E-Paper
Advertisement

Hyderabad: హైదరాబాద్‌లో ఆ రెస్టారెంట్ బుక్కైంది.. రూ. 25 వేల జరిమానా, ఆ తప్పేంటో తెలుసా?

Hyderabad: హైదరాబాద్‌లో ఆ రెస్టారెంట్ బుక్కైంది.. రూ. 25 వేల జరిమానా, ఆ తప్పేంటో తెలుసా?
Advertisement

Hyderabad: అధికారులు సరిగా పని చేయనప్పుడు కోర్టులు మొట్టికాయలు పెడతాయి. షాపులు, కంపెనీల యజమానుల తీరు బాగా లేనప్పుడు వినియోగదారుల కమిషన్ ఎంటరవుతోంది. తాజాగా హైదరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌కు కన్జ్యూమర్ కోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. ఏకంగా 25 వేలు జరిమానా వేసింది. అసలు మేటరేంటి?

హైదరాబాద్‌లో ఆ రెస్టారెంట్‌కు షాక్-రంగారెడ్డి జిల్లా కమలానగర్‌కు చెందిన జీవన్‌కుమార్ తన కుటుంబసభ్యులతో గతేడాది జనవరి రెండున ఎల్‌బి నగర్‌లోని అమరావతి రెస్టారెంట్‌కు వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో వెళ్లడంతో భోజనానికి ఆర్డర్ ఇచ్చారు. భోజనం తర్వాత సిబ్బంది తీసుకొచ్చిన బిల్లు చూసి షాకయ్యాడు. దాన్ని క్షుణ్నంగా పరిశీలించిన సదరు కస్టమర్.. ఓ తప్పు కళ్లకు కనిపించింది.

Advertisement

మూడు రూపాయలకు కక్కుర్తి.. 25 వేలు ఫైన్- రెండు వాటర్ బాటిళ్లు తీసుకున్నందుకు ఒక్కో బాటిల్‌పై అధనంగా 3 రూపాయలు వసూలు చేసినట్లు గుర్తించాడు. రెండు బాటిళ్లకు కలిసి 6 రూపాయలు అదనంగా బిల్లులో ప్రస్తావించారు. ఎంఆర్‌పి కంటే ఎక్కువగా వాటర్ బాటిళ్లకు ధర ఎందుకు వేశారని సిబ్బందిని ప్రశ్నించాడు జీవన్ కుమార్. ఆ సమయంలో సిబ్బందితోపాటు యాజమాన్యం నుంచి సమాధానం నిర్లక్ష్యంగా వచ్చింది.

ఆపై దురుసుగా మాట్లాడారు. రెస్టారెంట్ యాజమాన్యం-సిబ్బంది తీరుతో మనస్తాపానికి గురయ్యాడు జీవన్ కుమార్. ఆ బిల్లును తీసుకుని నేరుగా కన్జ్యూమర్ కోర్టుని ఆశ్రయించాడు. జీవన్ దాఖలు చేసిన ఫిర్యాదును స్వీకరించింది వినియోగదారుల కమిషన్. రెండు వర్గాల వాదనలను కమిషన్ ఆలకించింది. చట్టం ప్రకారం ఏ వస్తువుకైనా ఎంఆర్‌పీ కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఛార్జ్ చేయడానికి వీల్లేదు.

Advertisement

రెస్టారెంట్‌కు షాకిచ్చిన కన్జ్యూమర్ కోర్టు-అమరావతి రెస్టారెంట్ ఎంఆర్‌పీ కంటే అదనంగా వసూలు చేయడం, ప్రశ్నించిన కస్టమర్‌కు సరైన సేవలు ఇవ్వడంలో ఫెయిల్ అయ్యిందని నిర్ధారణకు వచ్చారు. ఇది ముమ్మాటికీ సేవా లోపమేనని కోర్టు అభిప్రాయపడింది. ఇది వాణిజ్య పద్ధతి కిందకు వస్తుందని నిర్ధారించింది.

వాటర్ బాటిల్‌పై 3 రూపాయలు అదనంగా వసూలు చేసినందుకు రెస్టారెంట్ యాజమాన్యానికి ఏకంగా రూ. 25 వేల జరిమానా విధించింది. ఫిర్యాదుదారునికి కలిగిన మానసిక వేదనకు పరిహారంగా రూ. 20 వేలు, పిటిషన్ ఖర్చుల నిమిత్తం రూ. 5 వేలు.. మొత్తం కలిసి రూ.25 వేలు చెల్లించాలని సదరు రెస్టారెంట్‌ని ఆదేశించింది.

ALSO READ: తెలంగాణ క్రీడాకారులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్!

ఇలాంటి తీర్పు వల్ల వినియోగదారులకు హక్కుల పట్ల అవగాహన పెరుగుతుందని అంటున్నారు పలువురు. ఆ తరహా అక్రమాలకు పాల్పడే వ్యాపారులకు ఇదొక గుణపాఠం. అన్నట్లు మొన్నటికి మొన్న ఓ కస్టమర్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఓలా కంపెనీకి కన్జ్యూమర్ కోర్టు గట్టిగానే షాకిచ్చింది. మొత్తానికి కన్జ్యూమర్ కోర్టు వినియోగం క్రమంగా పెరుగుతోంది. కాకపోతే తీర్పు వేగంగా వస్తే బాగుంటుందని సగటు వినియోగదారులు చెబుతున్నారు

Related News

కొండా సురేఖ ఎపిసోడ్‌తో వేడెక్కిన రాజకీయాలు.. రేవంత్ కేబినెట్ పునర్ వ్యస్థీకరణ, ముగ్గురిపై వేటు?

అల్పపీడనం ప్రభావం.. తెలంగాణల్లో భారీ వర్షాలు, హైదరాబాద్‌లో అయితే..

హైకోర్టులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్​ కృష్ణారెడ్డికి ఎదురుదెబ్బ!

జాబ్ నోటిఫికేషన్లు నిల్.. లిక్కర్ నోటిఫికేషన్లు ఫుల్.. కాంగ్రెస్‌పై హరీశ్ రావు సెటైర్లు

కొండా సురేఖ అంశంపై సీఎం కీలక నిర్ణయం.. వివాదానికి చెక్?

కేంద్రానికి కాంగ్రెస్ మోకరిల్లింది.. స్మార్ట్ మీటర్ల కుట్రను భగ్నం చేస్తాం.. కవిత హెచ్చరిక

తెలంగాణ ప్రజలకు అలర్ట్.. 27న రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల గ్రామ సభలు

ఎల్ నినో గండం గట్టెక్కినట్లేనా.. ఆనందంలో అన్నదాతలు!

Big Stories

Advertisement
×