రోగులకు వైద్య సంరక్షణ అందించడం విశేషమని కొనియాడారు.

గతంలో నిమ్స్ కోసం..

ఎయిమ్స్ నిర్మాణ పనులపై సమగ్ర సమీక్ష నిర్వహించినట్లు కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ప్రస్తుతం 87 శాతం పనులు పూర్తయ్యాయని వివరించారు. మిగిలిన నిర్మాణ పనులన్నింటినీ పూర్తి చేసి డిసెంబర్ 2026 నాటికి ఎయిమ్స్ ను 100 శాతం పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. ఈ పనులను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్.. వారానికోసారి, అడిషనల్ సెక్రటరీ ప్రతి రెండు నెలలకోసారి పర్యవేక్షిస్తున్నారన్నారు. ఇది 2008 నాటి పాత భవనమని, గతంలో నిమ్స్ కోసం ఉద్దేశించిన భవనం కావడంతో, దీనిని ఎయిమ్స్ ప్రమాణాలకు అనుగుణంగా మార్చడం, రీస్ట్రక్చరింగ్, రెట్రోఫిట్టింగ్ చేయడం ఎంతో సంక్లిష్టమైన పనిగా చెప్పుకొచ్చారు. అయినప్పటికీ అధునాతన వసతులతో రేడియోగ్రఫీ, ఓటీ కాంప్లెక్స్‌లను త్వరలోనే సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.

Also read: Revanth Grandson: మనవడి కోసం పూరీలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి!

సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ..

ఇది వైద్య విద్య, రోగుల సంరక్షణ, పరిశోధన రంగాలలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీగా నిలవబోతోందని వివరించారు. ఢిల్లీ ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థ పూర్తి స్థాయిలో పుంజుకోవడానికే 20 ఏళ్లు పట్టిందని, కానీ బీబీనగర్ ఎయిమ్స్ నాలుగేళ్లలోనే అద్భుతమైన ప్రగతి పథంలో సాగుతోందన్నారు. ఏదైనా ఒక పెద్ద జాతీయ విద్యా వైద్య సంస్థ పూర్తిస్థాయిలో స్థిరపడటానికి కనీసం 10 సంవత్సరాల సమయం పడుతుందని జేపీ నడ్డా వివరించారు. ప్రధాని మోడీ విజన్‌కు అనుగుణంగా, రాబోయే రోజుల్లో బీబీనగర్ ఎయిమ్స్ దక్షిణ భారతదేశంలోనే అత్యుత్తమ అగ్రగామి వైద్య సంస్థగా మారుతుందని నడ్డా ఆకాంక్షించారు.

బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం..

ఇదిలాఉండగా తెలంగాణ పర్యటనకు విచ్చేసిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డాకు శంషాబాద్ విమానాశ్రయంలో బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారితో కలిసి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, ఎంపీ డీకే అరుణ నడ్డాకు ఘన స్వాగతం పలికారు.

Also read: Extramarital Affairs: ఆ ఒక్క కారణంతోనే.. భర్తలను అతి దారుణంగా చంపేస్తున్న భార్యలు!

Related News

Home Guards: హోంగార్డులకు గుడ్ న్యూస్.. కేంద్రం సంచలన నిర్ణయం!

‘సర్’ ప్రక్రియపై సైబర్ ముఠా కొత్త స్కెచ్.. హైదరాబాద్ సీపీ హెచ్చరిక!

వరంగల్ కాంగ్రెస్‌లో ‘ఢీ’ అంటే ‘ఢీ’.. కడియంపై టీపీసీసీకి మంత్రి సురేఖ ఫిర్యాదు

Musi Rejuvenation: మూసీ పునరుజ్జీవనానికి మరో ముందడుగు.. జీవో జారీ చేసిన సర్కార్!

420 హామీల వైఫల్యం.. కాంగ్రెస్ పతనం ఖాయం.. కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు

Addanki Dayakar: కేసీఆర్ రాసి పెట్టుకో.. ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ మాస్ వార్నింగ్!

MP Arvind: సీఎం రేవంత్‌కు ఎంపీ అర్వింద్ ఓపెన్ ఛాలెంజ్.. అది చేయాలని డిమాండ్..?

Big Stories

Advertisement
×